nanda gopal
-
నందగోపాల్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్లు నందగోపాల్, మనీషా సత్తా చాటారు. కొచ్చిలో జరిగిన ఈ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జోడీగా బరిలోకి దిగిన వీరిద్దరూ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. టైటిల్ పోరులో ఆరోసీడ్ నందగోపాల్ (కాగ్)–మనీషా (ఆర్బీఐ) ద్వయం 21–14, 21–13తో సనావే థామస్ (కేరళ)–అపర్ణ బాలన్ (పెట్రోలియం) జంటపై 35 నిమిషాల్లోనే గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో నందగోపాల్–మనీషా జంట 21–6, 21–10తో టాప్‌సీడ్ వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (ఛత్తీస్‌గఢ్) జోడీపై అద్భుత విజయాన్ని సాధించింది. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ వృశాలి (ఆంధ్రప్రదేశ్), సామియా ఇమాద్ ఫారూఖీ (తెలంగాణ), మూడోసీడ్ సాయి ఉత్తేజితరావు (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వృశాలి 21–10, 15–21, 19–21తో టాప్‌సీడ్ ప్రియాన్షి పరదేశి (మధ్యప్రదేశ్) చేతిలో, సామియా 18–21, 12–21తో అష్మిత చలిహా (అస్సాం) చేతిలో, మూడోసీడ్ సాయి ఉత్తేజితరావు 12–21, 21–9, 20–22తో ఏడో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రిక్వార్టర్స్‌లో క్వాలిఫయర్ కేయూర మోపాటి (తెలంగాణ) 22–20, 12–21, 14–21తో ఐరా శర్మ చేతిలో, తనిష్క్ (ఏపీ) 15–21, 15–21తో అష్మిత (అస్సాం) చేతిలో ఓడిపోయారు. అక్షిత (ఏపీ), నిషిత వర్మ (ఆంధ్రప్రదేశ్), పూర్వీ సింగ్ (తెలంగాణ) తొలి రౌండ్లోనే తమ ప్రత్యర్థుల చేతుల్లో పరాజయం పొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన రోహిత్ యాదవ్ క్వార్టర్స్‌లో 19–21, 21–15, 19–21తో రెండోసీడ్ అన్షల్ (యూపీ), జశ్వంత్ (ఏపీ) 22–24, 19–21తో మునావర్(కేరళ) చేతిలో ఓడారు. -
సీనియర్ జర్నలిస్టు నందగోపాల్ ఇక లేరు
ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ నందగోపాల్ (84) ఇక లేరు. అనారోగ్యం కారణంగా శుక్రవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్ను మూశారు. 1952లో మదరాసులోని పచ్చయ్యప్ప కాలేజీలో బీఏ హానర్స్ చేస్తూ, ఖాళీ సమయాల్లో దర్శకుడు, నాటి ‘జ్వాల’ పత్రిక సంపాదకుడు కె. ప్రత్యగాత్మ వద్ద సహాయకునిగా చేరి, పాత్రికేయ జీవితానికి శ్రీకారం చుట్టారాయన. సినీ జర్నలిజానికి చేసిన కృషికిగాను నందగోపాల్ పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. 1995లో ‘ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్’గా నంది అవార్డు అందుకున్నారు. అదే విధంగా 1997లో ‘మేఘసందేశం’ ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు, 2000లో ఉత్తమ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా దాసరి నారాయణరావు స్వర్ణ పతకం, 2004లో ‘చిరంజీవి బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్’ అవార్డు, 2006లో ‘నాగార్జున బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు’ అందుకున్నారు. ఆయన రాసిన సినిమా గ్రంథం ‘సినిమాగా సినిమా’కి జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డు కూడా లభించింది. ఫిల్మ్ జర్నలిజమ్‌లో నందగోపాల్ చేసిన కృషి విశేషమైనది. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. -
అనాథ బాలికల కంటిరెప్ప
గోరుముద్దలు పెట్టి, జాబిల్లి కథలు చెప్పి నిద్రపుచ్చాల్సిన అమ్మ వద్దనుకుంది. చేయిపట్టి నడిపించాల్సిన నాన్న వదలించుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్లనో, కుటుంబ కలహాల కారణంగానో, బిడ్డకు అంగవైకల్యమనో, ఆడపిల్ల భారమనో ఇలా.. పురిటి గుడ్డుగానే ఎంతోమంది అనా«థలవుతున్నారు. ఆకలే తల్లిగా, ఆవేదనే తండ్రిగా, ఒంటరితనంతో అనాథలెందరో రోడ్ల పక్కన చేరి ఆలమటిస్తూ, కన్నీళ్లే తోడుగా, బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూ, ప్రేమ కోసం పరితపిస్తూ కనిపిస్తుంటారు. అలాంటి వారికి అమ్మ, నాన్నలా బాధ్యతగా ఆశ్రయం కల్పించి ఆదరిస్తోంది తిరుపతిలోని ప్రభుత్వ బాలికల పర్యవేక్షణా గృహం. అనాథలను అక్కున చేర్చుకుని అన్ని వసతులతో వారిని పెంచడమే కాకుండా, వారికి పెళ్లి కూడా జరిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 4 కోట్లకు పైగా అనాథలు ఉన్నట్టు తేలింది. దేశ జనాభాలో వీరు నాలుగు శాతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 24 లక్షల మందికిపైగా అనా«థలు ఉన్నారు. అమ్మ ఒడికి , నాన్న లాలనకు నోచుకోని ఈ పిల్లల్లో అధిక శాతం ఆడపిల్లలే. అలా కన్నవారికి దూరమై సమాజంలో నిరాదరణకు గురైన బాలికలను చేరదీస్తోంది తిరుపతి అనంత వీధిలోని ప్రభుత్వ ప్రత్యేక ‘చిల్డ్రన్స్ హోమ్, అబ్జర్వేషన్ హోమ్ ఫర్ గర్ల్స్’. అంతే కాదు,కోరుకున్న చదువు చెప్పించి, వారి కాళ్లపై వారు నిలబడేందుకు ప్రోత్సహిస్తోంది ఈ హోమ్. ఆఖరికి సంప్రదాయబద్దంగా పెళ్లి చేసే బాధ్యతను సైతం తీసుకుంటోంది. 2008లో ఆరుమంది అనా«థపిల్లలతో ప్రారంభమైన హోమ్‌లో ప్రస్తుతం 136 మంది ఉన్నారు. హైటెక్ వసతులు ఈ వసతి గృహంలో అనాథ బాలికలకు అనేక హైటెక్ వసతులు కల్పిస్తున్నారు. సోలార్ వాటర్‌ప్లాంట్, ఆర్వో ప్యూరిఫైడ్ వాటర్ సిస్టం, వాషింగ్ మిషన్లు, ఇన్వర్టర్, కంప్యూటర్ ల్యాబ్ వంటి సౌకర్యాలతో పాటు తరచు స్పెషల్ మెనూతో ఆరోగ్యవంతమైన భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలూ డాక్టర్ల పర్యవేక్షణ, చదువులో వెనుకబడిన విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ట్యూషన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి ఇండోర్ క్రీడల సౌకర్యం, నాటికలు, పురాణ కథలు, డ్రామాలు, కోలాటాలు, చెక్కభజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. వీటితో పాటు యోగా, కరాటే, ధ్యానంతో వారిలో ఆత్మసై ్థర్యాన్ని నింపుతున్నారు. ఏడాదికోసారి విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాళహస్తి, మదనపల్లి, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో విహార యాత్రలకు సైతం తీసుకెళుతుంటారు. విద్యతో పాటు వివాహం బాలికల సంరక్షణతో పాటు ఉన్నత విద్యపై వారికి అవగాహన కల్పించి ఉపాధి ఉద్యోగాల వైపు వారిని నడిపించాలనే సంకల్పంతో బాలికల వసతి గృహ నిర్వాహకులు కృషి చేస్తున్నారు. బయటి విద్యార్థులకు దీటుగా కోరుకున్న చదువును చదివిస్తూ వారిని అన్ని రంగాల్లో రాణించే విధంగా తయారు చేస్తున్నారు. ప్రభుత్వ గ్రాంట్స్‌తో పాటు దాతల సహాయంతో చదువులో రాణించే బాలికలను పేరొందిన ప్రైవేటు సంస్థల్లో చదివిస్తున్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్ వంటి కోర్సుల్లో చాలా మందికి ప్రవేశాలు కల్పించి వారిని ప్రోత్సహిస్తున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన ఏడు మంది అనాథ యువతులకు ప్రభుత్వ అనుమతితో వివాహం చేశారు. గత ఏడాది నలుగురు అనాథ బాలికలకు వివాహం చేశారు. పెళ్లిసందడి మొదలైంది ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో హోమ్‌లోని యువతులకు వివాహాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండడంతో పర్యవేక్షణా గృహంలో అప్పుడే పెళ్లిసందడి నెలకొంది. వందల సంఖ్యలో వరుళ్ల బయోడేటాలు, ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబీకులతో పాటు కార్పొరేట్ స్థాయి ఉద్యోగులు, ఉన్నతస్థాయి కుటుంబాలు సైతం వధువు కోసం దరఖాస్తులు పంపుతున్నారు. పెళ్లి తర్వాత పుట్టింటì తంతువివాహానంతరం పుట్టింటి నుంచి ఆడపడుచుకు పసుపు, కుంకుమ అందించడం ప్రతి కుటుంబంలో సాగే సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పర్యవేక్షణ గృహ ప్రతినిధులు పాటిస్తూ ఆడపడుచులకు అండగా నిలుస్తున్నారు. ప్రతి పండుగకు సాంప్రదాయ బద్దంగా గృహానికి ఆçహ్వానించి ఆడపడుచులకు కొత్తబట్టలు పెడుతున్నారు. – పోగూరి చంద్రబాబు, సాక్షి, తిరుపతి వరుడి ఎంపికకు ప్రత్యేక కమిటీ సామాజిక స్పృహ, నైతిక విలువలే ప్రాతిపదికగా ఏర్పాటైన ప్రత్యేక కమిటీతో హోమ్‌లోని యువతులకు వరుడి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ కమిటీలో ఓ ప్రభుత్వ అధికారి, న్యాయవాది, స్వచ్చంధ సంస్థ ప్రతినిధి, హోం అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ వరుడి సామాజిక, ఆర్థిక స్థితిగతులతో పాటుగా అతని సత్ప్రవర్తనపై ఆరా తీసి, ఆ తర్వాత మాత్రమే వధువును చూపించడం జరుగుతుంది. వరుడికి ఆరోగ్య పరమైన పరీక్షలు కూడా నిర్వహించడం విశేషం. ఈ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు వధువుకు వివాహ భద్రత కల్పించేలా వరుడు, వరుడి తల్లిదండ్రుల నుంచి కూడా లిఖితపూర్వకంగా హామీ పత్రాలపై సంతకాలు తీసుకుంటుంది. పన్నెండు పెళ్లిళ్లకు ప్రణాళిక ఈ ఏడాది సెప్టెంబర్ మా హోమ్‌లో 18 సంవత్సరాల వయస్సు నిండిన పన్నెండు మంది అనా«థ యువతులకు వివాహాలు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఏ కొరతా లేకుండా ప్రభుత్వ సాయంతో, దాతల ఔదార్యంతో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా రూ.50వేల నగదును వధువు పేరిట బ్యాంకు ఖాతాలో ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తున్నాను. అంతేకాదు, వివాహాలు జరిగిన వారికి నా సొంత ఆస్తిలో 15 అంకణాల ఇంటిస్థలాన్ని ఇవ్వడానికి వైఎస్సార్ కడపజిల్లా కోడూరులో పనులు కూడా ప్రారంభించాను. పది సంవత్సరాలుగా వీరితో మమేకమై వీరికి తండ్రిలా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం నాకు విజయవాడకు రీజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అధికారిగా బదిలీ అయింది. – బి. నందగోపాల్ ఆయనే మాకు ఆదర్శం రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా తిరుపతిలోని బాలికల పర్యవేక్షణా గృహంలో గత ఏడాది ఏడు మంది అనాథ యువతులకు పూర్వపు పర్యవేక్షణాధికారి నందగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా వివాహాలు జరిగాయి. ప్రస్తుతం కూడా సెప్టెంబర్ నెలలో 12 మంది అనా«థ యువతులకు వివాహాలు జరిపించేందుకు నందగోపాల్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ వివాహాలు ఘనంగా నిర్వహిస్తాం. పూర్వపు పర్యవేక్షణాధికారి నందగోపాల్‌ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగతా ఆశ్రమాల వారు కూడా ఇలాంటి సేవాకార్యక్రమాలకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటాం. – సంజీవరెడ్డి, ప్రస్తుత పర్యవేక్షణాధికారి -
విభిన్నం, ప్రత్యేకం.. రామప్ప దేవాలయం!
సాక్షి, హైదరాబాద్ : రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తితే పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడం పూర్వకాలంలో అమలైన పద్ధతి. అందుకే తెలంగాణలో కచీర్లు వెలిశాయి. రెండు వర్గాల వాదన విని కచీర్ ‘పెద్ద’ఇచ్చే తీర్పుతో ఆ వివాదం పరిష్కారమయ్యేది. మరి రెండు వర్గాలు దేవుడి సన్నిధిలో కూర్చుని పంచాయితీ జరిపితే..!!! కాస్త ఆశ్చర్యమే. గౌందలి, యోగిని, నాగిని, పేరిణి.. ఇవన్నీ నృత్య రీతులు. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. చేతులతో డప్పు వాయిస్తూ, పాడుతూ, నర్తించాలి.. ఈ మూడింట మంచి ప్రవేశంతో ఏకకాలంలో జరపటం గౌందలి ప్రత్యేకత. ఇలా ఒక్కో ప్రత్యేకతతో ఉండి, వాటి రూపాలన్నీ దేవాలయంలోని శిల్పాల్లో అచ్చుగుద్దినట్టు ప్రస్ఫుటమైతే..!!!! సంభ్రమాశ్చర్యమే. దేవాలయంలోని శిల్పాల భంగిమల నుంచి స్థానిక జానపద, ఇతర శాస్త్రీయ నృత్యరీతులు రూపుదిద్దుకుంటే..!!!! అబ్బురమే. ...ఇలాంటి ప్రత్యేకతలు ఒకే గుడిలో కనిపిస్తే.. అది రామప్ప దేవాలయం అవుతుందని ప్రముఖ నర్తకి, చారిత్రక పరిశోధకురాలు, యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్ చూడామణి నందగోపాల్ అంటున్నారు. రామప్ప దేవాలయంపై పరిశోధన జరిపి తేల్చిన వివరాలతో చూడామణి త్వరలోనే ఓ పుస్తకాన్నీ రూపొందించబోతున్నారు. దీన్ని ప్రచురించేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ముందుకొచ్చింది. శనివారం రామప్ప ప్రత్యేకతలను వివరిస్తూ ఆమె, తన శిష్యురాలైన నర్తకి డాక్టర్ విద్యతో కలసి గంటన్నర పాటు అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సులో ప్రదర్శన ఇచ్చారు. రామప్ప నిర్మాణ వైషిష్ట్యాన్ని దృశ్యరూపకంగా వివరించారు. ఆలయంలో అత్యద్భుతంగా చెక్కిన శిల్పాల్లోని నృత్య భంగిమలను వివరిస్తూ డాక్టర్ విద్య నర్తించి చూపారు. ఈ ప్రదర్శన సదస్సుకు హాజరైన దేశవిదేశాలకు చెందిన ఆçహూతులను విశేషంగా ఆకట్టుకుంది. శాసనం కోసమే ప్రత్యేక మండపం కల్యాణి చాళుక్యుల హయాంలో నిర్మితమైన అన్ని ప్రధాన శివాలయాలను తాను చూశానని, వాటికంటే విభిన్నమైన ప్రత్యేకతలో కాకతీయుల కాలంలో రామప్ప నిర్మితమైందని చూడామణి వివరించారు. ఎత్తయిన కక్ష్యాసనం, మూలవిరాట్టు దిగువన ఉండే జగతి (ప్లాట్‌ఫామ్) చాలా ఉన్నతంగా ఉంటుందని, సభా మండపాన్ని తలపించే రంగమండపం నాడు దేవుడి సన్నిధిలో వివాదాలు పరిష్కరించుకునేందుకు, సభలు, నృత్య కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వాడి ఉంటా రని అభిప్రాయపడ్డారు. వేడి ప్రాంతమైనందున ఆలయం వెలుపల నిలబడి జనం వీక్షించటం ఇబ్బందిగా ఉంటుందని, వెలుపలి వైపు ఎలాంటి ప్రత్యేక డిజైన్లు రూపొందించలేదని, కానీ లోపలి వైపు