Balaraman
-
అమ్మ ఆరోగ్యం కోసం పాలాభిషేకం
తిరువళ్లూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ కడంబత్తూరు యూనియన్‌లోని కడంబవన మురుగన్ ఆలయానికి పాలాభిషేకం నిర్వహించారు. తిరువళ్లూరులో జిల్లా వ్యాప్తంగా అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ పూజలు, యాగాలు, పాలాభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడంబత్తూరు యూనియన్‌లోని కడంబవన మురుగన్ ఆలయానికి అన్నాడీఎంకే నేతలు పాలాబిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి సుధాకర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కన్వీనర్ పొన్నేరి ఎమ్మెల్యే బలరామన్ హాజరు కాగా అరక్కోణం ఎంపీ హరి, మాజీ మంత్రి రమణ పాల్గొన్నారు. ఆరోగ్యం మెరుగు పడాలని కోరుతూ ముందుగా పూజలు నిర్వహించిన అన్నాడీఎంకే నేతలు అనంతరం వంద టెంకాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ పూజలకు అన్నాడీఎంకే నేతలు పలువురు కార్యకర్తలతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నందగోపాల్
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కలెక్టర్‌గా నందగోపాల్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు కలెక్టర్‌గా ఉన్న రాజంద్రరత్నూ బదిలీ కావడంతో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బదిలీ అయిన నందగోపాల్‌ను తిరిగి వేలూరు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో గురువారం ముఖ్యమంత్రి జయలలితను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. శుక్రవారం ఉదయం జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ నందగోపాల్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేయడం సహజమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరణ సమయంలో గ్రామీణాభివద్ధిశాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసన్, ప్రత్యేక అధికారి రాజేంద్రన్, అధికారులు పాల్గొన్నారు.