
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు తమకు మైక్ ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. ఆదివారం సభ వాయిదా పడిన అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై సద్విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలను సీఎం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, ఈ విషయంలో తమకు సహకరించాలని కోరారు. అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ సభ్యులు కూర్చుని మాట్లాడుకునేందుకు కనీసం గది కూడా లేదని, వెంటనే తమకు ప్రత్యేక రూం కేటాయించాలని స్పీకర్‌ను కోరారు.