Pic
-
ఉపాసన.. చరణ క్లీంకారం!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు. క్లీంకారగా నామకరణం చేశారు. ఉపాసన-రామ్ చరణ్ లవ్ స్టోరీ.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరెంజ్’ సినిమా తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం ఆమె ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకుంది. వాలెంటైన్ డేను పురస్కరించుకుని ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా లవ్ సింబల్ జతచేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు లవ్లీ కపుల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే తన సిస్టర్ అనుశ్ పాల కుటుంబంతో దిగిన పిక్స్‌ను పంచుకున్నారు. ట్విన్ సిస్టర్స్‌ను కలిసిన క్లీంకార అంటూ పోస్ట్ చేసింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా హీరోయిన్గా నటిస్తోంది. ♾️❤️ pic.twitter.com/ZkNd6GeKwW — Upasana Konidela (@upasanakonidela) February 14, 2024 -
అమ్మ ఒడి ‘హాయిగా’... గున్న ఏనుగు సాక్షిగా..!
చెన్నై: తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్‌లో తప్పిపోయిన గున్న ఏనుగును తల్లి చెంతకు చేర్చారు. తల్లిని కలిసిన అనంతరం చిన్న ఏనుగు అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయింది. ఈ దృశ్యాలను అటవీ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఈ చిత్రాన్ని ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు సోషల్ మీడియాలో పంచుకోగా.. విశేష స్పందనలు వచ్చాయి. గున్న ఏనుగును తల్లి వద్దకు చేర్చినందుకు అటవీ అధికారులకు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలిపారు. అటవీ సిబ్బందికి నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు. జంతువుల్లోనైనా అమ్మ ప్రేమ ఒక్కటేనని కొనియాడారు. When a picture is worth a million words ❤️ the rescued baby elephant after uniting with the mother takes an afternoon nap in her mother's comforting arms before moving again with the big herd. Picture taken by Forest field staff somewhere in Anamalai Tiger reserve who are keeping… https://t.co/EedfkKjLHj pic.twitter.com/ttqafSudyM — Supriya Sahu IAS (@supriyasahuias) January 2, 2024 ఇదీ చదవండి: Ram Mandir: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
జీ20 సమ్మిట్: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్..
ఢిల్లీ: జీ20 సమావేశాలకు హాజరైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయన భార్య అక్షతా మూర్తి మధ్య ప్రేమానురాగాలకు సంబందించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. రిషి సునాక్‌కు స్వయంగా అక్షతా మూర్తి టై కట్టారు. ఈ దృశ్యాలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. జీ20 సమ్మిట్ కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్‌కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో తన భార్య అక్షతా మూర్తితో కలిసి దిగారు. విమానం నుంచి కిందకు దిగే క్రమంలో అక్షతా మూర్తి తన భర్త రిషి సునాక్‌కు టై కట్టారు. సునాక్ నల్లని సూటు ధరించి ఆరెంజ్ కలర్లో టై ధరించారు. అక్షతా మూర్తి తెల్లని షర్ట్‌తో కనిపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) రిషి సునాక్‌కు అక్షతా మూర్తి టై కట్టిన దృశ్యాలపై నెటిజన్లు స్పందిస్తూ.. భార్యభర్తల మధ్య ప్రేమకు నిదర్శనమని కామెంట్లు పెట్టారు. రిషి సునాక్ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ఈ దృశ్యాలు తెలుపుతున్నాయని మరికొందరు స్పందించారు. బ్యూటిఫుల్ పిక్చర్ అంటూ కామెంట్ చేశారు. అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూమార్తే. కాగా.. రిషి సునాక్, అక్షతామూర్తిలకు 2009లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. భారత్‌కు చేరుకున్న రిషి సునాక్ దంపతులకు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్వాగతం పలికారు. భారత్‌కు రావడం తనకు చాలా ప్రత్యేకమని రిషి సునాక్ తెలిపారు. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్: ఉక్రెయిన్ యుద్ధంపై ఏమని తీర్మానించారంటే.. -
ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రం
ఢిల్లీ:చంద్రయాన్ 3 ప్రాజెక్టుని ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దింపింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ అజేయంగా నిలిచింది. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్‌ని ఇస్రో తాజాగా విడుదల చేసింది. Chandrayaan-3 Mission: Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images. The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA — ISRO (@isro) September 5, 2023 చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై క్షేమంగా దిగిన ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రమిది. ఆనాగ్రిఫ్ టెక్నిక్‌ను ఉపయోగించి ఇస్రో ఈ చిత్రాన్ని రూపొందించింది. -
మస్క్ కొడుకుని చూశారా? బుడతడు భలే ఉన్నాడే...
ప్రపంచ టాప్ బిలియనీర్, టెస్లా, ఎక్స్ (ట్విటర్) సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన గురించి చాలా మందికి తెలుసు. కానీ ఎలాన్ మస్క్ కొడుకుని ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో ఇక్కడ చూడండి.. తన సోషల్ మీడియా సంస్థకు చెందిన ‘ఎక్స్’ లోగో ముందు నిలబడి ఉన్న తన కొడుకు ఎక్స్ ఏఈఏ-12 (పేరు) ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు ఎలాన్ మస్క్. ముద్దులొలుకుతున్న మస్క్ కొడుకు ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఖాకీ రంగు నిక్కరు, టెస్లా లోగోతో ఉన్న వైట్ టీషర్ట్ వేసుకున్న ఈ మూడేళ్ల బుడతడు బోసినవ్వులతో కెమెరాకు ఫోజుచ్చాడు. ఈ ఫొటోకు 75 మిలియన్లకు పైగా వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. బుడతడు భలే ఉన్నాడే అంటూ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. ఎక్స్ ఏఈఏ-12 (X AE A-XII) 2020లో జన్మించాడు. కెనడియన్ మ్యుజీషియన్ గ్రిమ్స్‌తో ఎలాన్ మస్క్‌కి ఈ బాలుడు మొదటి సంతానం. విచిత్రంగా ఉన్న ఈ పిల్లాడి పేరు గురించి తల్లి గ్రిమ్స్ గతంలో వివరణ ఇచ్చినా చాలా మందికి సరిగ్గా అర్థం కాలేదు. కొత్తగా బావుందని మాత్రం అందరూ కితాబు ఇచ్చారు. మస్క్- గ్రిమ్స్ జంట 2022లో సరోగసి ద్వారా ఎక్సా డార్క్ సైడెరెల్ మస్క్ అనే కుమార్తె పొందారు. 2018 నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట 2021 సెప్టెంబర్‌లోనే విడిపోయారు. తర్వాత 2021 నవంబర్‌లో షివోన్ జిలిస్‌తో కవలలను కన్నారు. కాగా కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌తో మస్క్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. pic.twitter.com/gcSXLMwsua — Elon Musk (@elonmusk) August 25, 2023 -
హీరోలా ఉన్న ఈ బిజినెస్మెన్ ఎవరో గుర్తుపట్టారా?
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రముఖ పారిశ్రామిక వేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఈ రోజు ఎలా ఉంటాడనేది అందరికి తెలుసు. అయితే ఒకప్పుడు యువకుడుగా ఉన్న సమయంలో ఎలా ఉండేవాడని చాలా మందికి తెలియకపోవచ్చు. టాటా గ్రూప్ ఉన్నతికి ఎంతో కృషి చేసిన ఈయన యంగేజ్‌లో హీరోలా ఉండటం ఇక్కడ చూడవచ్చు. కరోనా సమయంలో దేశ ప్రజల కోసం వేల కోట్లు వెచ్చించిన ఈ నిరాడంబరురుని సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను కూడా ప్రధానం చేసింది. సామాన్య ప్రజలకు సైతం కారు అందుబాటులో ఉండాలనే సదుద్దేశ్యంతో నానో కారుని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈయన సొంతమే. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ ప్రస్తుతం టాటా నానో ఎలక్ట్రిక్ కారుగా విడుదలకావడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రతన్ టాటా కలల కారు ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలైతే బడా సంస్థలకు కూడా గట్టిపోటీ ఇస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఎనిమిది పదుల వయసు దాటిన తరువాత కూడా దేశం కోసం ఆలోచించే మహానుభావుడు రతన్ టాటా అనటంలో ఎటువంటి సందేహం లేదు. -
ఆనంద్ మహీంద్ర అద్భుతమైన పోస్ట్: నెటిజన్లు ఫిదా
సాక్షి,ముంబై: పారిశశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ విజ్ఞాన, వినోద అంశాలను అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో తాజాగా అద్భుతమైన ఫోటోను పంచుకున్నారు. వజ్రోత్సవాల వేళ మువ్వన్నెల జాతీయ జెండా రంగులతో ప్రకృతిలో సహజంగా పరుచుకున్న రమణీయమైన దృశ్యాన్ని షేర్ చేశారు. అంతేకాదు శత సంవత్సరాల దాకా ప్రతీ రోజూ ఈ రంగులు, ఈ దృశ్యం ఆవిష్కృతం కావాలని ఆయన అభిలషించారు. పైన వెలుగులు చిమ్ముతున్న సూరీడు, మధ్యలో నిర్మల ఆకాశం.. దిగువన పచ్చటి పంటచేలతో అలుముకున్న ఆకుపచ్చని రంగుతో చూడ ముచ్చటగా ఉన్న ఈ పిక్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా 75 వసంతాల స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాల్లో ఈ ఫోటో మరింత ఆకర్షణీయంగా నిలిచింది. (Reliance Jio 5G Phone: జియో మరో సంచలనం?12 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్) ఇదీ చదవండి :వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది, అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ May all days dawn with these colours from now on. Onwards to the 100th anniversary of our Independence… 🇮🇳 pic.twitter.com/6H75bunovc — anand mahindra (@anandmahindra) August 16, 2022 -
ఫేస్బుక్ ఏం చేసిందంటే..
కాలిఫోర్నియా: సోషల్ నెట్ వర్కింగ్ సైట్ దిగ్గజం ఫేస్బుక్ చేసిన పొరపాటును సరిదిద్దుకుంది. ఒక ప్లస్-సైజు మోడల్ ఇమేజ్ ను తిరస్కరించి తప్పు చేశామంటూ క్షమాపణలు చెప్పింది. సదరు యాడ్ ను పరిశీలించే క్రమంలో తమ ఉద్యోగుల బృందం తప్పుగా అర్థం చేసుకుందని , దీనికి చింతిస్తున్నామని వివరణ ఇచ్చింది. శరీర సానుకూలతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమంలో న్యూయార్క్‌కి చెందిన సంస్థ టెస్ హాలీడే ఓ యాడ్ లో కనిపిస్తుంది. ఇది అవాంఛనీయ పద్ధతిలో, శరీర భాగాలు వర్ణిస్తుందంటూ ఫేస్ బుక్అభ్యంతరం తెలిపింది.. బికినీ ధరించిన ఈ ప్లస్ సైజ్ మోడల్ యాడ్ ఇమేజ్‌ని పెట్టేందుకు మొదట అనుమతి నిరాకరించింది. తమ సంస్థ నిబంధనలకు అనుగుణంగా లేదని పేర్కొంది. దీనిపై ఆస్ట్రేలియన్ స్త్రీవాదులు ఓ టీవీ టాక్ షో లో మండిపడ్డారు. ఈ క్రమంలో పొరపాటు గ్రహించిన ఫేస్బుక్ స్పందించింది. ఇది తమ నిబంధనలకు విరుద్ధంగా లేదని స్పష్టం చేసింది. మళ్లీ పునరాలోచించి ఆ యాడ్‌కి ఓకే చెబుతున్నట్టు ప్రకటించింది. తమ ఉద్యోగుల బృందం వారానికి లక్షల సంఖ్యలో యాడ్ ఇమేజ్‌లను పరిశీలించి వాటిని అనుమతిస్తారని పేర్కొంది. ఈ క్రమంలో వారు తప్పుగా అర్థం చేసుకున్నారని , అందుకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొంది. ఆ యాడ్ ఇమేజ్ తమ యాడ్ పాలసీలకు అనుగుణంగానే ఉందని గ్రహించిన తర్వాత దాన్ని ఫేస్బుక్లో పెట్టేందుకు అనుమతిచ్చామని పేర్కొంది. -
భారత్ బ్యాట్స్ ఉమన్ షూ లేస్ కట్టిన పాక్ క్రికెటర్!
భారత్- పాక్ మధ్య క్రికెట్ అంటే దాదాపు యుద్ధం స్థాయిలో సాగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మొన్న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్‌తో పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ సరదాగా నవ్వుతూ మాట్లాడటం చూస్తుంటే ఉద్రిక్తతలు చాలావరకు తగ్గినట్లే అనిపించింది. మహిళల క్రికెట్లోనూ ఇలాంటి సంఘటనే ఒకటి కెమెరాకు చిక్కింది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో శనివారం జరిగిన భారత్, పాక్ మహిళల టి20 క్రికెట్ మ్యాచ్ సందర్భంలో పాకిస్తానీ క్రికెట్ జట్టుకు చెందిన ఆనం ఆమిన్.. ఇండియన్ బ్యాట్స్ ఉమన్ హర్‌ప్రీత్ కౌర్ షూ లేసును కట్టడం అందర్నీ ఆకట్టుకుంది. ఆ మ్యాచ్‌లో ఇండియా జట్టు పాకిస్తాన్ చేతిలో కేవలం రెండు పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. అయితేనేం భారత్ క్రికెటర్‌కు షూ లేస్ కడుతూ ఆమిన్ స్పందించిన తీరు అందరి హృదయాలను గెలుచుకుంది. క్రికెట్ అభిమానుల్లో స్ఫూర్తిని రగిల్చింది. కెమెరాకు చిక్కిన ఈ చిత్రం.. భారత్, పాకిస్తాన్ దేశాల్లోని అభిమానుల ప్రశంసలను అందుకుంటోంది.