తిరువళ్లూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ కడంబత్తూరు యూనియన్‌లోని కడంబవన మురుగన్ ఆలయానికి పాలాభిషేకం నిర్వహించారు. తిరువళ్లూరులో జిల్లా వ్యాప్తంగా అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ పూజలు, యాగాలు, పాలాభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడంబత్తూరు యూనియన్‌లోని కడంబవన మురుగన్ ఆలయానికి అన్నాడీఎంకే నేతలు పాలాబిషేకం నిర్వహించారు.
ఈ అభిషేక కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి సుధాకర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కన్వీనర్ పొన్నేరి ఎమ్మెల్యే బలరామన్ హాజరు కాగా అరక్కోణం ఎంపీ హరి, మాజీ మంత్రి రమణ పాల్గొన్నారు. ఆరోగ్యం మెరుగు పడాలని కోరుతూ ముందుగా పూజలు నిర్వహించిన అన్నాడీఎంకే నేతలు అనంతరం వంద టెంకాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ పూజలకు అన్నాడీఎంకే నేతలు పలువురు కార్యకర్తలతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు.
అమ్మ ఆరోగ్యం కోసం పాలాభిషేకం
Published Wed, Nov 2 2016 3:59 AM | Last Updated on Thu, May 24 2018 12:08 PM
Advertisement
Advertisement