Mahila Mitra
-
ఫొటోలు, వివరాలు షేర్ చేసింది.. అసలు నిజం తెలిసి..
రాధిక (పేరు మార్చడమైనది) డిగ్రీ పూర్తి చేసింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ, తనకు నచ్చే వ్యక్తిని తను ఎంచుకోవాలనుకుంది. అందుకు తగినట్టుగా డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని, తన వ్యక్తిగత వివరాలు ఇచ్చింది. ఎంతోమంది ఫ్రొఫైల్స్ పంపారు. వాటిలో తనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుంది. అలా పరిచయం అయిన వాడే కుమార్ (పేరు మార్చడమైనది). కుమార్ మాటలు, ప్రవర్తన రాధికకు బాగా నచ్చాయి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. ఇంజినీరింగ్ చేశాడు. మంచి కంపెనీలో జాబ్. అన్ని విధాలా తనకు అనువైనవాడు అనుకుంది. తన ఫొటోలు, వివరాలు కూడా అతనితో షేర్ చేసుకుంది. కుమార్ కుటుంబ నేపథ్యం తెలిశాక ఇంట్లో పెద్దలతో మాట్లాడి సంబంధం ఓకే చేయించాలనుకుంది. బయట విడిగా కలవాలనుకున్నారు కానీ, కుమార్ ఉండేది బెంగళూరులో. ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని చెప్పాడు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా ముందే అన్నీ మాట్లాడుకుంటే బాగుంటుందని కుమార్ చెప్పడంతో సరే అంది రాధిక. ∙∙ రెండు రోజులుగా కుమార్ చాటింగ్ చేయడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. ఆన్లైన్లో రెండు కూడా కనిపించడం లేదు. మరుసటి రోజు ఉదయాన్నే వార్తలు చూస్తోంది రాధిక. అందులో... ‘‘డేటింగ్ యాప్‌లు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకున్న కుమార్, వారి అర్ధనగ్న చిత్రాలు, వీడియోలను అడ్డుగా పెట్టుకొని లక్షల్లో డబ్బు లాగుతున్నాడని, ఇలా మోసపోయినవారిలో 200 మంది యువతులు, 100 మందికి పైగా మహిళలు ఉన్నారనీ...జల్సాలకు అలవాటు పడి గతంలో గొలుసు చోరీలు, ఇళ్లలో దొంగతనాలు కూడా చేశాడని, పరిచయస్తుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి బంగారం తీసుకొని పారిపోయాడనీ’’ ఉంది. షాకైన రాధిక ఇంకెప్పుడూ తెలియని వ్యక్తులతో ఫోన్లో కూడా సంభాషించకూడదు అనుకుంది. మంచివాళ్లుగా అనిపించే మహామాయగాళ్లు చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకుంది. ‘ఇలా అయితే, ఎవరికైనా ప్రమాదమే. ఈ డేటింగ్ యాప్స్ అన్నీ బ్యాన్ చేస్తే ఎంతో మంది యువతులు, గృహిణులు సురక్షితంగా ఉంటారు’ అనుకుంది. అన్ని యాప్స్‌లో తన వివరాలన్నీ తొలగించి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. వీడియోలు షేర్ చేయవద్దు డేటింగ్ యాప్‌లో మీరు ఎంటర్ అవుతున్నారంటేనే అక్కడ నకిలీ ప్రొఫైల్స్ ఉంటాయని, మోసపుచ్చే మనుషులు ఉంటారని ముందే అవగాహనతో ఉండాలి. అవతలి వారి మాటలు వేటిని ఉద్దేశించి ఉంటున్నాయో వారి చాటింగ్ చదివితే ఇట్టే అర్థమైపోతుంది. అలాంటి వ్యక్తులతో సంభాషణ అంత సురక్షితం కాదు. పరిచయం అయ్యేవరకు డేటింగ్ యాప్‌ను వాడుకొని, రియల్ లైఫ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తమ పెద్దవారిని కలవమని చెప్పాలి. అంతే కాని మాయమాటలు నమ్మి బయటకు వెళ్లి కలవడం, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం మంచిది కాదు. ఒకవేళ మోసపోయామని గుర్తించినా, పరువు పోతుందని ప్రాణం పోగొట్టుకోకూడదు. వీడియోకాల్స్ రికార్డ్ చేయడం, చాటింగ్ సేవ్ చేసుకోవడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏమైనా జరిగితే, తల్లిదండ్రులకు చెప్పడం, పోలీసులకు పిర్యాదు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. మీ వివరాలు బయటకు రాకుండా, నేరస్తులను పట్టుకుంటాం. మోసపూరిత సమస్యల్లో ఇరుకున్నామనిపిస్తే సైబర్మిత్రా, మహిళామిత్ర వెబ్సైట్లలో కంప్లైంట్ ఇవ్వచ్చు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ గోప్యతా నిబంధనలు తప్పనిసరి వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం అనేది ఈ రోజుల్లో బాగా చర్చించాల్సిన, అవగాహన పెంచుకోవాల్సిన విషయం. ఈ ఆధునిక జీవనంలో స్మార్ట్‌గా మోసం చేసే వ్యక్తులు ఒక్క క్లిక్ అంత దూరంలో ఉంటారనే విషయాన్ని విస్మరించ కూడదు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, ఇతర డేటింగ్ యాప్స్ ఏవైనా మీ గోప్యతా నిబంధనలు తప్పక పాటించండి. అందులో సెట్టింగ్స్‌ను అర్ధం చేసుకోవాలి. మీరున్న లొకేషన్‌ను టర్న్ ఆఫ్ చేయాలి. మీ ఫొటోలు ఆన్లైన్లో పోస్ట్ చేయడం పట్ల జాగ్రత్త వహించాలి. మీ స్నేహితులు పంపినవి అయినా సరే, సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి. అపరిచితులను ఎప్పుడూ దూరం పెట్టడం మంచిది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సమాజానికి.. ‘మహిళా మిత్ర’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన మహిళ మిత్ర (సైబర్ మిత్ర)లు సమాజ మిత్రలుగా మన్ననలు పొందుతున్నారు. వీరు.. పోలీసులు, బాధిత మహిళలకు వారధిగా పనిచేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక మహిళా మిత్ర (సైబర్ మిత్ర) కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. అంతకుముందు దేశవ్యాప్తంగా మహిళా వలంటీర్ల వ్యవస్థ మాత్రమే ఉండేది. అది క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి మహిళా మిత్ర (సైబర్ మిత్ర) పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కూడా కల్పించింది. గతేడాది నవంబర్ నుంచి మహిళా మిత్రల నియామకాలను చేపట్టి పూర్తి చేసింది. 1,097 పోలీస్స్టేషన్ల పరిధిలో 10 వేల మంది మహిళా మిత్ర(సైబర్ మిత్ర)లను నియమించింది. వీరిలో ఎక్కువ మంది స్వయం సహాయక సంఘాలకు చెందినవారే ఉండటం విశేషం. వీరంతా మహిళల సమస్యలపై అవగాహన కలిగి ఉండటంతో క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు పది మంది ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎనిమిది నుంచి పది మంది మహిళా మిత్ర (సైబర్ మిత్ర)లు ఉన్నారు. ప్రతి గ్రామానికి/ వార్డుకు ప్రాధాన్యత కల్పించేలా ఒకరి చొప్పున నియమించారు. స్థానికంగా ఉంటూ.. కనీసం 19 ఏళ్లు నిండి, ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగి, ఏ రాజకీయ పార్టీకి చెందని వారికి మహిళా మిత్రలుగా బాధ్యతలు అప్పగించారు. వీరికి ఆయా పోలీస్స్టేషన్లల్లోని మహిళా ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్లో ఒకరు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. మహిళా మిత్ర (సైబర్ మిత్ర) విధులు.. - తమ పరిధిలోని విద్యార్థినులు, మహిళలను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. - కోడళ్లను వేధింపులకు గురి చేసే అత్తమామలు, భర్తల గురించిన సమాచారం పోలీసులకు చేరవేయాలి. – గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతుంటే వెంటనే ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలి. – బడికి వెళ్లని బడి ఈడు పిల్లల వివరాలను పోలీసుల ద్వారా విద్యా శాఖకు చేరవేసి.. చదివించేందుకు కృషి చేయాలి. – వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తు¯ంటాయి. ఇలాంటి ఘటనల్లో బాధ్యులను గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలి. – సోషల్ మీడియా (అసభ్య పోస్టులు, అసభ్య వీడియోలు, వేధింపులు, తదితర) ద్వారా ఇబ్బందిపడుతున్న బాధిత మహిళలను కాపాడాలి. వారిలో ఆత్మస్థైర్యం కలిగించడంతోపాటు తక్షణ సహాయాన్ని అందించడానికి పోలీసులకు సమాచారమందించాలి. మహిళా మిత్ర సేవలు విస్తరిస్తాం.. –డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళా మిత్ర, సైబర్ మిత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో మహిళల సమస్యలను పోలీసు శాఖ దృష్టికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించే వీరి సేవలను మరింత విస్తరిస్తాం. గ్రామాల్లోని ఏఎన్ఎంలు, అంగన్వాడీ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులతో మహిళా మిత్రలను సమన్వయం చేస్తాం. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా రక్షణ కార్యదర్శులకు మహిళా మిత్రలను అప్పగిస్తాం. -
‘టెక్నాలజీకి రెండు వైపులా పదును ఉంటుంది’
సాక్షి, విజయవాడ : ఆధునిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధి ఎంత జరుగుతుందో మోసాలు సైతం అదేవిధంగా పెరిగిపోతున్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. టెక్నాలజీని తమ పిల్లలు ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని ఆమె సూచించారు. గురువారం విజయవాడలో మహిత ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘మహిళలపై సైబర్ నేరాలు, తీసుకోవాల్సిన చర్యలు’పై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మహిళలపై సైబర్ నేరాలు’ పుస్తకాన్ని హోంశాఖ మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..టెక్నాలజీ పెరిగిపోవడంతో మోసాలు చేసే వారి బారిన పడి మహిళలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసగాళ్లు రకరకాల వీడియోలు తీసి పిల్లలను బెదిరిస్తున్నారని, బ్యాంకు అకౌంట్ల ద్వారా మాయ చేస్తున్నారన్నారు. మహిళా మిత్ర ద్వారా మహిళలకు రక్షణ ఏర్పడుతుందని, ఒక ఫోన్‌కాల్ చేసి వారి సమస్యలను పరిష్కరించే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించేలా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని హితవు పలికారు. మహిళల సమస్యలపై పూర్తిగా సహకరిస్తాం మహిళలపై జరిగే నేరాలు అదుపు చేసేందుకు అనేక చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మహిళా మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ మిత్ర వల్ల ఏ మహిళ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వరకు రానవసరం లేదని స్పష్టం చేశారు. మహిళల సమస్యలపై పూర్తిగా సహకరిస్తామని, స్పందన కార్యక్రమం ద్వారా 52 శాతం మంది మహిళలు ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. టెక్నాలజీకి మంచి, చెడు రెండు వైపులా పదును ఉంటుందని, దురదృష్టవశాత్తు ఎక్కువ నేరపూరిరతవైపే టెక్నాలజీ వాడకం పెరిగిపోయిందని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, సైబర్ క్రైం వ్యవస్థ తమ శాయశక్తుల నేరాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉందని పేర్కొన్నారు. -
ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా మిత్రలు
సాక్షి, విశాఖపట్నం : ఇకపై రాష్ట్రంలో మహిళలెవ్వరూ పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లకుండానే భద్రత కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గురువారం విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ‘మహిళా మిత్ర’ సేవలను డీజీపీ గౌతమ్ సవాంగ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతో కలసి ఆమె ప్రారంభించారు. అనంతరం ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అవగాహన సదస్సులో మాట్లాడారు. వేధింపులకు గురవుతున్న మహిళలు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారన్నారు. అలాంటి వారు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకరిద్దరు ‘మహిళా మిత్ర’ పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎలాంటి సమస్య ఉన్నా.. మహిళా మిత్రలకు చెప్పిన క్షణం నుంచి దోషులకు శిక్ష పడే వరకు వారు మీకు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సైబర్ మిత్ర పేరుతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు ఎలాంటి సైబర్ సమస్యలున్నా 9121211100కు వాట్సాప్ చేయాలని సూచించారు. మెసేజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సైబర్ పోలీసులు ఫోన్ చేసి సమస్య తెలుసుకుంటారన్నారు. త్వరలో సైబర్ నేరాలను నియంత్రించడానికి ‘సైబర్ మిత్ర’ యాప్ కూడా రూపొందిస్తామని, ఒక క్లిక్‌తోనే నేరుగా డీజీపీకి సమాచారం వెళ్తుందని తెలిపారు. సైబర్ నేరగాళ్లను నిరోధించాలి.. సోషల్ మీడియాలో లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి సైబర్ వారియర్స్‌లా పనిచేయాలని మహిళలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. వలంటీర్‌గా బాధ్యతలు తీసుకుని అందరికీ అవగాహన కల్పించాలని ఏయూ కళాశాల విద్యార్థినులను కోరారు. భయంతో, పిరకితనంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లను పూర్తిగా నిరోధించాలన్నారు. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మహిళలంతా స్వేచ్ఛగా పోలీసుస్టేషన్‌కి వెళ్లి తమ సమస్యలను చెప్పుకునే విధంగా పోలీస్ మిత్రలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఏయూ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, డీఐజీ రంగారావు, జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వాసవి మిత్ర గ్రూప్ కీర్తి, ప్రొఫెసర్ వల్లి కుమారి, ఏయూ విద్యార్థినులు పాల్గొన్నారు. దాడి ఘటనపై విచారణకు ఆదేశించాం: హోం మంత్రి ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడలో జరిగిన ధర్నాలో జూనియర్ డాక్టర్లపై పోలీసులు చేయిచేసుకోవడంపై విచారణకు ఆదేశించామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ‘మహిళా మిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధర్నాలు, ర్యాలీలు చేయదలుచుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని, శాంతియుతంగా చేపట్టే నిరసనలకు ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పారు. హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. -
విజయవాడలో పోలీసు వ్యవస్థ వైఫల్యం!
-
చిన్న పిల్లను... నా పెళ్లి ఆపండి ప్లీజ్..
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): ‘సార్.. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను.. నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో పెద్దవాళ్లు పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నన్ను కాపాడండి’ అంటూ ఓ బాలిక 100కు ఫోన్ చేసి పోలీసుల రక్షణ కోరిన ఘటన మంగళవారం విజయవాడలో చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన బాలిక సత్యనారాయణపురంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. అకస్మాత్తుగా ఇంట్లోవారు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పసుపు కుంకుమల కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఆ బాలిక ఈ తంతు గురించి 100కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన నున్న రూరల్ పోలీసులు మహిళా మిత్ర సభ్యుల సహాయంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేసి తల్లిదండ్రులు, బాలికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కూతురును చక్కగా చదివిస్తామని తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో బాలికను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
విస్తుగొల్పే వాస్తవాలు!
సాక్షి, అమరావతి బ్యూరో: మహిళ అర్ధరాత్రి ధైర్యంగా నడిచి వెళ్లగలిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ అన్నారు. అయితే రాష్ట్ర రాజధానిలో భాగమైన విజయవాడలో అర్ధరాత్రి కాదు కదా పట్టపగలే మహిళ ధైర్యంగా వెళ్లగలిగే పరిస్థితి లేదు. నగరంలో ఈవ్‌టీజర్లు, రౌడీలు చెలరేగిపోతున్నారు. నగరంలో ప్రధాన ప్రాంతాల్లోనూ మహిళలు ఒంటరిగా సంచరించే పరిస్థితుల్లేవని ఓ మహిళా మిత్ర సభ్యులే తేల్చిచెప్పడం గమనార్హం. వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ‘క్లాప్’ కార్యక్రమంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైన విస్తుగొల్పే విషయాలు రాజధానిలో మహిళల దుస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. ఇదీ ‘క్లాప్’ అమెరికా కాన్సులేట్ కార్యాలయం సహకారంతో విజయవాడలోని వాసవ్య మహిళా మండలి ‘క్లాప్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవాడ పోలీస్ కమిషరేట్‌లో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘మహిళా మిత్ర’ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగా మొదటి దశలో విజయవాడలో గవర్నర్‌పేట, సూర్యారావుపేట, మాచవరం, సత్యనారాయణపురం, సింగ్‌నగర్, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలో మహిళా మిత్ర సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా ఈ పోలీస్స్టేషన్ల పరిధిలో మహిళల భద్రతపై మహిళా మిత్ర సభ్యుల అభిప్రాయం తెలుసుకోవాలని సర్వే నిర్వహించారు. నగర శివార్లలో అధ్వానం విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రదేశాల్లోనే మహిళలకు రక్షణ కరువైందని సర్వేలో తేటతెల్లమైంది. మరీ ఎక్కువగా నగర శివార్లులోని పోలీస్స్టేషన్ల పరిధిలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని పోలీసువర్గాలే చెబుతున్నాయి. శివారు ప్రాంతాల్లోనే కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. రౌడీ గ్యాంగ్‌లు, పోకిరీలు నగరంలో ఎక్కడపడితే అక్కడ ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడుతున్నారు. విజయవాడ పోలీసుల అధికారిక లెక్కల ప్రకారమే గతేడాది 2,500 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. సర్వే ఇలా.. ఆరు పోలీస్స్టేషన్ల పరిధిలో 40 ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేశారు. ఈ ప్రదేశాల పేర్లతో ప్రశ్నావళిని రూపొందించి మహిళా మిత్ర సభ్యులకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అవి.. ఎలాంటి అనుమతి లేకుండానే వెళ్లగలం, కుటుంబసభ్యుల అనుమతి తీసుకుంటేనే వెళ్లగలం, ఒక్కరమే వెళ్లలేం, అసలు వెళ్లలేం. ఈ నాలుగు ఆప్షన్లల్లో ఏవి ఆ 40 ప్రదేశాలకు సరిపోతాయని మహిళా మిత్ర సభ్యులను ప్రశ్నించారు. అందుకు వారు ఇచ్చిన సమాధానాలు విజయవాడలో మహిళలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను తెలిపాయి. ఆ 40 ప్రదేశాల్లో 27 మహిళలకు సురక్షితమైనవి కావని సమాధానమిచ్చారు. కేవలం 13 ప్రదేశాలకు మాత్రమే కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ధైర్యంగా వెళ్లగలమన్నారు. ఇంకో 13 ప్రదేశాలకు వెళ్లాలంటే ముందుగా కుటుంబసభ్యుల అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. వీటిలో కంట్రోల్ రూమ్, నెహ్రూ బస్టాండ్, రాజీవ్‌గాంధీ పార్క్, కాళీమాత ఆలయం, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మొదలైన ప్రదేశాలు ఉండటం గమనార్హం. ఈ ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని స్పష్టం చేశారు. మరో 13 ప్రదేశాలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు తోడు లేకుండా వెళ్లలేమని వెల్లడించారు. వాటిలో పాత ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు, లెనిన్ సెంటర్, సింగ్‌నగర్ బ్రిడ్జ్, టైమ్ ఆస్పత్రి రోడ్, అలంకార్ థియేటర్, సదర్న్ హోటల్ రోడ్డు, రమేశ్ ఆస్పతి రోడ్డు మొదలైనవి ఉండటం గమనార్హం. ఈ ప్రదేశాలకు ఒంటరి మహిళలు వెళ్తే ఈవ్‌టీజింగ్, వేధింపుల బారిన పడాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒక ప్రదేశానికి తోడు ఉన్నాసరే వెళ్లలేమని పేర్కొన్నారు. సర్వేకి ఎంపిక చేసిన ప్రదేశాలు 40 సురక్షితం కానివి 27