సంభ్రమాశ్చర్యాలు కలిగేలా అలంకరణలు చెక్కారని తెలిపారు. డోలమైట్, గ్రానైట్, ఇసుకరాయి, నీటిలో తేలే ఇటుకలతో మందిరాన్ని నిర్మించారన్నారు. శాసనం కోసమే ప్రత్యేక మండపం నిర్మించి ఉండటం మరెక్కడా కనిపించదని వివరించారు. ఆలయంలో మొత్తం 280 వరకు నృత్య భంగిమల శిల్పాలున్నాయని తెలిపారు. జాయపసేనాని రాసిన నృత్యరత్నావళిలోని నృత్య భంగిమలు ఈ శిల్పాలను పోలి ఉంటాయని పేర్కొన్నారు. చిందు యక్షగానాలు కూడా వీటిని చూసే రూపొందించి ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. వెరసి రామప్ప దేవాలయం ఓ గ్యాలరీ.. అని చూస్తే ఎన్నో నేర్చుకుంటామని పేర్కొన్నారు. అనంతరం చూడామణి, విద్యలను హెరిటేజ్ తెలంగాణ సంచాలకుడు విశాలాచ్చి సన్మానించారు. -
ఫైనల్లో నందగోపాల్ జంట
సాక్షి, హైదరాబాద్: మలేసియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి నందగోపాల్ మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కౌలాలంపూర్‌లో శనివారం జరిగిన సెమీఫైనల్లో నందగోపాల్–మహిమా అగర్వాల్ (భారత్) ద్వయం 21–13, 21–17తో జెన్ టింగ్ లిమ్–కా మున్ చిన్ (మలేసియా) జోడీపై విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంటకు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ యాంతోని సపుత్ర–మార్షెల్లా (ఇండోనేసియా) జోడీతో నందగోపాల్–మహిమా ద్వయం తలపడుతుంది. -
నందగోపాల్, మేఘన ‘డబుల్’
రెండేసి టైటిల్స్ నెగ్గిన హైదరాబాద్ ప్లేయర్స్ ∙ సింగిల్స్ చాంప్ రోహిత్ యాదవ్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ముగిసిన ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన కిడాంబి నందగోపాల్, మేఘన జక్కంపూడి చెరో రెండు టైటిళ్లను కైవసం చేసుకోగా.... రోహిత్ యాదవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జోడీగా టైటిల్‌ను గెలిచిన నందగోపాల్– మేఘనలు... మహిళల, పురుషుల డబుల్స్ విభాగాల్లో తమ భాగస్వాములతో కలిసి విజేతలుగా నిలిచారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో కె. నందగోపాల్ (సీఏజీ)– మేఘన జక్కంపూడి (ఏఐ) ద్వయం 21–16, 21–11తో సాన్యమ్ శుక్లా–సంయోగిత (ఏఐ) జంటను చిత్తుగా ఓడించి తొలి టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల డబుల్స్ విభాగంలో నందగోపాల్–సాన్యమ్ శుక్లా జంట 21–16, 14–21, 21–11తో అరుణ్ జార్జి (కేరళ)–శివమ్ శర్మ (యూపీ) జోడీపై.... మహిళల డబుల్స్ విభాగంలో మేఘన–పూర్వీషా (కర్ణాటక) జంట 21–12, 21–17తో కుహూ గార్గ్–నింగ్షి బ్లాక్ హజారికా జోడీపై గెలుపొందడంతో ఇద్దరి ఖాతాలో మరో టైటిల్ చేరింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో రోహిత్ యాదవ్ (ఏఏఐ) 21–17, 21–16తో హర్షిత్ అగర్వాల్ (ఏఐ)ను ఓడించి విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్ విభాగంలో అరుంధతి (మహారాష్ట్ర) 21–14, 14–21, 21–16తో శ్రీయాన్షి పరదేశి (మధ్యప్రదేశ్)పై గెలుపొందింది. -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నందగోపాల్
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కలెక్టర్‌గా నందగోపాల్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు కలెక్టర్‌గా ఉన్న రాజంద్రరత్నూ బదిలీ కావడంతో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బదిలీ అయిన నందగోపాల్‌ను తిరిగి వేలూరు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో గురువారం ముఖ్యమంత్రి జయలలితను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. శుక్రవారం ఉదయం జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ నందగోపాల్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేయడం సహజమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరణ సమయంలో గ్రామీణాభివద్ధిశాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసన్, ప్రత్యేక అధికారి రాజేంద్రన్, అధికారులు పాల్గొన్నారు. -
సినిమా.. పందెపు గుర్రమా?
ఆరు దశాబ్దాలకుపైగా సినీ పత్రికా రచనలో ఉన్న ఎనిమిది పదుల అనుభవ జ్ఞుడు నందగోపాల్. సినిమా ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా పరిణామాలనూ, సినీ సాంకేతిక శాఖల్లో వచ్చిన మార్పులనూ, ప్రత్యేకించి తెలుగు సినీ అనుభవాలనూ ఈ నిత్య విద్యార్థి పుస్తకరూపంలో తెచ్చారు. తాజా జాతీయ అవార్డుల్లో ‘ఉత్తమ గ్రంథం’గా ఎంపికైన ఈ రచన నుంచి కొన్ని ముచ్చట్లు... పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక సిబ్బందికి గొడుగు లాంటి స్డూడియో వ్యవస్థ ఏనాడో కూలిపోయింది. ‘స్టార్’ చుట్టూ కథలు తిరిగాయి. బేరసారాలు జరిగాయి. అప్పటివరకూ నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు - చిత్రనిర్మాణంలో లాభనష్టాలలో పాలుపంచుకునేవారు. డిస్ట్రిబ్యూటర్ స్థానే బయ్యర్లు రంగ ప్రవేశం చేశారు. ఇది తమిళనాడులో ప్రారంభమై మనకు వ్యాపించింది. ‘సినిమా అనేది ఈనాడు (క్షమించండి) వ్యాపారమూ కళా రెండూ కాకుండా పోయింది. సినిమా తీయటం అనేది ‘గుర్రపు పందెం లాంటిది’ అనే భావం జనంలో సర్వత్రా వ్యాపించింది. ఈ దొమ్మీలో, ఈ పందెంలో ఎందరి జేబులో పోతున్నాయి. ఏదో ఒక్క జేబు మాత్రమే నిండుతున్నది’ అన్నారు దుక్కిపాటి మధుసూదనరావు. హాలీవుడ్లో నిర్మాతకు 8 శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. అదే ఇక్కడ 18 శాతం. డబ్బు విషయం వస్తే నవతా కృష్ణంరాజు మాట గుర్తుకు వస్తుంది. 1977లో ఓ మాట అన్నారు - ‘‘మా రోజుల్లో మంచి కథ ఎవరు రాస్తారు? ఎక్కడ దొరుకుతుందని వెతికేవాళ్ళం. నేడు కొత్తగా రంగంలోకి దిగుతున్న వారిలో అధిక భాగం ఫైనాన్సియర్ అడ్రసు అడుగుతున్నారు’’ అని! నిర్మాత నవతా కృష్ణంరాజు గదిలో ఆయనకు ఎదురుగా సత్యజిత్ రే, సుందరయ్య చిత్రపటాలుండేవి. అవి ఆయన జీవిత దృక్పథానికి దర్పణాలు. ‘భువన సుందరి కథ’ (1967) షూటింగ్లో ఓ రోజున నిర్మాత తోట సుబ్బారావు, దర్శకుడు సి. పుల్లయ్యతో ‘గురువుగారూ! అందరూ స్పీడ్‌గా తీస్తున్నారు. మనం కూడా స్పీడ్ పెంచుదాం సార్’ అన్నారు. దానికి సి. పుల్లయ్య ‘‘నీ ‘పరమానందయ్య శిష్యుల కథ’ నేనే తీశాను. అది 100 రోజులు ఆడింది. అది ఏ స్పీడ్‌లో తీశామో, అదే స్పీడ్‌లో ఇదీ తీస్తున్నాం. సినిమాకూ, కెమెరాకూ ఓ స్పీడ్ ఉంది. సెకనుకు 24 ఫ్రేములు, ఇక్కడ నేను స్పీడ్ పెంచినా అక్కడ థియేటర్లో ప్రొజెక్టరులో ఫిలిం స్పీడ్‌గా తిరగదు. అదీ సెకనుకు 24 ఫ్రేములే తిరుగుతుంది. సినిమా అంటే పందెపు గుర్రం కాదు. స్పీడ్ కావాలంటే నన్ను మార్చుకో’’ అంటూ పైపంచ భుజాన వేసుకున్నారు. ముప్ఫై ఏళ్ల సినీ జీవితంలో బియన్ తీసింది 11 చిత్రాలే. వాటిలో ఓ మణిపూస ‘బంగారుపాప’ (1954). కరకు కసాయిగా మారిన వ్యక్తిలో ఓ అనాథ పాప మానవతను మేల్కొల్పటం ఇతివృత్తం. చిత్రం ఆర్థికంగా నిరాశ పరచింది. కానీ ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా రజత పతకం అందుకుంది. దేవకీ బోస్, బియన్ ఇద్దరూ ఆత్మీయ మిత్రులు. బియన్ వద్దన్నా వినకుండా దేవకీ బోస్ ‘బంగారు పాప’ను బెంగాలీలో ‘సోనార్ కాఠీ’ పేరుతో తీశారు. అక్కడా చిత్రం ఫ్లాపే. ‘దేవకీబోస్ నుండి రీమేక్ హక్కుల కింద ఒక్క రూపాయి తీసుకున్నా. కానీ నా దురదృష్టం బెంగాల్ దాకా ప్రయాణిస్తుందనుకోలేదు’ అన్నారు బి.యన్ నాతో! తెలుగు సినిమా పత్రికా రంగానికీ ఓ స్వర్ణయుగం ఉంది. ఈ యుగాన్ని ప్రభావితం చేసిన ప్రతిభామూర్తులు కమలాకర కామేశ్వరరావు, కొడవటిగంటి, ముళ్లపూడి వెంకటరమణ, నండూరి రామమోహనరావు. సినిమా సమీక్షకు ఓ నమునా ఏర్పరచారు. కొన్ని ప్రమాణాలు నెలకొల్పారు. 1953 నుండి బొమ్మకంటి ‘ఆంధ్రప్రభ వారపత్రిక’లో పనిచేస్తూ ఉండేవారు. సినిమా విలేకరిగా, విమర్శకునిగా. 1954 లో విజయా వారి ‘చంద్రహారం’ విడుదలైంది. అపుడు ‘ఆంధ్రప్రభ’ ప్రకటనల విభాగం (అడ్వర్టయిజింగ్ సెక్షన్) అధిపతి, బొమ్మకంటితో ‘చంద్రహారం సమీక్షలో చూసీ, చూడనట్లు పొండి. ఘాటు తగ్గించండి, విజయా నుండి బోలెడు ప్రకటనలు రానున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకుని రివ్యూ రాయండి’ అన్నాడు. సమీక్షకు బదులు తన ఉద్యోగానికి రాజీనామా పత్రం పంపారు యాజమాన్యానికి - ఆదర్శ కలం జీవి బొమ్మకంటి సుబ్బారావు. సినిమాలో రావలసిన మార్పుకు వైతాళికుడు ఫిల్మ్ క్రిటిక్.