చిన్న పిల్లను... నా పెళ్లి ఆపండి ప్లీజ్‌.. | Child Marriage stopped in Vijayawada | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లను... నా పెళ్లి ఆపండి ప్లీజ్‌..

Published Wed, Feb 28 2018 11:43 AM | Last Updated on Wed, Feb 28 2018 11:43 AM

Child Marriage stopped in Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌):  ‘సార్‌.. నేను ఇంటర్మీడియట్‌ చదువుతున్నాను.. నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో పెద్దవాళ్లు  పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నన్ను కాపాడండి’ అంటూ ఓ బాలిక 100కు ఫోన్‌ చేసి పోలీసుల రక్షణ కోరిన ఘటన మంగళవారం విజయవాడలో చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన బాలిక సత్యనారాయణపురంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతుంది. అకస్మాత్తుగా ఇంట్లోవారు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పసుపు కుంకుమల కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఆ బాలిక ఈ తంతు గురించి 100కు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన నున్న రూరల్‌ పోలీసులు మహిళా మిత్ర సభ్యుల సహాయంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేసి తల్లిదండ్రులు, బాలికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కూతురును చక్కగా చదివిస్తామని తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో బాలికను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement