Samantha Shares Young Age 16 Years Look In Instagram Stories, Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha Young Age Looks: పదహారేళ్ల స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Published Tue, Apr 25 2023 6:28 PM | Last Updated on Tue, Apr 25 2023 6:51 PM

Samantha Shares young Age 16 years Look in Instagram Stories - Sakshi

స్టార్ హీరోయిన్ అనే హోదా అందరికీ రాదు. చాలా కొద్దిమందికే అలాంటి అదృష్టం కలిసి వస్తుంది. గ్లామర్‌ ఫీల్డ్‌లో కొన్నేళ్లపాటు స్టార్‌గా ఉండాలంటే అంతా సులభం కాదు. మరీ ఎక్కువగా హీరోయిన్లు నిలదొక్కుకోవడం సవాళ్లతో కూడుకున్న విషయం. అలాంటిది 13 ఏళ్లుగా మూవీస్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలు బ్లాక్‌ బస్టర్లుగా నిలిచాయి. 

అంతే కాకుండా ఓ టాలీవుడ్ స్టార్ హీరో కూమారుడిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకుని.. మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రాణాంతక వ్యాధి చుట్టుముట్టినా కూడా కోలుకుని ముందడుగేసింది. ఎంత బాధలో ఉన్నా కూడా సినిమాలపై దృష్టి సారించింది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు.. ఇటీవలే శాకుంతలం సినిమాతో మెప్పించిన సమంత. ఆమె నటించిన శాకుంతలం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

'ఏ మాయ చేశావే' అనే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది సామ్. బృందావనం, దూకుడు , ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.  

అయితే తాజాగా సమంత పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాను 16 ఏళ్ల వయసులో ఉన్న అరుదైన ఫోటోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆ వయసులో సమంత లుక్ చూసి సంబర పడిపోతున్నారు. మీరు ఆ పిక్ చూస్తే ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ సమంతనా అనకుండా ఉండలేరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement