పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద లారీ - మినీ వ్యాను ఢీకొన్నాయి.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున లారీ - మినీ వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.