PRS Legislative Research
-
PRS Legislative Research: నిర్ణీత సమయానికి మించి పనిచేసిన పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో లోక్‌సభ, రాజ్యసభలు షెడ్యూల్ సమయానికి మించి పనిచేశాయి. 17వ లోక్‌సభ సెషన్లలో ఎటువంటి వాయిదాలు లేకుండా పూర్తి సమయంపాటు కార్యకలాపాలు కొనసాగించిన ఏకైక సెషన్ కూడా ఇదే. ఈ విషయాలను పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ తెలిపింది. గురువారంతో ముగిసిన ఈ ప్రత్యేక సెషన్లో 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానం, చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ జరిగింది. ఒకే ఒక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. స్పెషల్ సెషన్లో లోక్‌సభ షెడ్యూల్ సమయం 22 గంటల 45 నిమిషాలు కాగా ఎనిమిదిగంటల కంటే ఎక్కువగా మొత్తం 31 గంటలపాటు పనిచేయడం విశేషం. దీంతో, లోక్‌సభ 137 శాతం ఎక్కువ సమయం పనిచేసింది. అదే విధంగా, రాజ్యసభ షెడ్యూల్ సమయం 21 గంటల 45 నిమిషాలు కాగా, 27 గంటల 44 నిమిషాల సేపు కార్యకలాపాలు సాగాయి. దీంతో, రాజ్యసభ 128 శాతం ఎక్కువ సమయం పనిచేసినట్లయిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివరించింది. -
27సార్లు అవిశ్వాసాలు.. ఒక్కటీ నెగ్గలేదు
స్వతంత్ర భారత చరిత్రలో లోక్‌సభలో ఇప్పటిదాకా ఏకంగా 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెగ్గలేదు. వాటి కారణంగా ఒక్కసారి కూడా కేంద్రంలో ప్రభుత్వం పడిపోలేదు. అయితే ప్రభుత్వమే కోరి తెచ్చుకునే విశ్వాస పరీక్షల్లో మాత్రం కనీసం మూడుసార్లు ప్రభుత్వాలు పడిపోయినట్టు పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే అధ్యయన సంస్థ పేర్కొంది. ఇందిరపై అత్యధికంగా 15 ‘అవిశ్వాసాలు’ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఏకంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ప్రధాని హయాంలో ఇదే అత్యధికం! ► ఇందిరపై తొలి అవిశ్వాసాన్ని 1966లో ఆమె అధికారంలోకి రాగానే కమ్యూనిస్టు దిగ్గజం హీరేంద్రనాథ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. కేవలం 61 మంది ఎంపీలే మద్దతివ్వగా 270 మంది వ్యతిరేకించారు.1966లోనే ఆమెపై రెండో అవిశ్వాసమూ వచి్చంది. తర్వాత 1967, 1968 (రెండుసార్లు), 1969, 1970, 1973, 1974 (రెండుసార్లు), 1975 (రెండుసార్లు–రెండోసారి ఎమర్జెన్సీ విధింపుకు కేవలం నెల రోజుల ముందు), 1976, 1978, 1981 (రెండుసార్లు), 1982ల్లో ఇందిరపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ► 1976లో ఇందిర ప్రభుత్వంపై బీజేపీ (నాటి జనసంఘ్) మేరునగం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రవేశపెట్టడం విశేషం! దానికి ఏకంగా 162 మంది ఎంపీలు మద్దతిచ్చారు! ఒక అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వచి్చన అత్యధిక ఓట్లు ఇవే. 257 మంది వ్యతిరేకంచడంతో తీర్మానం వీగిపోయింది. ఇదీ చరిత్ర... ► స్వతంత్ర భారత చరిత్రలో తొట్టతొలి అ విశ్వాస తీర్మానం 1963లో లోక్‌సభ తలుపు తట్టింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే చెందిన ఆచార్య కృపాలనీ దీన్ని ప్రవేశపెట్టడం విశేషం. 1962లో చైనాతో యుద్ధంలో ఓటడిన వెంటనే కృపాలనీ ఈ చర్యకు దిగారు. దీనిపై ఏకంగా 4 రోజుల పాటు 20 గంటలకు పైగా చర్చ జరిగింది. కేవలం 62 మంది ఎంపీలు మాత్రమే దీన్ని సమరి్థంచారు. 347 మంది వ్యతిరేకించడంతో చివరికి తీర్మానం వీగిపోయింది. ► లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంపై 1964లో ఎన్సీ ఛటర్జీ 1965లో ఎస్.ఎన్.ది్వవేది, స్వతంత్ర పార్టీ ఎంపీ ఎం.ఆర్.మసానీ ప్రవేశపెట్టారు. ► 1979లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ రాజీనామాకు దారితీసింది. తీర్మానంపై ఓటింగ్ జరగక చర్చ అసంపూర్తిగా మిగిలిపోయినా ఆయన స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం! ► 2003లో వాజ్‌పేయీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్ష నేత హోదాలో నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. కేవలం 189 మంది ఎంపీలు మద్దతివ్వగా, 314 మంది వ్యతిరేకించారు. దాంతో 21 గంటల చర్చ అనంతరం తీర్మానం వీగిపోయింది. ► 2018 మోదీ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి 135 మంది ఎంపీలు మద్దతివ్వగా 330 మంది వ్యతిరేకించారు. పీవీపై మూడుసార్లు తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రభుత్వం మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొంది! తొలిసారి 1992లో బీజేపీ ఎంపీ జశ్వంత్‌సింగ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అధికార, విపక్షాలపై లోక్‌సభ వేదికగా నువ్వా నేనా అన్నట్టుగా పోరాటం జరిగింది. ఏకంగా 225 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతిచ్చారు. 271 మంది వ్యతిరేకించడంతో తీర్మానం వీగిపోయి పీవీ సర్కారు ఊపిరి పీల్చుకుంది! 1992లోనే పీవీ ప్రభుత్వంపై వాజ్‌పేయీ, 1993లో అజయ్ ముఖోపాధ్యాయ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రాజీవ్ సర్కారుపై మన ఎంపీ మాధవరెడ్డి... ► 1987లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ టీడీపీ ఎంపీ సి.మాధవరెడ్డి కావడం విశేషం! అయితే అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జరుగుబాటు అంతంతే
న్యూఢిల్లీ: కీలకమైన అసెంబ్లీ సమావేశాలను రాష్ట్రాలు తక్కువ రోజుల్లోనే మమ అనిపిస్తున్నాయని మేధో సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ తాజా గణాంకాలు చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా 2016 ఏడాది నుంచి అసెంబ్లీ సమావేశమైన రోజులు ఏటా తగ్గుతూ వస్తున్నాయని అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. అధ్యయనం ప్రకారం.. ► 2022లో 28 రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు సగటున కేవలం 21 రోజులే జరిగాయి. ► కర్ణాటకలో అత్యంత ఎక్కువగా 45 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్( 42 రోజులు), కేరళ(41 రోజులు) నిలిచాయి. ► ఎక్కువ రాష్ట్రాల్లో ఏడాదిలో రెండు లేదా మూడుసార్లు సెషన్స్ పెడుతున్నారు. జనవరి–మార్చి మధ్య బడ్జెట్ పద్దు సందర్భంగా ఒక సెషన్. వర్షాకాల, శీతాకాల సమావేశాల కోసం మరో రెండు. ► ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కలుపుకుని 12 రాష్ట్రాల్లో గత ఏడాది కేవలం రెండు సెషన్స్‌యే జరిగాయి. ► మొత్తంగా సమావేశ రోజుల్లో బడ్జెట్ కోసమే 61 శాతం రోజులను కేటాయిస్తున్నారు. తమిళనాడులో ఏకంగా 90 శాతం సిట్టింగ్స్ ఒక్క బడ్జెట్ సెషన్‌తోనే గడిచిపోయింది. 80శాతానికి మించి సెషన్స్‌తో గుజరాత్, రాజస్తాన్ అదే బాటలో పయనించాయి. ► 20 రాష్ట్రాల్లో సగటు సమావేశాల కాలం కేవలం ఐదు గంటలు. మహారాష్ట్రలో మాత్రమే ఈ సగటు ఎనిమిది గంటలుగా నమోదైంది. సిక్కింలో అత్యల్పంగా రెండు గంటలే సెషన్ నడిచింది. ► 2016–2022 కాలంలో 24 రాష్ట్రాల్లో సగటు సమావేశాల కాలం కేవలం పాతిక రోజులు. కేరళలో ఏడాదికి గరిష్ఠంగా 48 రోజులు అసెంబ్లీ నడిచింది. ఒడిశా(41 రోజులు), కర్ణాటక(35 రోజులు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ► 2016 ఏడాది నుంచి సెషన్ రోజులు తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ ఆంక్షల ధాటికి 2020లో ఈ సంఖ్య దారుణంగా పడిపోయింది. ► 2016లో 24 రాష్ట్రాల్లో సగటున 31 రోజులు, 2017లో 30 రోజులు, 2018లో 27 రోజులు, 2019లో 25 రోజులు, 2020లో 17 రోజులు, 2021లో 22 రోజులు సమావేశాలు నిర్వహించారు. ► అసెంబ్లీ సభ్యులను ప్రాతిపదికగా తీసుకుని సమావేశాల సంఖ్యపై కనీస పరిమితిని విధించుకుంటే మంచిదని రాజ్యాంగ పనితీరుపై సమీక్షకు జాతీయ కమిషన్(ఎన్సీఆర్డబ్ల్యూసీ) గతంలో రాష్ట్రాలను సూచనలు పంపడం గమనార్హం. ► కర్ణాటక, రాజస్తాన్, యూపీ వంటి రాష్ట్రాలు సంబంధిత లక్ష్యాలు నిర్దేశించుకున్నా అవి నెరవేరలేదు. ► రాజ్యాంగం నిర్దేశిన ప్రకారం ప్రతీ రాష్ట్రం తమ పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలి. 2022లో 20 రాష్ట్రాల్లో బడ్జెట్‌పై చర్చకాలం సగటు కేవలం ఎనిమిది రోజులే. ఒక్క తమిళనాడు మాత్రమే 26 రోజులపాటు బడ్జెట్‌పై చర్చించింది. కర్ణాటక(15 రోజులు), కేరళ(14 రోజులు), ఒడిశా(14 రోజులు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ► ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్ రెండ్రోజుల్లో ముగించగా, నాగాలాండ్ ఒక్కరోజుతో సరిపెట్టింది. ► 2022లో 28 రాష్ట్రాల్లో సగటున 21 బిల్లులు ఆమోదం పొందాయి. అస్సాంలో గరిష్టంగా 85 బిల్లులకు ఆమోదముద్ర పడింది. తమిళనాడు(51), గోవా(38) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► విశ్లేషణాత్మక చర్చలేకుండానే ప్రభుత్వాలు బిల్లులను పాస్ చేస్తున్నాయి -
అసెంబ్లీలో తగ్గిన ‘యువ’ ప్రాతినిథ్యం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభలో యువతకు ప్రాతినిధ్యం తగ్గింది. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుగల ఎమ్మెల్యేలు 2014 సభలో 12 మంది ఉండ గా, కొత్త శాసనసభలో వీరి సంఖ్య 5కు తగ్గింది. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఈ మేరకు గురువారం ఒక నివేదిక విడుదల చేసింది. ఐదు రాష్ట్రాలకు కొత్త శాసనసభలు కొలువుదీరనున్న నేపథ్యంలో ఆయా గణాంకాలు విశ్లేషించింది. 61 శాతం ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారని వివరించింది. గత సభలోని వారు 73 మంది తిరిగి ఎన్నికవగా 46 మంది కొత్తగా ఎన్నికయ్యారని తెలిపింది. 2014లో 9 మంది మహిళలు ఎన్నికవగా ఈసారి ఆ సంఖ్య 5 మాత్రమే. ఇక 41–55 మధ్య వయస్కుల్లో 2014లో 67 మంది ఎన్నికవగా.. ఈ సభలోనూ 67 మంది ఎమ్మెల్యేలు ఇదే కేటగి రీలో ఉన్నారు. 56–70 మధ్య వయస్కులు పాత సభలో 40 మంది ఉండగా, ఈసారి 45 మంది ఉన్నారు. 71 ఏళ్ల వయసు పైబడినవారు గత సభలో ఎవరూ లేరు. ఈసారి ఇద్దరు ఉన్నారు. విద్యకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆపైన విద్యార్హత ఉన్న వారి సంఖ్య 19 నుంచి 26కు పెరి గింది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారి సంఖ్య 60 నుంచి 43కు తగ్గింది. 12వ తరగతి వరకు విద్యార్హత కలిగిన వారి సంఖ్య 37 నుంచి 45కు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో 25–40 మధ్య వయçస్కుల్లో గత సభలో కేవలం ఆరుగురు ఉండగా.. ఈసారి 25కు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మహిళల ప్రాతినిధ్యం 10 నుంచి 13కు పెరి గింది. 90 స్థానాలకు 13 మంది మహిళల ప్రాతిని థ్యం ఉండటం విశేషం. మిజోరంలో మాత్రం గత సభలో ఒక మహిళా సభ్యురాలు ఉండగా ఈసారి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. -
రాజ్యసభలో 10 కోట్లు వృధా
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లాగానే శీతాకాల సమావేశాలు కూడా దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. లోక్‌సభకన్నా రాజ్యసభ సమావేశాలు ఇంకా హుందాగా కొనసాగాలి. అందుకనే దాన్ని ‘పెద్దల సభ’ అని పిలుస్తారు. కానీ ఈసారి రాజ్యసభ సమావేశాలు 50 శాతం కూడా సక్రమంగా నడవలేదు. నిర్దిష్టమైన అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగిందీ కేవలం 14 శాతమే. ఒక్కో సభ నిర్వహణకు ఒక్కో నిమిషానికి 29 వేల రూపాయల ప్రజా ధనం వృధా అవుతుంది. ఈ లెక్కన గంటకు 17.4 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంతరాయాలు, వాయిదాల కారణంగా రాజ్యసభ కాలం 55 గంటలు వృధా అయిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసర్చ్ వెల్లడించింది. అంటే పది కోట్ల రూపాయల ప్రజాధనం మురికి కాల్వలో పోసినట్టయింది. దీనికి ఎవరిని నిందించాలి?