
మంచి కాలం ముందుంది!
ఈ చిత్రం టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉంది. పాటలు, ప్రచార చిత్రాలూ బాగున్నాయి. కొత్తవాళ్లందరూ చేసిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు.
‘‘ఈ చిత్రం టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉంది. పాటలు, ప్రచార చిత్రాలూ బాగున్నాయి. కొత్తవాళ్లందరూ చేసిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. అరుణ్ దాస్యం దర్శకత్వంలో రవి దాస్యం నిర్మించిన చిత్రం ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’. సుధాకర్, అవంతిక నాయకా, నాయికలుగా, సీనియర్ నరేశ్, రాధిక ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాంనారాయణ్ పాటలు స్వరపరిచారు.
ఆడియో సీడీని వీవీ వినాయక్ విడుదల చేసి నరేశ్‌కి అందించారు. ప్రచార చిత్రాలను నిర్మాతలు మల్లిడి సత్యనారాయణ, నల్లమలుపు బుజ్జి ఆవిష్కరించారు. ఈ వేడుకలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, దర్శకుడు బాబి, ఛాయాగ్రాహకుడు సెంథిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రకథ ప్రతి యువకుడికి కనెక్ట్ అవుతుంది. ఇందులో ఆటోడ్రైవర్‌గా నటించాను’’ అన్నారు. అరుణ్ దర్శకత్వం, రాంనారాయణ్ ఇచ్చిన పాటలు హైలైట్‌గా నిలుస్తాయని, చిత్రబృందం మొత్తం టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుని ఓ మంచి సినిమా చేశామని నిర్మాత తెలిపారు. కథ తయారు చేసుకున్నాక టైటిల్ అనుకున్నామని, అందరికీ నచ్చిందని దర్శకుడు చెప్పారు.