వివాహిత గొంతుకోసి... | Fornication Relationship murder | Sakshi
Sakshi News home page

వివాహిత గొంతుకోసి...

Published Wed, Mar 23 2016 8:47 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Fornication Relationship  murder

- అనంతరం ఆత్మహత్య చేసుకున్న నిందితుడు
కదిరి

 అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. మూర్తినగర్ ప్రాంతంలో నివసించే భారతి అనే మహిళకు అదే ప్రాంతానికి చెందిన గొల్ల సుధాకర్‌తో వివాహేతర సంబంధం ఉంది.

కాగా, మంగళవారం మధ్యాహ్నం సుధాకర్ భారతి ఇంటికి వెళ్లగా... ఆ సమయంలో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి అతడు జీర్ణించుకోలేకపోయాడు. పథకం ప్రకారం... అర్ధరాత్రి ఆమె భర్త కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లగా... అదే సమయంలో సుధాకర్ భారతి ఇంటికి వేటకొడవలితో వెళ్లాడు. ఆమె గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం తన గొంతుకూడా కోసుకుని రక్తపు మడుగులో పడిపోయాడు. అతడ్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement