అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని ఉప్పవంక వద్ద విధినిర్వహణలో ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సుధాకర్(50) బ్రిడ్జిపైనుంచి ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం వేకువజామున జరిగింది. ఉదయం బ్రిడ్జి కింద శవం పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.