నాగార్జున సాగర్, న్యూస్‌లైన్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్‌ను ఆదివారం మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబులాల్ గౌర్ సందర్శించారు. ఆయనకు పోలీసు, రెవెన్యూ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందన చేశారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడంలో భాగంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సాగర్‌కు వచ్చారు. రాత్రి ఇక్కడే బసచేసి ఉదయం సాగర్ డ్యామ్ ను సందర్శిస్తారు. అనంతరం నెల్లూరు మైపాడు బీచ్‌ను సందర్శించేందుకు వెళ్తారు. అక్కడ నుంచి ఆయన తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో మిర్యాలగూడెం ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, సీఐ ఆనంద్‌రెడ్డి, ఎస్‌ఐ సుధాకర్, ఆర్ శరత్‌చంద్ర ఉన్నారు.
మధ్యప్రదేశ్ హోంమంత్రికి ఘన స్వాగతం
Published Mon, Dec 30 2013 2:59 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement