బతికున్న తండ్రిని ‘చంపేశాడు’! | Living father 'killed'! | Sakshi
Sakshi News home page

బతికున్న తండ్రిని ‘చంపేశాడు’!

Published Fri, Nov 4 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

బతికున్న తండ్రిని ‘చంపేశాడు’!

బతికున్న తండ్రిని ‘చంపేశాడు’!

రుణం తీసుకోవడానికి తనయుడి నిర్వాకం
నకిలీ పత్రాలు సృష్టించి స్థిరాస్తి ‘విక్రయం’
ఫైనాన్‌‌స సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం
నిందితుడి అరెస్టు 

సిటీబ్యూరో: తండ్రి ఆస్తిపై రుణం తీసుకోవడానికి ఓ సుపుత్రుడు భారీ స్కెచ్ వేశాడు. బతికున్న తండ్రి చనిపోరుునట్లు నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు స్నేహితుడికి స్థిరాస్తిని విక్రరుుస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నాడు. మరో ఆరుగురితో కలిసి కథనడిపి ఫైనాన్‌‌స సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం తీసుకున్నాడు. వారుుదాలు చెల్లించకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సీసీఎస్ పోలీసులు నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. సికింద్రాబాద్‌లోని కాకగూడ వాసవీనగర్‌కు చెందిన కె.వెంకటేశ్వరరావు కొన్నాళ్లుగా మస్కట్‌లో ఉంటున్నారు. ఈయన కుమారుడైన కె.సుధాకర్ ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్నాడు. వీరికి కాకగూడలో ఉన్న ఇంటిపై కన్నేసిన సుధాకర్ దాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని భావించాడు. దీని కోసం తన స్నేహితుడైన ఎ.వరప్రసాద్‌తో పాటు ఎ.రాజ్యలక్ష్మి, కిరణ్, వెంటకరెడ్డి, సుధాకర్‌రెడ్డి, కనకాంబరరావు, నాగేంద్రలతో కలిసి రంగంలోకి దిగాడు. తొలుత తన తండ్రి వెంకటేశ్వరరావు చనిపోరుునట్లు ఓ మరణ ధ్రువీకరణ పత్రాన్ని తయారు చేశారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డ్ దీన్ని జారీ చేసినట్లు రూపొందించాడు.

దీంతో పాటు ఇతర పత్రాలను సృష్టించిన సుధాకర్ వాసవినగర్‌లో ఉన్న ఇంటిని తన స్నేహితుడు వరప్రసాద్‌కు విక్రరుుస్తున్నట్లు సేల్‌డీడ్ చేశాడు. వీటి ఆధారంగా అంతా కలిసి మాగ్న ఫైనాన్‌‌స సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం తీసుకున్నారు. దీని వారుుదాలు చెల్లించడంలో విఫలం కావడంతో కంపెనీకి చెందిన వారు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీలు జోగయ్య, కె.రామ్‌కుమార్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ బి.రవీందర్‌రెడ్డి గురువారం సుధాకర్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement