బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నందగోపాల్
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కలెక్టర్‌గా నందగోపాల్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు కలెక్టర్‌గా ఉన్న రాజంద్రరత్నూ బదిలీ కావడంతో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బదిలీ అయిన నందగోపాల్‌ను తిరిగి వేలూరు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో గురువారం ముఖ్యమంత్రి జయలలితను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
శుక్రవారం ఉదయం జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ నందగోపాల్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేయడం సహజమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరణ సమయంలో గ్రామీణాభివద్ధిశాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసన్, ప్రత్యేక అధికారి రాజేంద్రన్, అధికారులు పాల్గొన్నారు.