నందగోపాల్
ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ నందగోపాల్ (84) ఇక లేరు. అనారోగ్యం కారణంగా శుక్రవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్ను మూశారు. 1952లో మదరాసులోని పచ్చయ్యప్ప కాలేజీలో బీఏ హానర్స్ చేస్తూ, ఖాళీ సమయాల్లో దర్శకుడు, నాటి ‘జ్వాల’ పత్రిక సంపాదకుడు కె. ప్రత్యగాత్మ వద్ద సహాయకునిగా చేరి, పాత్రికేయ జీవితానికి శ్రీకారం చుట్టారాయన. సినీ జర్నలిజానికి చేసిన కృషికిగాను నందగోపాల్ పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. 1995లో ‘ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్’గా నంది అవార్డు అందుకున్నారు.
అదే విధంగా 1997లో ‘మేఘసందేశం’ ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు, 2000లో ఉత్తమ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా దాసరి నారాయణరావు స్వర్ణ పతకం, 2004లో ‘చిరంజీవి బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్’ అవార్డు, 2006లో ‘నాగార్జున బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు’ అందుకున్నారు. ఆయన రాసిన సినిమా గ్రంథం ‘సినిమాగా సినిమా’కి జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డు కూడా లభించింది. ఫిల్మ్ జర్నలిజమ్‌లో నందగోపాల్ చేసిన కృషి విశేషమైనది. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment