ఫేస్బుక్ ఏం చేసిందంటే.. | Facebook blocks pic of plus-size model Tess Holliday, apologises later | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ ఏం చేసిందంటే..

Published Wed, May 25 2016 11:01 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

ఫేస్బుక్ ఏం చేసిందంటే.. - Sakshi

ఫేస్బుక్ ఏం చేసిందంటే..


కాలిఫోర్నియా:  సోషల్ నెట్ వర్కింగ్   సైట్ దిగ్గజం ఫేస్‌బుక్  చేసిన పొరపాటును సరిదిద్దుకుంది.    ఒక ప్లస్-సైజు మోడల్   ఇమేజ్  ను తిరస్కరించి తప్పు చేశామంటూ క్షమాపణలు చెప్పింది.   సదరు యాడ్ ను పరిశీలించే క్రమంలో తమ  ఉద్యోగుల బృందం తప్పుగా అర్థం చేసుకుందని , దీనికి చింతిస్తున్నామని వివరణ ఇచ్చింది.

 శరీర సానుకూలతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమంలో న్యూయార్క్‌కి చెందిన సంస్థ  టెస్‌ హాలీడే  ఓ యాడ్ లో   కనిపిస్తుంది.    ఇది అవాంఛనీయ పద్ధతిలో,   శరీర భాగాలు వర్ణిస్తుందంటూ   ఫేస్ బుక్అభ్యంతరం తెలిపింది..  బికినీ ధరించిన ఈ ప్లస్ సైజ్ మోడల్ యాడ్ ఇమేజ్‌ని పెట్టేందుకు  మొదట అనుమతి నిరాకరించింది.  తమ సంస్థ నిబంధనలకు అనుగుణంగా లేదని  పేర్కొంది. దీనిపై  ఆస్ట్రేలియన్ స్త్రీవాదులు  ఓ టీవీ టాక్ షో లో మండిపడ్డారు.    ఈ క్రమంలో పొరపాటు గ్రహించిన  ఫేస్‌బుక్‌ స్పందించింది.   ఇది తమ నిబంధనలకు విరుద్ధంగా లేదని స్పష్టం చేసింది.  మళ్లీ పునరాలోచించి ఆ యాడ్‌కి ఓకే చెబుతున్నట్టు ప్రకటించింది.

తమ ఉద్యోగుల బృందం వారానికి లక్షల సంఖ్యలో యాడ్‌ ఇమేజ్‌లను పరిశీలించి వాటిని అనుమతిస్తారని పేర్కొంది. ఈ క్రమంలో వారు  తప్పుగా అర్థం చేసుకున్నారని , అందుకు క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొంది. ఆ యాడ్‌ ఇమేజ్‌ తమ యాడ్‌ పాలసీలకు అనుగుణంగానే ఉందని గ్రహించిన తర్వాత దాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టేందుకు అనుమతిచ్చామని పేర్కొంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement