బైక్‌ల చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు | two people arrest in bike theft case | Sakshi
Sakshi News home page

బైక్‌ల చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు

Published Fri, Sep 13 2013 3:36 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

two people arrest in bike theft case

విజయవాడ(సత్యనారాయణపురం), న్యూస్‌లైన్ : ఇళ్లముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరిని సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన వేదరకొండ శివరామకృష్ణ అలియాస్ శివ(21), గుంటూరుకు చెందిన వజ్రగిరి ఏడుకొండలు అలియాస్ కొండలు(21) స్నేహితులు. వ్యసనాలకు బానిసలైన వీరు సొమ్ము కోసం మోటార్‌సైకిళ్లు దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాలుగు బైక్‌లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఒకటి దొంగిలించారు.
 
 సత్యనారాయణపురం స్టేషన్ పరిధిలో బైక్‌ల దొంగతనాలు ఎక్కువ అవ్వడంతో పాత నేరస్తులపై పోలీసులు నిఘా ఉంచారు. భాను నగర్ జంక్షన్ కొత్తవంతెన వద్ద పాతనేరస్తులు ఉన్నారని  గురువారం వారికి సమాచారం అందింది. స్థానిక స్టేషన్ క్రైమ్ ఎస్సై రామకృష్ణుడు సిబ్బందితో వెళ్లి శివ, కొండలును అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదు మోటార్‌సైకిళ్లను దొంగిలించినట్లు విచారణ సందర్భంగా వారు అంగీకరించారు. దీంతో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శివపైన సత్తెనపల్లి, పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయని ఎస్సై రామకృష్ణుడు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement