ఉపాసన.. చరణ క్లీంకారం! | Upasana Konidela Shares Memorable Pic On The Occassion Of Valentines Day, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Upasana Valentines Day Post: వాలెంటైన్ డే స్పెషల్.. ఉపాసన.. చరణ క్లీంకారం!

Published Wed, Feb 14 2024 9:04 AM | Last Updated on Wed, Feb 14 2024 10:40 AM

Upasana Shares Memorable Pic on The Occassion Of valentines Day - Sakshi

మెగా హీరో, గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు.  క్లీంకారగా నామకరణం చేశారు. 

ఉపాసన-రామ్ చరణ్ లవ్‌ స్టోరీ.. 

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరెంజ్’ సినిమా తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం ఆమె ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఇవాళ వాలెంటైన్స్‌ డే సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకుంది. 

వాలెంటైన్‌ డేను పురస్కరించుకుని ఉపాసన తాజాగా పోస్ట్‌ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన‌ దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న  ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా లవ్ సింబల్‌ జతచేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు లవ్‌లీ కపుల్స్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే తన సిస్టర్‌ అనుశ్ పాల కుటుంబంతో దిగిన పిక్స్‌ను పంచుకున్నారు.  ట్విన్ సిస్టర్స్‌ను కలిసిన క్లీంకార అంటూ పోస్ట్ చేసింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా హీరోయిన్‌గా నటిస్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement