![Young woman slapped a young man who chased him in the name of love - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/22/kottu-kottu.jpg.webp?itok=w4vbiQem)
సాక్షి, కామారెడ్డి: ప్రేమపేరుతో వెంటపడి వేధించిన యువకుడిని నడిరోడ్డుపై ఓ యువతి చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డిలో జరిగింది. గత నెల రోజులుగా యువతిని శంకర్ అనే ఆకతాయి యువకుడు ఫాలో అవుతూ వేధించాడు.
ఈ క్రమంలోనే మంగళవారం ప్రేమిస్తున్నానంటూ యువతిని ఫోన్ నంబర్ అడటంతో యువతి ఆగ్రహంతో అపరకాళి అవతారమెత్తింది. జనం సమక్షంలోనే చెప్పుతోకొట్టి, దేహ శుద్ధి చేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment