నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: ఓ కేసులో నిందితుడిగా ఉన్న నెల్లూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లోని వివరాల మేరకు.. నల్గొండజిల్లా, సూర్యాపేటకు చెందిన చింతమాల శ్రీనివాస్ నుంచి గతంలో సుధాకర్ రూ.25 లక్షలు తీసుకున్నారు.ఆ నగదును తిరిగి ఇచ్చేయాలని శ్రీనివాస్ పలుమార్లు కోరగా చంపేస్తానంటూ సుధాకర్ బెదిరించాడు. భయపడిన శ్రీనివాస్ తనను హత్య చేసేందుకు సుధాకర్ కుట్ర పన్నాడని నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసును ఒంగోలు పోలీసులకు బదిలీ చేశారు.
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 21న ఒంగోలు పోలీసులు డాక్టర్ సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించారు. హత్యకు కుట్ర ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకుని 26వ తేదీన అరెస్ట్ చేసి ఒంగోలు కోర్టులో హాజరుపరిచారు. సుధాకర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసు వివరాలను ఇటీవల పోలీసులు ప్రభుత్వానికి నివేదించారు. నివేదికను పరిశీలించిన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి చర్యలు తీసుకునేంత వరకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా నెల్లూరు నగరం వదిలివెళ్లరాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డీఎంహెచ్‌ఓ సుధాకర్ సస్పెన్షన్
Published Sun, Mar 23 2014 3:26 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement