ఒంగోలు పోలీసుల అదుపులో డీ ఎంహెచ్‌ఓ | The control section of DMHO | Sakshi
Sakshi News home page

ఒంగోలు పోలీసుల అదుపులో డీ ఎంహెచ్‌ఓ

Published Thu, Jan 23 2014 3:35 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

The control section of DMHO

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుధాకర్ ఒంగోలు జిల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇతర దేశాల నుంచి మన దేశానికి వస్తున్న డబ్బు లావాదేవీల్లో ఆయన ప్రమేయం ఉండొచ్చనే అనుమానంతో  అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే  పోలీసు వర్గాలు మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. చిత్తూరులో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పనిచేసిన డాక్టర్ సుధాకర్
 
 పది నెలల కిందట ఇక్కడికి బదిలీ మీద వచ్చారు. ఇక్కడే ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పదోన్నతి పొందారు. ఒంగోలుకు చెందిన కొందరు వ్యక్తులతో ఈయనకు పరిచయాలు వున్నాయి. వారిలో కొందరు ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వివిధ రూపాల్లో వివిధ పనుల కోసం డబ్బులు రప్పించే పనిచేస్తున్నారని పోలీసులకు అనుమానం కలిగింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల కిందట ఒంగోలు పోలీసులు అక్కడ కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారని తెలిసింది. వీరి నుంచి వచ్చిన సమాచారం మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్  సుధాకర్‌ను సోమవారం రాత్రి నెల్లూరులోని ఆయన నివాసం నుంచి పోలీసులు తమ వెంట తీసుకుని వెళ్లారని తెలిసింది.
 
 కేసు తీవ్రత దృష్ట్యా డాక్టర్ సుధాకర్ మొబైల్ ఫోన్లను ఆఫ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఒక కేసుకు సంబంధించి సుధాకర్‌ను కేవలం అదుపులోకి మాత్రమే తీసుకున్నామని ఆయన మీద కలిగిన అనుమానాలు నిజమా? కాదా? అనే విషయం దర్యాప్తు పూర్తయితే కానీ ధ్రువీకరించలేమని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
 
 22 ఎన్‌ఎల్‌ఆర్ 19: డీఎంహెచ్‌ఓ సుధాకర్ పది నెలల కిందట ఇక్కడికి బదిలీ మీద వచ్చారు. ఇక్కడే ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పదోన్నతి పొం దారు. ఒంగోలుకు చెందిన కొందరు వ్యక్తులతో ఈయనకు పరిచయాలు వున్నాయి. వారిలో కొందరు ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వివిధ రూపాల్లో వివిధ పనుల కోసం డబ్బులు రప్పించే పనిచేస్తున్నారని పోలీసులకు అనుమానం కలిగింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల కిందట ఒంగోలు పోలీసులు అక్కడ కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారని తెలిసింది.
 
 వీరి నుంచి వచ్చిన సమాచారం మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్  సుధాకర్‌ను సోమవారం రాత్రి నెల్లూరులోని ఆయన నివాసం నుంచి పోలీసులు తమ వెంట తీసుకుని వెళ్లారని తెలిసింది. కేసు తీవ్రత దృష్ట్యా డాక్టర్ సుధాకర్ మొబైల్ ఫోన్లను ఆఫ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
  ఒక కేసుకు సంబంధించి సుధాకర్‌ను కేవలం అదుపులోకి మాత్రమే తీసుకున్నామని ఆయన మీద కలిగిన అనుమానాలు నిజమా? కాదా? అనే విషయం దర్యాప్తు పూర్తయితే కానీ ధ్రువీకరించలేమని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement