
సాక్షి, ముంబై: రజనీకాంత్ వీరాభిమాని ఒకరు చేసిన సాహసం వైరల్ అవుతోంది. బైక్‌పై పారిపోతున్న స్నాచర్లను వెంటాడి మరీ పట్టుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... తమిళనాడుకు చెందిన సుధాకర్ నాడర్ ముంబైలో ఉంటూ ఓ తమిళ న్యూస్‌పేపర్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. రజనీకి ఆయన హార్డ్‌కోర్ అభిమానిగా గతంలో చాలాసార్లు ఆయన వార్తల్లో నిలిచాడు కూడా. శుక్రవారం ఉదయం తన కొడుకును స్కూల్ దించి ఆఫీస్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కింగ్స్ సర్కిల్ వద్దకు చేరుకోగానే క్రమంలో ఓ మహిళ( ఖాస్లా కాలేజీ వైస్ ప్రిన్స్‌పాల్ దేవెందర్ కౌర్ భాసిన్ అని తర్వాత తేలింది) ‘దొంగ’ అని అరవటం నాడర్‌కు వినిపించింది.
క్షణం ఆలస్యం చేయకుండా.. దూసుకుపోతున్న బైకర్లను ఆయన ఛేజ్ చేశారు. ఇది గమనించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ వారిని అనుసరించాడు. చివరికి సంగమ్ నగర్ వద్ద ఓ బైకర్ ఆయన్ని ఢీకొట్టి పారిపోగా.. పరిగెత్తుకుంటూ వెళ్లి మరో బైకర్‌ను నాడర్ పట్టుకోగలిగారు. ముందు తనకేం తెలీదన్న ఆ మైనర్ బాలుడు.. సీసీ ఫుటేజీలో రికార్డయ్యిందనే సరికి నేరం ఒప్పుకున్నాడు. భాసిన్ కృతజ్ఞతలతోపాటు.. డిప్యూటీ కమీషనర్ అంబిక, సుధాకర్ నాడర్‌ను సత్కరించారు. ఇదిలా నాడర్ ఫ్యామిలీకి ఇలాంటి సాహసాలు కొత్తేం కాదు. రెండేళ్ల క్రితం నాడర్ కూతురు-కొడుకు విన్సీ-మాథ్యూలు కూడా ఓ ఫోన్ దొంగను వెంటాడి పట్టుకుని వార్తల్లో పోలీస్ శాఖ అభినందనలు అందుకున్నారు కూడా.
సుధాకర్ నాడర్ కూతురు.. కొడుకు
Comments
Please login to add a commentAdd a comment