తిరుపతిః సత్యనారాయణపురంలో ఘరానా మోసానికి పాల్పడిని వ్యక్తిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం సుధాకర్ అనే వ్యక్తి వీసాలు ఇప్పిస్తానని అనేక మందిని మోసం చేశాడు. వారి వద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు.
వారికి సుధాకర్ వీసాలు ఇప్పించలేదు. డబ్బు ఇచ్చినవారికి ఎటువంటి సమాధానం చెప్పడంలేదు. దాంతో సుధాకర్ ని చితకబాది అలిపిరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.