Anand Mahindra Shares a Beautiful Pic Resembling Tricolours - Sakshi
Sakshi News home page

Anand Mahindra: ఆనంద్‌ మహీంద్ర అద్భుతమైన పోస్ట్‌: నెటిజన్లు ఫిదా

Published Tue, Aug 16 2022 4:57 PM | Last Updated on Tue, Aug 16 2022 7:22 PM

Anand Mahindra shares a beautiful pic resembling tricolours - Sakshi

సాక్షి,ముంబై: పారిశశ్రామిక వేత్త, బిలియనీర్‌ ఆనంద్‌ మహీంద్ర మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ విజ్ఞాన, వినోద అంశాలను అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో తాజాగా అద్భుతమైన ఫోటోను పంచుకున్నారు. వజ్రోత్సవాల వేళ మువ్వన్నెల జాతీయ జెండా రంగులతో ప్రకృతిలో సహజంగా పరుచుకున్న​ రమణీయమైన దృశ్యాన్ని షేర్‌ చేశారు. అంతేకాదు శత సంవత్సరాల దాకా ప్రతీ రోజూ ఈ రంగులు, ఈ దృశ్యం  ఆవిష్కృతం కావాలని ఆయన  అభిలషించారు.  

పైన వెలుగులు చిమ్ముతున్న సూరీడు, మధ్యలో నిర్మల ఆకాశం.. దిగువన పచ్చటి పంటచేలతో అలుముకున్న ఆకుపచ్చని రంగుతో చూడ ముచ్చటగా ఉన్న ఈ పిక్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా 75 వసంతాల స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాల్లో  ఈ  ఫోటో మరింత ఆకర్షణీయంగా నిలిచింది. (Reliance Jio 5G Phone: జియో మరో సంచలనం?12 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌)

ఇదీ చదవండి :వన్‌ప్లస్‌ 10టీ 5జీ  వచ్చేసింది, అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement