Satyanarayanapuram
-
దిశ యాప్‌తో 6 నిమిషాల్లోనే యువతికి రక్షణ
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): అక్కచెల్లెమ్మల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌తో వారికి క్షణాల్లోనే రక్షణ అందుతోందని మరోసారి రుజువైంది. వేధింపులకు గురైన యువతి దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని రక్షించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దేవీనగర్‌కు చెందిన యువతి (19) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న ఆకాష్ ఆమెను ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తున్నాడు. అతడిపై యువతి తన తండ్రికి, కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో వారు యువకుడిని పలుమార్లు హెచ్చరించారు. అయినా ఆకాష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. యువతి శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో పరీక్ష రాసి తండ్రితో కలసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా ఆకాష్ ద్విచక్రవాహనంపై వెంటపడుతూ వేధింపులకు గురిచేశాడు. దీంతో యువతి దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసింది. మధ్యాహ్నం 12.31కి దిశ కాల్ సెంటర్‌కు సమాచారం రాగానే వెంటనే స్పందించిన సత్యనారాయణపురం పోలీసులు 12.37కి ఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. నిందితుడు ఆకాష్‌ను అదుపులోకి తీసుకుని 483, 354డి, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
విభేదాలే మణిక్రాంతి హత్యకు ప్రధాన కారణం
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిక్రాంతి హత్యకేసులో నిందితులను విజయవాడ పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితుడు ప్రదీప్‌తో పాటు క్యాబ్ డ్రైవర్ భవానీ ప్రసాద్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి, సెక్షన్ 302, 498-A కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయరావు మాట్లాడుతూ...భార్యభర్తల మధ్య విభేదాలే మణిక్రాంతి హత్యకు ప్రధాన కారణమన్నారు. సీసీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులు, ఆయుధం పిడి, మృతురాలి రక్త నమూనా ఆధారంగా కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. దారుణం: భార్య తలను శరీరం నుంచి వేరు చేసి.. హత్యకు ముందురోజు మణిక్రాంతి ఇంటివద్ద క్యాబ్ డ్రైవర్ భవానీ ప్రసాద్, ప్రదీప్ రెక్కీ నిర్వహించారన్నారు. అయితే తల లేకున్నా డీఎన్ఏ ద్వారా మృతదేహాన్ని గుర్తించవచ్చని అన్నారు. డీఎన్ఏ టెస్ట్ ద్వారా నిందితులకు శిక్షపడేలా చేస్తామన్నారు. వర్షాలతో పాటు వరదల కారణంగా తల కొట్టుకుపోయి ఉంటుందని తాము భావిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సహకారంతో తల కోసం తీవ్రంగా గాలించామన్నారు. అలాగే హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ప్రదీప్ ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా ఇంకా దొరకలేదని తెలిపారు. నిందితుడు ప్రదీప్‌పై సత్యనారాయణపురం, సూర్యారావుపేట, మాచవరం పోలీస్ స్టేషన్స్ పరిధిలో పలు కేసులు ఉన్నాయన్నారు. చదవండి: మణిక్రాంతి కుటుంబానికి వాసిరెడ్డి పద్మ పరామర్శ కాగా ఈ నెల 11వ తేదీన విజయవాడ సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీలో మణిక్రాంతిని ఆమె భర్త ప్రదీప్ తలనరికి పాశవికంగా హత్య చేశాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మణిక్రాంతి భర్త ప్రదీప్‌పై పోలీసులకు దాదాపు 10సార్లు ఫిర్యాదు చేసింది. అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో మణిక్రాంతిపై పగ పెంచుకున్న ప్రదీప్ ఆమెపై కత్తితో దాడి చేసి తల నరికి కాలువలో పడేశాడు. మణిక్రాంతి తల ఇంతవరకు దొరకలేదు. దీంతో తల లేకుండానే వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. వేరే గత్యంతరం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మణిక్రాంతి మొండానికి అంత్యక్రియలు చేశారు. -
చిన్న పిల్లను... నా పెళ్లి ఆపండి ప్లీజ్..
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): ‘సార్.. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను.. నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో పెద్దవాళ్లు పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నన్ను కాపాడండి’ అంటూ ఓ బాలిక 100కు ఫోన్ చేసి పోలీసుల రక్షణ కోరిన ఘటన మంగళవారం విజయవాడలో చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన బాలిక సత్యనారాయణపురంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. అకస్మాత్తుగా ఇంట్లోవారు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పసుపు కుంకుమల కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఆ బాలిక ఈ తంతు గురించి 100కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన నున్న రూరల్ పోలీసులు మహిళా మిత్ర సభ్యుల సహాయంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేసి తల్లిదండ్రులు, బాలికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కూతురును చక్కగా చదివిస్తామని తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో బాలికను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
బావిలో రెండురోజుల మగశిశువు డెడ్ బాడీ
-
లారీ - వ్యాన్ ఢీ: 25 మందికి గాయాలు
-
లారీ - మినీ వ్యాన్ ఢీ: 25 మందికి గాయాలు
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున లారీ - మినీ వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యపై కత్తితో దాడి
విజయవాడ(గాంధీనగర్) : భార్యను భర్తే నడిరోడ్డుపై కత్తితో దాడి చేసిన ఘటన పూర్ణనందంపేట బాప్టిస్ట్ నగర్లో ఆదివారం చోటుచేసుకుంది. దీనిపై సత్యానారాయణపురం పోలీస్‌స్టేçÙన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు పెజ్జోనిపేటకు చెందిన కాలే తేజస్విని(22)కి కానూరుకు చెందిన కురెళ్ల మహేష్‌తో ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. మహేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయిన నాలుగైదు నెలలకే కాపురంలో గొడవలు వచ్చాయి. భర్తపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. గొడవల నేపథ్యంలో కొంతకాలంగా తేజస్విని పుట్టింటి వద్ద ఉంటోంది. ఆదివారం ఉదయం చర్చికి వెళ్లి తేజస్వి ఇంటికి తిరిగివస్తోంది. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన మహేష్ నిన్ను చంపేస్తానంటూ ఆమెపై కొబ్బరి బోండాల కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తేజస్వి తల్లి, సోదరి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయినప్పటికీ ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. మహేష్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తేజస్విని తల్లి విజయకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతో గొడ్డలితో దాడి విజయవాడ(చిట్టినగర్) : భార్యతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో గొడ్డలితో చంపేందుకు ప్రయత్నించిన ఘటన కొత్తూరు తాడేపల్లిలో చోటుచేసుకుంది. దీనిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తూరు తాడేపల్లిలో తిరుపతిరావు, పద్మ దంపతులు 2011లో ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటిని నిర్మించుకునే సమయంలో సమీపంలో ఉండే జడ రామారావు ఇంట్లో అద్దెకు చేరాడు. ఈ క్రమంలో రామారావు తన భార్య పద్మతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం తిరుపతిరావుకు కలిగింది. తన సొంత ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత తిరుపతిరావు కుటుంబం ఇల్లు ఖాళీ చేసింది. అయినా సరే రామారావుపై అనుమానంతో నిన్ను చంపుతానని తిరుపతిరావు బెదిరించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి రామారావు తన ఇంటిలో భోజనం చేసి చేతులు కడుకునేందుకు బయటకు రాగా అప్పటికే అక్కడ గొడ్డలితో వేచి ఉన్న తిరుపతిరావు దాడి చేశాడు. ఈక్రమంలో రామారావు ఎడమ చేతిని అడ్డు పెట్టడంంతో గాయమైంది. దీంతో బాధితుడు కేకలు వేయగా తిరుపతిరావు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
సరిహద్దుకు భారీగా బలగాలు
చర్ల : సత్యనారాయణపురంలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకున్న కాల్పుల ఘటనతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. సరిహద్దులోని అటవీప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. సోమ, మంగళవారాల్లో సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న గ్రేహౌండ్స్, డిస్ట్రిక్ట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. ఒక్కసారిగా భారీగా బలగాలు చేరుకోవడంతో సరిహద్దుల్లోని ఆదివాసీ గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. సత్యనారాయణపురం కాల్పుల ఘటనలో పాల్గొన్న మావోయిస్టులు, మిలిటెంట్లు, మిలీషియా సభ్యుల ఆచూకీ కోసం తీవ్రంగా బలగాలు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సరిహద్దు ప్రాంతాల్లోని ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినపల్లి, కుర్నపల్లి, ఎర్రబోరు, బోదనెల్లి, కురకట్‌పాడు, డోకుపాడు, తిప్పాపురం తదితర గ్రామాలలోని ఆదివాసీలను వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు ఆదివాసీలు సహకరించవద్దని, ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కల్గించే వారికి సహకరించి ఇబ్బందులు తెచ్చుకోవద్దంటూ ఆదివాసీలకు పోలీసులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివాసీ గ్రామాల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. -
సత్యనారాయణపురంలో ఘరానా మోసం
తిరుపతిః సత్యనారాయణపురంలో ఘరానా మోసానికి పాల్పడిని వ్యక్తిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం సుధాకర్ అనే వ్యక్తి వీసాలు ఇప్పిస్తానని అనేక మందిని మోసం చేశాడు. వారి వద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. వారికి సుధాకర్ వీసాలు ఇప్పించలేదు. డబ్బు ఇచ్చినవారికి ఎటువంటి సమాధానం చెప్పడంలేదు. దాంతో సుధాకర్ ని చితకబాది అలిపిరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. -
ఫోర్జరీ మాటున కిడ్నీ రాకెట్!
తహశీల్దార్, సబ్‌కల్టెర్ సంతకాలు ఫోర్జరీ సర్టిఫికెట్లో ఇచ్చిన అడ్రస్ బోగస్ దొంగ సర్టిఫికెట్లతో వ్యాపారం? సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా అమాయకులకు వల విసురుతున్నట్లు తెలుస్తోంది. డబ్బు కోసం కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారికి అవసరమైన సర్టిఫికెట్లను ఫోర్జరీ సంతకాలతో మరో ముఠా సమకూరుస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్ నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వారి బండారం బయటపడింది. విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించాలని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. వెలుగుచూసిందిలా.. మిరియాల క్రాంతిదుర్గాప్రసాద్ అనే వ్యక్తి కిడ్నీ దానం చేసేందుకు కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని సత్య కడ్నీ సెంటర్‌కు వెళ్లారు. తన తండ్రి పేరు మిరియాల కృష్ణప్రసాద్ అని, తాను విజయవాడ సత్యనారాయణపురంలోని తిరుమలశెట్టి వారి వీధిలో (ఇంటి నెం: 23-15-100/ఎ) నివాసం ఉంటున్నామని, తమ ఇంటి యజమాని ముదిగంటి శ్రీనివాస చక్రవర్తి అనారోగ్యంతో ఉన్నందున ఆయనకు స్వచ్ఛదంగా కిడ్నీ ఇస్తున్నానని చెప్పాడు. ఇందుకు సంబంధించి తహశీల్దార్ జారీచేసిన ధ్రువీకరణ పత్రాన్ని సత్య కిడ్నీ సెంటర్‌కు అందజేశారు. ఆస్పత్రి వారు ఈ సర్టిఫికెట్‌ను వెరిఫికేషన్ కోసం విజయవాడ అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావ్కు పంపించారు. సర్టిఫికెట్‌ను పరిశీలించిన తహశీల్దార్ తన సంతకంతోపాటు సబ్ కలెక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం వచ్చిన ఈ ఫోర్జరీ సంతకాల సర్టిఫికెట్‌ను గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చి దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. అయితే సదరు వ్యక్తి సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నందున స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తహశీల్దార్‌కు పోలీసులు సూచించారు. దీంతో తహశీల్దార్ శనివారం రాత్రి సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతా బోగస్.. మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ నివాసం ఉంటున్నట్లు పేర్కొన్న ఇంటికి శనివారం రాత్రి ‘సాక్షి’ బృందం వెళ్లి పరిశీలించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ ఇంటి యజమాని టి.రామారావు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తేలింది. ఈ నంబరు గల ఇంట్లో రెండు పోర్షన్లు ఉన్నాయి. పై పోర్షన్లో వెంకటేశ్వరరావు, కింది పోర్షన్లో గడ్డం కళ్యాణ చక్రవర్తి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దీనిని బట్టి మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ పేరుతో ఇక్కడ ఎవరూ నివాసం లేరని స్పష్టమైంది. అయితే.. ఇదే ఇంటి నంబరుపై మిరియాల కృష్ణప్రసాద్ పేరు ఓటర్ల జాబితాలో ఉంది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణప్రసాద్, క్రాంతి దుర్గాప్రసాద్ పేర్లతో ఈ ఇంట్లో ఇటీవల కాలంలో ఎవరూ లేరని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కింది పోర్షన్లో నివాసం ఉంటున్న గడ్డం కళ్యాణచక్రవర్తిని.. ప్రశ్నించగా తాను నాలుగు సంవత్సరాలుగా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నానని, ఇక్కడ కృష్ణప్రసాద్ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. ఇంటి ఓనర్ హైదరాబాద్‌లో ఉంటారని తెలిపాడు. ఫోర్జరీ ముఠాకు, కిడ్నీ రాకెట్‌కు లింకు! ఈ పరిణామాలను పరిశీలిస్తే కిడ్నీ రాకెట్ ముఠాతో కృష్ణప్రసాద్, ఆయన కుమారుడు క్రాంతి దుర్గాప్రసాద్‌లకు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరు ప్రస్తుతం ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫోర్జరీ సంతకాల ముఠాకు, కిడ్నీ రాకెట్ ముఠాకు కూడా సంబంధాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నీ రాకెట్ ముఠాలో హైదరాబాద్, విజయవాడతోపాటు ఇంకా ఏయే ప్రాంతాల వారు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కలెక్టర్‌కు వివరించిన తహశీల్దార్ తన సంతకం ఫోర్జరీ గురించి తహశీల్దార్ శివరావ్ కలెక్టర్‌కు వివరించారు. ఫోర్జరీ సంతకాల ముఠా ను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
కొత్త రైతుబజార్ల కలేనా...
= స్థలాలు, నిధులు ఉన్నా.. తీరికే లేని అధికారులు! = అటకెక్కిన ప్రతిపాదనలు = పర్యవేక్షించే నాథుడే లేడు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న సామెతను కొత్త రైతుబజార్ల ఏర్పాటు ప్రక్రియ గుర్తుచేస్తోంది. జిల్లాలో కొత్త రైతుబజార్ల ఏర్పాటు కోసం స్థలాలు, నిధులు సిద్ధంగా ఉన్నా రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులకు మాత్రం తీరిక దొరకటం లేదు. ఆదాయం దండిగా వచ్చే ఇసుక రీచ్‌లు, క్వారీల అనుమతులు చకచకా చేసే అధికారులు లక్షలాది మంది ప్రజలకు అతి ముఖ్యమైన రైతుబజార్ల ఏర్పాటు, వాటి మౌలిక వసతుల కల్పనపై తీవ్ర అలక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూరలు పండించే సన్న, చిన్నకారు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ దళారీ వ్యవస్థను నిర్మూలించి, వినియోగదారులకు సరసమైన ధరల్లో నాణ్యమైన కూరలను అందించే లక్ష్యంతో ఏర్పాటైన రైతుబజార్ల ఆలనాపాలనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పెండింగ్‌లోనే 9 రైతుబజార్ల ఏర్పాటు... జిల్లాలో మొత్తం 15 రైతుబజార్లు ఉండగా.. వాటిలో విజయవాడలో 4, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో 11 ఉన్నాయి. విజయవాడలో కొత్తగా భవానీపురం, రాణిగారితోట, సత్యనారాయణపురం, జిల్లాలో గన్నవరం, కైకలూరు, పామర్రు, పెడన, తిరువూరు, అవనిగడ్డలలో రైతుబజార్లు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు, కూరలు పండించే రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలో పోరాడగా పోరాడగా భవానీపురంలో మాత్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తిరువూరులో స్థలం సిద్ధంగా ఉంది. నాలుగేళ్ల క్రితమే రూ.10 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. కొందరు వ్యాపారులు రైతుబజారు వద్దని గొడవ చేసినా చివరకు కోర్టు సైతం అక్కడ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. అవనిగడ్డలో కూడా స్థలం సిద్ధంగా ఉంది. రైతులు, ప్రజలు ఎన్నాళ్ల నుంచో కోరుతున్నా కొందరు వ్యాపారులు మాత్రం రాజకీయంగా మోకాలడ్డారు. ఇక కైకలూరు, గన్నవరంలలో రైతుబజార్ ఏర్పాటు చేయమని ఎన్నో ఏళ్లనుంచి ప్రజలు కోరుతున్నారు. కేవలం మార్కెటింగ్, రెవెన్యూ అధికారుల అలక్ష్యం వల్లే అక్కడ ఈ ప్రక్రియ ముందుకు సాగటం లేదని విమర్శలు వస్తున్నాయి. పెడన, విజయవాడలోని రాణిగారితోట, సత్యనారాయణపురంలలో రైతుబజార్ల ఏర్పాటు ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. తాజాగా పామర్రులో రైతుబజార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ స్థలం ఉన్నా అధికార యంత్రాంగానికే సమయం చిక్కటం లేదని విమర్శలు వస్తున్నాయి. పట్టించుకోని అధికారులు... జిల్లాలో 9 చోట్ల కొత్త రైతుబజార్లు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన దశాబ్దకాలం నుంచి ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదు. మార్కెటింగ్ శాఖలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతుబజార్ల పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బంది లేకపోవటంతో ఈ ప్రక్రియ ముందుకు సాగటంలేదని తప్పించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు గట్టిగా అడిగిన చోట ప్రతిపాదనలు పంపి మార్కెటింగ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. స్థలాల సేకరణకు రెవెన్యూ, మార్కెటింగ్, మున్సిపల్ అధికారులను సమన్వయపరిచే నాథుడే కనపడటంలేదు. కొన్నిచోట్ల స్థలాలు ఇవ్వటానికి మున్సిపల్, పంచాయతీ అధికారులు సిద్ధంగా ఉన్నా, రెవెన్యూ మార్కెటింగ్ అధికారులకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు కనీసం నాలుగేళ్ల నుంచి తీరిక దొరకలేదు. ఈ నేపథ్యంలో కొత్త రైతుబజార్ల ఏర్పాటు ప్రక్రియ ఎడారిలో ఎండమావిలా కనపడుతోంది. ఉన్నవాటిలోనూ సమస్యలు కోకొల్లలు... ఇప్పటికే కొనసాగుతున్న రైతుబజార్లలోనూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన విజయవాడ స్వరాజ్యమైదానం రైతుబజారు వర్షం వస్తే జలమయమవుతుంది. నగరంలోని పటమట, కేదారేశ్వరపేట, సింగ్‌నగర్, ఉయ్యూరు, జగ్గయ్యపేట, గుడివాడ రైతుబజార్లు కూడా వర్షం వస్తే తటాకాలను తలపిస్తాయి. వీటి అభివృద్ధికి ఎప్పటికప్పుడు నిధులు మంజూరవుతున్నా వాటి పర్యవేక్షణపై అధికారులు దృష్టిసారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎం.రఘునందనరావు అయినా రైతుబజార్ల ఏర్పాటు, మౌలిక వసతులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బైక్‌ల చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
విజయవాడ(సత్యనారాయణపురం), న్యూస్‌లైన్ : ఇళ్లముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరిని సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన వేదరకొండ శివరామకృష్ణ అలియాస్ శివ(21), గుంటూరుకు చెందిన వజ్రగిరి ఏడుకొండలు అలియాస్ కొండలు(21) స్నేహితులు. వ్యసనాలకు బానిసలైన వీరు సొమ్ము కోసం మోటార్‌సైకిళ్లు దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాలుగు బైక్‌లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఒకటి దొంగిలించారు. సత్యనారాయణపురం స్టేషన్ పరిధిలో బైక్‌ల దొంగతనాలు ఎక్కువ అవ్వడంతో పాత నేరస్తులపై పోలీసులు నిఘా ఉంచారు. భాను నగర్ జంక్షన్ కొత్తవంతెన వద్ద పాతనేరస్తులు ఉన్నారని గురువారం వారికి సమాచారం అందింది. స్థానిక స్టేషన్ క్రైమ్ ఎస్సై రామకృష్ణుడు సిబ్బందితో వెళ్లి శివ, కొండలును అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదు మోటార్‌సైకిళ్లను దొంగిలించినట్లు విచారణ సందర్భంగా వారు అంగీకరించారు. దీంతో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శివపైన సత్తెనపల్లి, పిడుగురాళ్ల పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని ఎస్సై రామకృష్ణుడు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.