
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభలో యువతకు ప్రాతినిధ్యం తగ్గింది. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుగల ఎమ్మెల్యేలు 2014 సభలో 12 మంది ఉండ గా, కొత్త శాసనసభలో వీరి సంఖ్య 5కు తగ్గింది. పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఈ మేరకు గురువారం ఒక నివేదిక విడుదల చేసింది. ఐదు రాష్ట్రాలకు కొత్త శాసనసభలు కొలువుదీరనున్న నేపథ్యంలో ఆయా గణాంకాలు విశ్లేషించింది. 61 శాతం ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారని వివరించింది. గత సభలోని వారు 73 మంది తిరిగి ఎన్నికవగా 46 మంది కొత్తగా ఎన్నికయ్యారని తెలిపింది. 2014లో 9 మంది మహిళలు ఎన్నికవగా ఈసారి ఆ సంఖ్య 5 మాత్రమే. ఇక 41–55 మధ్య వయస్కుల్లో 2014లో 67 మంది ఎన్నికవగా.. ఈ సభలోనూ 67 మంది ఎమ్మెల్యేలు ఇదే కేటగి రీలో ఉన్నారు.
56–70 మధ్య వయస్కులు పాత సభలో 40 మంది ఉండగా, ఈసారి 45 మంది ఉన్నారు. 71 ఏళ్ల వయసు పైబడినవారు గత సభలో ఎవరూ లేరు. ఈసారి ఇద్దరు ఉన్నారు. విద్యకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆపైన విద్యార్హత ఉన్న వారి సంఖ్య 19 నుంచి 26కు పెరి గింది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారి సంఖ్య 60 నుంచి 43కు తగ్గింది. 12వ తరగతి వరకు విద్యార్హత కలిగిన వారి సంఖ్య 37 నుంచి 45కు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో 25–40 మధ్య వయçస్కుల్లో గత సభలో కేవలం ఆరుగురు ఉండగా.. ఈసారి 25కు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మహిళల ప్రాతినిధ్యం 10 నుంచి 13కు పెరి గింది. 90 స్థానాలకు 13 మంది మహిళల ప్రాతిని థ్యం ఉండటం విశేషం. మిజోరంలో మాత్రం గత సభలో ఒక మహిళా సభ్యురాలు ఉండగా ఈసారి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం.