people injured
-
ఆర్టీసీ బస్ ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం భవానిపేట్ గ్రామ శివారులో కరీంనగర్ డిపో బస్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కండక్టర్ సహా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ నుంచి కామారెడ్డి వైపు వస్తుండగా భవానిపేట సమీపంలో ఓ బైక్ బస్‌కు అడ్డుగా వచ్చింది. దీంతో ఆ బైకును తప్పించబోయిన బస్ డ్రైవర్ పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని క్షతగాత్రులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో అంకుర్ సింగ్(మధ్యప్రదేశ్), చాంద్‌బీ, రామారెడ్డి, స్రవంతి(సిరిసిల్ల), జ్యోత్స్న(వీర్నపల్లి), బాలయ్య( ఎన్జీవోస్ కాలనీ కామారెడ్డి), పవన్ (కన్కల్), రజిత(కన్కల్), భారతి(బండ లింగంపల్లి), లక్ష్మీ నర్సింలు (కండక్టర్) గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: కారుతో ఢీ కొట్టి.. ఆపై గొడ్డలితో నరికి -
చిన్నారులను చిదిమేసిన స్కూల్ వ్యాన్
యాచారం: మరికాసేపట్లో బంధువులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాల్సిన ఇద్దరు చిన్నారులు అంతలోనే మృత్యుఒడికి చేరారు. శుభకార్యానికి వెళ్తూ వ్యాన్ కింద చితికిపోయారు. మరో ఇద్దరు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం అనుబంధ గాండ్లగూడెంకు చెందిన బెల్లి రమేశ్, రజిత దంపతులకు వివేక్ (14), గౌతమ్ (9), విశాల్ సంతానం. వీరిలో వివేక్ 9, గౌతమ్ 2వ తరగతి చదువుతున్నారు. యాచారంలో జరిగే ఓ శుభాకార్యానికి గురువారం రమేశ్ తన కుమారులతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. మొండిగౌరెల్లి చౌరస్తాకు రాగానే ఓ వృద్ధుడు స్కూటీతో వీరిని ఢీకొట్టాడు. అప్పటికే వేగంగా వెళ్తున్న రమేశ్ అదుపుతప్పి పిల్లలతో పాటు కిందపడిపోయాడు. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన పాఠశాల వ్యాన్.. చిన్నారుల మీదుగా వెళ్లింది. వివేక్, గౌతమ్ వ్యాన్ చక్రాల కింద చితికి అక్కడికక్కడే మృతిచెందారు. గాయాలపాలైన తండ్రి రమేశ్.. ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాడు. మరో కుమారుడు విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వివేక్, గౌతమ్ మృతదేహాలను ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. రమేశ్, విశాల్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాల వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా, బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి వచ్చారు. చిన్నారులు రక్తపుమడుగులో పడి ఉండడం చూసి బోరున విలపించారు. ఈ ప్రమాదంతో నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుకుమార్ తెలిపారు. -
ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న బస్సు
చౌటుప్పల్(మునుగోడు): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ వద్ద శనివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైతాపురం స్టేజీ వద్ద ఓ లారీ యూ టర్న్ తీసుకుంటున్నప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ బ్రేక్ వేసి తన కారును నిలిపాడు. వెనుకే ఉన్న మరో రెండు కార్ల డ్రైవర్లు సైతం బ్రేకులు వేశారు. కార్ల వెనుకే వచ్చిన హైదరాబాద్ కుషాయిగూడ డిపోకు చెందిన లగ్జరీ బస్సు డ్రైవర్ సాయిలు బ్రేక్ వేశాడు. అయితే ఆ వెనుకే వచ్చిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన లగ్జరీ బస్సు డ్రైవర్ రామ్‌సింగ్ వాహనాలు ఆగిన విషయాన్ని గుర్తించకుండా వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ఉన్న 8 మంది గాయపడ్డారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కాళ్లు విరిగిన వారు కొందరు.. చేతుల విరిగినోళ్లు మరికొందరు.. పక్కటెముకలు, నుదుటి భాగం, మోకాళ్లు, మోచేతులకు తీవ్రగాయాలైన వారు ఇంకొందరు.. హాహాకారాలతో ఏడుపులు, అరుపులతో ప్రాణాలను అరిచేతబట్టుకొని బతుకుజీవుడా..అంటూ బయటపడ్డారు. గురువారం ఉదయం చీమకుర్తి–సంతనూతలపాడు సరిహద్దులో ఆర్టీసీ బస్సు ఓ చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సాక్షి, చీమకుర్తి(ప్రకాశం) : చీమకుర్తి–సంతనూతలపాడు మధ్య కర్నూల్ రోడ్డుపై ఎర్రగుడిపాడు సమీపంలో కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చీమకుర్తి మీదుగా ఒంగోలు వెళ్తూ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన 20 మందికి నుదుటిపై, పక్కటెముకలు, మోకాళ్లు, మోచేతులపై గాయాలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ బయటకు పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిలో హనుమంతునిపాడు మండలం పెద్దగొల్లపల్లికి చెందిన వేంపాటి సరసమ్మ ఉంది. ఆమెకు రెండు కాళ్లూ విరిగాయి. వాటితో పాటు రెండు చేతుల మణికట్ల వద్ద విరిగి విలవిల్లాడిపోయింది. మరో వృద్ధురాలు లక్ష్మమ్మకు రెండు కాళ్లూ విరిగాయి. సీహెచ్ సుశీలమ్మ, డి.లక్ష్మమ్మ, ఆర్టీసీ బస్సు డ్రైవర్ శీలం రామారావు కాళ్లు, చేతులకు బలమైన గాయాలై ఒంటి నిండ రక్తస్రావంతో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. స్వల్ప గాయాలైన వారిలో పి.శివశంకర్, వి.సుబ్బులు, జి.నాగేశ్వరరావు, మహ్మద్ అన్సారీ, సీహెచ్ శ్రీను, నర్సారెడ్డి, సుబ్బమ్మ, టి.శ్రీనివాసరావు, సీహెచ్ వెంకయ్య, బి.తిరుపతమ్మ, ఎన్.వెంకటేశ్వర్లు, వి.సీతమ్మ, ఏ.బ్రహ్మారెడ్డి, వై.సుజాత, ఆశీర్వాదం, లక్ష్మారెడ్డి ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురు హనుమంతునిపాడు మండలానికి చెందిన వారు కాగా మిగిలిన వారిలో కొంతమంది కనిగిరి, చీమకుర్తి, తొర్రగుడిపాడు, ఏలూరివారిపాలెం గ్రామాలకు చెందిన వారు. సంఘటన స్థలాన్ని సీఐ పి.సుబ్బారావు, ఎస్ఐ పి.నాగశివారెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదం ఎలా జరిగిందో ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చీమకుర్తి ప్రభుత్వాస్పత్రికి కొంతమందిని, మరికొంతమందిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఎస్ఐ పి.నాగశివారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీల్‌చైర్స్‌లో రిమ్స్‌కు వస్తున్న క్షతగాత్రులు, గాయాలపాలైన డ్రైవర్ ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. అతివేగం కారణంగానే బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైందని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యక్షంగా చూసిన వారు మాత్రం ప్రమాదం సమయంలో డ్రైవర్‌కు ఆరోగ్యం బాగులేదని, బీపీ డౌన్ కావడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని పేర్కొంటున్నారు. చాలాకాలంగా ఆరోగ్యం సరిలేని డ్రైవర్ శీలం రామారావు ఈ నెల 4వ తేదీ వరకు కనిగిరి డిపోలో గ్యారేజీలో పార్కింగ్ డ్యూటీలో ఉన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి డిపో అధికారులు రామారావుకు మళ్లీ లైన్ డ్యూటీ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన డ్యూటీకి వచ్చాడు. ఆరోగ్యం బాగులేని కారణంగానే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై కనిగిరి ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ కామేశ్వరిని వివరణ కోరగా 4వ తేదీ వరకు పార్కింగ్ డ్యూటీలో డ్రైవర్ రామారావు ఉన్నాడని, అందరిలాగే ఈ నెల 5 నుంచి లైన్ డ్యూటీ వేసినట్లు చెప్పారు. -
నిశీధి వేళ..విషాద హేల
విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు.. రెండు బస్సులు ఘాట్ రోడ్డులో రయ్రయ్ మంటూ వెళుతున్నాయి. ఒక్కొక్క బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వాతావరణం చల్లగా ఉండడంతో బస్సులో ఉన్నవారందరూ నిద్రలోకి జారుకున్నారు. దారంతా మలుపులు, కొత్తమార్గం కావడంతో డ్రైవర్లు కూడా కాస్త ఇబ్బందిగానే బస్సు నడుపుతున్నారు. వంట్లమామిడి జంక్షన్‌కు 200 మీటర్ల దూరంలో ముందు వెళుతున్న బస్సును వెనుక వెళుతున్న బస్సు ఓవర్ టేక్ చేసింది. ఆ సమయంలోనే మలుపు వద్ద అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో ఒక్కసారిగా బస్సు జంక్షన్‌లోని ఎడమ వైపు రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది. బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 37 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సాక్షి, పాడేరు : పాడేరు– చోడవరం ఘాట్ రోడ్డులో వంట్లమామిడి వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీర్థయాత్ర బస్సు నిశీధి వేళ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా దారి పక్కన ఉన్న ఓ దుకాణాన్ని బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. వంట్లమామిడి గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాకినాడ నగరంలోని జగన్నాథపురం రెల్లివీధికి చెందిన 40 మంది ఒక బస్సులో.. అదే ప్రాంతానికి చెందిన మరో 40 మంది ఇంకో బస్సులో ఈ నెల 6న తీర్థయాత్రకు బయల్దేరారు. ముందుగా వారు అనుకున్న ప్రకారం ఒడిశాలోని రాయగఢ్‌లోని గల మజ్జి గౌరమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నానికి అరకులోయ చేరుకున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాలను తిలకించి బొర్రా గుహలకు వెళ్లారు. తిరిగి రాత్రి పది గంటలకు అరకులోయ చేరుకున్నారు. అక్కడ అంతా టిఫిన్లు చేసి పాడేరు బయల్దేరారు. పాడేరు వచ్చేసరికి రాత్రి 11.20 గంటలైంది. ఇక పాడేరులో ఆగకుండానే మంగళవారం ఉదయం మాడుగుల మోదకొండమ్మను దర్శించుకోవాలని ఘాట్ రోడ్డులో బయల్దేరారు. మృతులు ముగ్గురూ విశ్రాంత ఉద్యోగులు బస్సు ప్రమాదంలో మృతి చెందిన జలగడుగుల పోలమ్మ (65), రాజ నాగమణి (63), ఒబిరిశెట్టి దీనమ్మ (62) కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా పని చేసి రిటైరు అయ్యారు. తీరిక సమయంలో వీరు దైవదర్శనాలకు వెళ్లడం వీరికి అలవాటు. ఈ ముగ్గురి భర్తలూ గతంలోనే చనిపోయారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలు ప్రమాదానికి గంట ముందు.. వంట్లమామిడిలో ట్రావెల్ బస్సు గిరిజనుడు జనపరెడ్డి నాగేశ్వరరావుకు చెందిన రేకుల దుకాణాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో దుకాణం పూర్తిగా నేలమట్టమైంది. ప్రమాదానికి గంట ముందు వరకు నాగేశ్వరరావు దుకాణం వద్దే ఉన్నాడు. రోజూ ఇక్కడే అతను ఫైనాఫిల్, పనసపండ్లు విక్రయాలు సాగిస్తాడు. సోమవారం రాత్రి 11 గంటల వరకు తన భార్యతో కలసి దుకాణం వద్ద సమీపంలో ఉన్న ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో వారికి ప్రమాదం తప్పింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రమాద విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మంగళవారం ఉదయాన్నే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే ఫోన్లో కలెక్టర్‌కు విషయం చెప్పారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు కల్పించాలని ఆదేశించారు. ఏడు గంటల తర్వాత వచ్చిన పోలీసులు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు వంట్లమామిడి గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులు సుమారు 7 గంటల తర్వాత కానీ సంఘటన స్థలానికి చేరుకోలేదు. ఉదయం 8 గంటల సమయంలో డీఎస్పీ రాజ్‌కమల్, సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై నజీర్ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు. మృతదేహాలను శవపంచనామా జరిపి పాడేరు జిల్లా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. సకాలంలో స్పందించిన 108 బస్సు ప్రమాద బాధితులకు 108 సేవలు సకాలంలో అందించాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. దీంతో పాడేరు–2, పెదబయలు, హుకుంపేట, జి.మాడుగుల, చోడవరం, మాడుగుల ప్రాంతాలకు చెందిన ఆరు 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వారికి 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో సేవలు అందించడంతో నలుగురికి ప్రాణపాయం తప్పింది. మిగిలిన వారికి మెరుగైన వైద్యసేవలు అందాయి. క్షతగాత్రులకు వైద్య సేవలు వంట్లమామిడి ట్రావెల్ బస్సు ప్రమాద క్షతగాత్రులకు ఎన్టీఆర్ వైద్యాలయంలో వైద్య సేవలు అందించారు. ఆస్పత్రిలో మొత్తం 38 మంది చేరారు. వీరిలో కె.వెంకన్న, వాసంశెట్టి వెంకటలక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేజీహెచ్‌కు తరలించారు. జె.అన్నపూర్ణ అనే మహిళ అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం పొందుతోంది. మిగిలిన వారందరూ ఎన్టీఆర్ వైద్యాలయంలో చికిత్స పొంది మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక ప్రైవేటు బస్సులో స్వస్థలం కాకినాడకు బయల్దేరి వెళ్లిపోయారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నాయకులు పరామర్శించారు. డ్రైవర్ నిర్లక్ష్యమేనా? ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మరోరవైపు శనివారం నుంచి సోమవారం వరకు డ్రైవింగ్ చేసి డ్రైవర్ అలసటకు గురవడంతో నిద్ర మత్తులోకి జారుకోవడం ద్వారానే ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. ఆర్టీఏ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఓవర్‌టెక్ చేసిన 200 మీటర్ల దూరంలోనే ప్రమాదం ట్రావెల్ బస్సులు రెండూ పాడేరు దాటిన దగ్గర నుంచి కాస్త వేగంగా వెళుతున్నాయి. జల్లులు పడుతుండడం.. వాతావరణం చల్లగా ఉండడంతో బస్సులో ఉన్నవారందరూ నిద్రలోకి జారుకున్నారు. దారంతా మలుపులు, కొత్తమార్గం కావడంతో డ్రైవర్లు కూడా కాస్త ఇబ్బందిగానే బస్సు నడుపుతున్నారు. వంట్లమామిడి జంక్షన్‌కు 200 మీటర్ల దూరంలోనే ముందు వెళుతున్న బస్సును ప్రమాదానికి గురైన బస్సు ఓవర్ టేక్ చేసింది. ఆ సమయంలోనే మలుపు వద్ద అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో ఒక్కసారిగా బస్సు బ్రేకులు ఫెయిలై జంక్షన్‌లోని ఎడమ వైపు రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది. బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. చుట్టూ చీకటి కమ్ముకుని ఉంది. దీనికి తోడు వాన పడుతోంది. బస్సు ముందు భాగం అద్దాలు పూర్తిగా పగలిపోవడంతో లోపల ఉన్న వారు రోడ్డుపైకి దూసుకుపోయారు. మరికొంత మంది సీట్ల మధ్య నలిగిపోయి ఇరుక్కుపోయి హాహాకారాలు చేస్తున్నారు. శబ్దానికి వంట్లమామిడి గ్రామస్తులు నిద్రలేచి ఏం జరిగిందని పరుగులు తీశారు. వెనుక వస్తున్న బస్సులోని వారు సంఘటనను చూసి తీవ్ర భయాందోళన చెందారు. బస్సులో ఉన్న మహిళలు, పిల్లలు బోరున ఏడవడం మొదలెట్టారు. ఏం చేయాలో వారికి తెలియడం లేదు. వంట్లమామిడి గ్రామస్తులు వెంటనే బోల్తా పడిన బస్సులోని క్షతగాత్రులు ఒక్కొక్కరిని బయటకు తీశారు. చుట్టూ చీకటి ఉండడంతో ఇళ్లలోని టార్చ్లైట్లు, సెల్ఫోన్లు లైట్ల వెలుగులో క్షతగ్రాతులను బయటకు తీసి సపర్యలు చేశారు. యువకులు 108కు సమాచారమిచ్చి వాహనాలు వచ్చాక క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. -
కల్వర్టును ఢీకొట్టిన బస్సు
చందంపేట (దేవరకొండ) : బ్రేకులు ఫెయిలైన బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 33 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని చిత్రియాలలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేం దుకు కాంగ్రెస్ పార్టి నాయకురాలు, సినీ నటి విజయశాంతి దేవరకొండలో నిర్వహించనున్న రోడ్‌షోలో పాల్గొననుండడంతో వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు దేవరకొండకు వివిధ వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. కాగా ఎటువంటి అనుమతులు లేకుండా కాలం చెల్లిన చిత్రియాల గ్రామానికి చెందిన వివేకానంద యూపీఎస్ పాఠశాల బస్సులో సామర్థ్యానికి మించి సుమారు 65 మందిని దేవరకొండకు తరలించారు. కాగా చిత్రి యాల గ్రామ శివారులోని మూలమలుపులు(లోయల ప్రాంతం) ఎల్లమ్మగుడి వద్ద ఒక్కసారిగా బ్రేకులు ఫేల్ కావడంతో మూలమలుపులోని కల్వర్టును ఢీకొట్టింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న స్థానిక సర్పంచ్ కాకనూరి రంగయ్య, కుంభం కాశమ్మ తీవ్ర గాయాలయ్యాయి. వీంతో పాటు మరో 31 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంత మంది బస్సులోనే ఇరుక్కుపోవడంతో జేసి సహాయంతో క్షతగాత్రులను వెలికితీశారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని కూడా హైదరాబాద్‌కు తరలించాలని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కొంత మంది విధుల్లో లేనప్పటికి ఉన్నత వైద్యాధికారుల ఆదేశాల మేరకు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడే సమాచారం అందడంతో వైద్య సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేపట్టారు. క్షతగాత్రులను దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మరికొంత మందిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రామకృష్ణ పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఉలిక్కిపడ్డ చిత్రియాల చిత్రియాల గ్రామంలో గత స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకనూరి రంగయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నత హోదా, ప్రముఖ వ్యాపార వేత్త అదే గ్రామం కావడంతో గ్రామస్తులంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను దేవరకొండకు చేర్చేందుకు, విజయశాంతి రోడ్‌షోను విజయవంతం చేసేందుకు కార్యకర్తలను తరలించేందుకు చర్యలు చేపట్టడంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్న ఈ నేపథ్యంలో సుమారు 60 మంది బస్సులో ప్రయాణిస్తుండగా 33 మందికి గాయాలు కావడంతో గ్రామంలో ఏం జరిగిందోనన్న ఆవేదన పెరిగిపోయింది. 33 మందికి గాయాలు కావడంతో చిత్రియాల గ్రామం ఉలిక్కిపడింది. -
వేర్వేరు ప్రమాదాల్లో పలువురికి గాయాలు
ఇబ్రహీంపట్నంరూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన ఇబ్రహీంపట్నం మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కోహెడ ఎక్స్‌రోడ్డు సమీపంలో కాంక్రీట్ మిక్చర్ వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన బైండ్ల రమేష్(32) తీవ్రంగా గాయపడ్డాడు. రమేష్ హయత్‌నగర్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళ్పల్లిగేటు సమీపంలో మంగళ్‌పల్లి గేటు నుంచి గ్రామంలోకి కారు వెళ్తుంది. మంగళ్‌పల్లి గ్రామం నుంచి గేటు వైపు ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు మద్యం సేవించి అతివేగంతో గేట్ వైపు వస్తున్నారు. టర్నింగ్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారును బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు వంద మీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉన్న కందకంలో పడిపోయారు. క్షతగాత్రులు తుర్కయంజాల్ గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో వీరిని 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. యువకుల పేర్లు తెలిసిరాలేదు. గుర్తు తెలియని వాహనం ఢీకొని రాజేంద్రనగర్ : గుర్తు తెలియని వాహనం ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ తీవ్ర గాయాలకు గురైన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హఫీజ్‌పేట ప్రాంతానికి చెందిన రామకృష్ణ ఆటో డ్రైవర్ సోమవారం ఉదయం నార్సింగి నుంచి గచ్చిబౌలి వైపు ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి వెళ్తున్నాడు. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆటోను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. ఎదురుగా వస్తున్న కారును మరో కారు ఢీకొట్టిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. హైదర్షాకోట్ ప్రధాన రహదారి గూండా మహ్మద్ అహ్మద్ తన కారులో వెళ్తున్నాడు. ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు అహ్మద్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ అహ్మద్‌ను పోలీసులు ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రగతి నివేదనకు వెళ్లి వస్తూ ప్రాణాలొదిలాడు కడ్తాల్ : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు త్రీవంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలోని మైసిగండి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.... నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గౌరరానికి చెందిన దూదేకుల జహంగీర్ (42)తో పాటు అదే గ్రామానికి చెందిన బాలపీర్, గౌస్‌లు ఆదివారం సభకు వ్యానులో వెళ్లారు. సభ ముగిసిన అనంతరం తిరిగి రాత్రి స్వగ్రామానికి బయల్దేరారు. కాగా మార్గమధ్యలో వీరి వాహనాన్ని మైసిగండి సమీపంలో నిలిపారు. అక్కడే వంట చేసుకుని తిని వెళ్దామని వారంతా అక్కడ వాహనాన్ని నిలిపారు. ఇదే సమయంలో జహంగీర్, బాలపీర్, గౌస్‌లు రోడ్డు దాటుతుండగా వీరిని క్రూజర్ వాహనం భీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలకు కాగా 108లో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. తీవ్ర గాయలైన జహంగీర్ చికిత్స పొందుతూ మృతి చెందగా, బాలపీర్, గౌస్‌లు చికిత్స పొందుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
త్రుటిలో తప్పిన ముప్పు
చౌటుప్పల్(మునుగోడు) : చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ వద్ద 65వ నంబరు జా తీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాల వేగం తక్కువ ఉండడంతో త్రుటిలో పెద్ద ముప్పు తప్పినట్టయింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోకు చెందిన టీఎస్05 యూఏ 2192 నంబరు గల బస్సు ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లింది. తిరిగి 10:30 గంటల ప్రాం తంలో దిల్సుఖ్నగర్ నుంచి నార్కట్‌పల్లికి బయలుదేరింది. డ్రైవర్‌గా కె.శ్రీనివాస్‌రెడ్డి, కండక్టర్‌గా కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డిలు డ్యూటీలో ఉన్నారు. అందులో భాగంగా ఎల్బీనగర్లో మరికొంత మంది ప్రయాణికులు ఎక్కారు. అక్కడి నుంచి బయలుదేరే సమయంలో బస్సులో 60 ప్రయాణికులు ఉన్నారు. వివిధ గ్రామాల స్టేజీల వద్ద ప్రయాణికులు ఎక్కగా మొత్తం 89 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. లారీ యూటర్న్ తీసుకోవడంతో.. బస్సు నిండా ప్రయాణికులు ఉండడంతో డ్రైవర్ బస్సును నెమ్మదిగా నడుపుతున్నాడు. ఇంతలో దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద చౌటుప్పల్ వైపునకు వెళ్లేందుకుగాను ఓ టిప్పర్ లారీ వ స్తుంది. హైదరాబాద్ వైపు నుంచి బస్సు వస్తుండడాన్ని గుర్తించిన టిప్పర్ డ్రైవర్ లారీని రోడ్డు నడుమనే ఆపాడు. లారీ ఆగిన విషయాన్ని కనిపెట్టిన బస్సు డ్రైవర్ తన దారిలో వెళ్తున్నాడు. ఈ సమయంలో చౌటుప్పల్ వైపు నుంచి వచ్చిన మరో లారీ మళ్లీ చౌటుప్పల్ వైపుకే వెళ్లేందుకు యూ టర్న్ తీసుకోగా ఒక్కసారిగా లారీ బస్సు ముం దుకు వచ్చింది. తన దారిలో తాను వెళ్తుండడం, ప్రమాదకరంగా ఎలాంటి వాహనాలు లేకపోవడంతో బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి బ్రేక్ వేయలేదు. దీంతో లారీని బస్సు వెనుక నుంచి ఢీకొ ట్టింది. ఆ కుదుపునకు బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. సీట్లు విరిగి పడడం, గాజు ముక్కలు తగలడంతో ప్రయాణికులకు గా యాలయ్యాయి. బస్సు ముందు భాగం దెబ్బ తింది. చాలామంది ప్రయాణికులకు శరీర లోపలి భాగాలు ఎక్కువయ్యాయి. గాయపడ్డ వ్యక్తులను హుటాహుటిన అంబులెన్స్‌ల్లో చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందులో ఆరుగురికి బలమైన గాయాలుకావడంతో మెరుగైన చికి త్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. లారీ, బస్సు వేగంగా లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద సమయంలో బస్సు నూటల్లో ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, అధికారులు ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ సూరజ్‌కుమార్, ఏసీపీ రమేష్, ఆర్టీసీ డీఎం చం ద్రకాంత్, సీఐ వెంకటయ్య, ట్రాఫిక్ సీఐ గోపాల్, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భిక్షమమ్మలు సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన ప్రయాణికులు వీరే... పుట్టోజు శిరీష–హయత్‌నగర్, లోడె యాదమ్మ–చౌటుప్పల్, జొన్నకంటి ముత్తమ్మ–చౌటుప్పల్ మండలం మల్కాపురం, ఆవుల ఐలమ్మ–చి ట్యాల మండలం సుంకెనపల్లి, రాచమల్ల పద్మ– హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, నందగిరి భిక్షపతి–హయత్‌నగర్ మండలం కొయ్హెడ, ముప్పిడి నర్సింహ్మ–చౌటుప్పల్ మండలం తంగడపల్లి, మ ద్ది ప్రేమ్‌చంద్‌రెడ్డి– మునుగోడు మండలం వెల్మ కన్నె, కొత్త శ్రీనివాస్‌రెడ్డి (బస్సు డ్రైవర్)– నల్లగొండ జిల్లా నకిరేకల్, నారి లక్ష్మమ్మ–పోచంపల్లి మండలం , వెల్వర్తి దేవమ్మ– చౌటుప్పల్ మండలం మల్కాపురం, మిట్టపల్లి సుజాత–సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, జ్యోతి, దొడ్డి చంద్రమ్మ– చిట్యాల మండలం ఆరెగూడెం, ముర్సు లక్ష్మ మ్మ– దేవరకొండ మండలం గుమ్మడవెల్లి, నూనె లింగమ్మ, నల్లగొండ మండలం ధర్మాపురం, పానుగోతు రంగమ్మ–రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, ఎడ్ల ముత్తమ్మ–చౌటుప్పల్ మండలం మ ల్కాపురం, కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి(బస్సు కండక్టర్) – చౌటుప్పల్ మండలం పంతంగి, జొన్నకం టి యాదయ్యలు గాయపడ్డారు. వీరిలో ఆరుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బస్సులో మూడొంతులకుపైగా ప్రయాణికులు మహిళలే ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ చిల్లా సాయిలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ సడన్‌గా వచ్చింది దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద యూ టర్న్ కోసం ఓ టిప్పర్ లారీ ఆగి ఉంది. దాన్ని గమనించాను. కానీ ఆ టిప్పర్ పక్క నుంచి మరో లారీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకునేందుకు బస్సు ముందుకు వచ్చింది. దీంతో అప్పటికప్పుడు కంట్రోల్ చేసినా ఆగకుండా బస్సు లారీకి తగిలింది. – శ్రీనివాస్‌రెడ్డి, బస్సు డ్రైవర్డ్రైవర్ బ్రేకు వేయలేదు నేను కుటుంబ సభ్యులతో కలిసి ఎల్బీనగర్లో బస్సు ఎక్కాను. బ స్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. చౌరస్తా వద్దకు రాగానే పక్క నుంచి లారీ వచ్చింది. ఆ సమయంలో డ్రైవర్ బస్సు బ్రేకులు వేయలేదు. దీంతో ప్రమాదం జరిగింది. వైద్యఖర్చులను ప్రభుత్వం, ఆర్టీసీ భరించాలి. – మాధవి, ప్రయాణికురాలు, మిర్యాలగూడ -
పిచ్చికుక్క దాడిలో 30 మందికి గాయాలు
ఖానాపురం వరంగల్ : పిచ్చికుక్క దాడిలో 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. సోమవారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పిచ్చికుక్క గ్రామంలో స్వైర విహారం చేస్తూ ప్రజలను కరిచింది. కోపోద్రిక్తులైన గ్రామస్తులు, యువకులు కుక్కను వెంబడించి మట్టుబెట్టారు. పిచ్చికుక్క ప్రజలందరి ఎడమ కాలినే కరవడం గమనార్హం. ఈ ఘటన ఖానాపురం మండలంలోని బుధరావుపేట గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఖానాపురం మండలంలోని బుధరావుపేటలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఒకే పిచ్చికుక్క ఏకంగా 30 మందిని గాయపర్చడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. భయంతో ప్రజలు ఏమీ చేయాలో అర్థం కాక పోలీసులకు 100కు డయల్ చేసినా పోలీసులు స్పందించలేదు. బాధితులు వీరే.. గ్రామానికి చెందిన సేరు ఓంప్రియ, కోడి హైమ, గారె కొంరమ్మ, ఐతె సాయమ్మ, కేశపాక వరలక్ష్మి, నల్లతీగల నీలమ్మ, పైండ్ల ప్రశాంత్, షేక్ గులాంరసూల్, నందగిరి లలిత, జెల్ల వెంకన్న, సింగు వెంకటయ్య, షేక్ లాక్య, ఉప్పలమ్మ, సోమగాని అరుణ, వేల్పుల రాణి, సింగు శాంతమ్మ, బత్తుల గోపమ్మ, గణపురం కోమలత, బోనగిరి శ్రీను, యాపచెట్టు రజిత, ధర్నోజు ఉప్పలయ్య, చాట్ల నర్సయ్య, పులిగిల్ల స్వరూప, పావనీతో పాటు మరికొంత మందిని తీవ్రంగా గాయపరిచింది. కుక్కను చంపిన గ్రామస్తులు.. గ్రామ యువకులు కుక్కను వెంబడించి చంపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన బాధితులను అంబులెన్స్, ప్రైవేట్ వాహనాల ద్వా రా నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ప్రాధమిక వైద్య చికిత్సలు అందించిన తర్వా త పలువురిని వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. కొంపెల్లిలో.. భూపాలపల్లి రూరల్ : మండల పరిధిలోని కొంపెల్లి గ్రామంలో కుక్కల స్వైర విహారంతో పలువురికి గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం పాలేరుగా సాదా యాదగిరి పనుల నిమిత్తం వెళ్తుండగా గ్రామంలో పిచ్చికుక్కలు దాడి చేశాయి. దీంతో యాదగిరి కాలుకు గాయమైంది. కుటుంబసభ్యులు చికిత్స కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత వారం రోజులుగా కుక్కలు గ్రామంలో గుంపులు, గుంపులుగా తిరుగుతూ కరుస్తున్నాయని, వారంలో కుక్కలకాటుకు పిట్టల కొమురక్క, కాసగాని సదయ్య, దన్నాడ నారాయణరెడ్డితో పాటు సుమారు 20 మందికి గాయాలై చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు గ్రామంలో పర్యటించి కుక్కల బాధనుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
కురుపాం: గుమ్మలక్ష్మీపురం మండలం మండ – పి ఆమిటి జం„క్షన్ మధ్యలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు బలంగా ఢీ కొట్టడంతో అందులో ప్రయాణికులు పది మంది తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితులు అందించిన వివరాల్లోకి వెళ్తే...కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం, గుమ్మలక్ష్మీపురం నుంచి కురుపాం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోల్లో ఒక ఆటోకు చెందిన డ్రైవర్ సీటు విరిగిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు ఆటోల్లో ప్రయాణిస్తున్న జి.శివడకు చెందిన కడ్రక మాధవి అనే అంగన్వాడీ కార్యకర్తతో పాటు తులసివలస గ్రామానికి చెందిన డి.అశోక్, ఆయన భార్య డి.కల్పన, అద్వానంగూడకు చెందిన ఆరిక దేవ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు ఆవిరి గ్రామానికి చెందిన బిడ్డిక నాగేశ్వరరావు, ఆయన కుమారుడు బిడ్డిక విజయ్, బొద్దిడి గ్రామానికి చెందిన మండంగి మంగు గాయపడ్డారు. వీరిని 108లో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.మెరుగైన వైద్య సేవలు కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి కొందరిని తరలించారు. గుమ్మలక్ష్మీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గుమ్మలక్ష్మీపురం మండలానికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తున్న కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మార్గమధ్యలో ప్రమాదం జరిగి రోడ్డుపైన పడి ఉన్న క్షతగాత్రులను చూసి చలించిపోయారు. 108లో కొంతమందిని ఆస్పత్రికి తరలించగా, కొందరిని తన వాహనంలోనే ఎక్కించి నేరుగా కురుపాం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన చికిత్స అందించే వరకు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై ఆరా తీసి మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైతే ఇతర ఆస్పత్రులకు తరలించాలని వైద్యులకు సూచించారు. -
నదిలో అస్థికలను కలిపేందుకు వెళ్తుండగా..
కోదాడరూరల్ నల్గొండ : చనిపోయిన వ్యక్తి అస్థికలను కృ ష్ణానదిలో కలిపేందుకు ఆటోలో వెళ్తుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో తొమ్మిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన కోదాడ మండలం నల్లబంగూడెం శివారులో ఆదివారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరా ల ప్రకారం.. అనంతగిరి మండలం గోల్తండాకు చెందిన నాగేశ్వర్రావు అనేవ్యక్తి ఇటీవల మృతి చెందాడు. అతని అస్థికలను కలిపేందుకు తమ్ముడు, అల్లుడు, బాబాయి కుమారుడి కుటుంబ సభ్యులందురూ కలిసి జగ్గయ్యపేట మండలంలలో గల ముక్యాల వద్ద కృష్ణానదిలో కలిపేందుకు ఆటోలో బయలు దేరారు. మార్గమధ్యలోని నల్ల్లబండగూడెం శివారులోకి వెళ్లగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న గుర్తుతెలియని కారు వీరి ఆటోను వేగంగా ఢీకొట్టి పరారైంది. ఈ ప్ర మాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మృతుని అన్న బాణోతు బాలాజీ, అతని తల్లి కంసాలి, భార్య జమ్మవాజనికి, ఆటో నడుపుతున్న అల్లుడు ధరవత్ హుస్సేన్ అతని ఇద్దరి పిల్లలు మాధురిదీక్షిత్, యశ్వంత్‌కి మృతుని బాబాయి కుమారుడు ధస్ర అతని భార్య సుజాత, తల్లి సువాలికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం స్థానికులు కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి నుంచి ప్రైవేట్ వైద్యాశాలకు అక్కడ నుంచి బంధువులు మెరుగైన ఖమ్మంకు తరలించారు. వీరిలో కౌసల్యకు రెండు చేతులు విరగగా, హుస్సేన్‌కు 3 చేతివేళ్లు తెగిపోయాయి. క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వైద్యాశాలలు బంధువుల రోదనలతో నిండిపోయాయి. కారు జాడ సాయంత్రం వరకు తెలియరాలేదు. రాత్రివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు. -
మసకబారిన బతుకులు
సోంపేట: మండలంలోని ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం ఎలుగుబంటి సృష్టించిన బీభత్సంతో గ్రామానికి చెందిన బైపల్లి శ్యాం జీవితం చీకట్లోకి వెళ్లిపోగా, మరో రెండు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి విశాఖపట్టణంలోని ఓ ఆస్పత్రి వద్ద, ఒక కుటుంబం శ్రీకాకుళంలో రిమ్స్ ఆస్పత్రి వద్ద కాపలా కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరో ఇద్దరు తమ ఇళ్ల వద్ద కదలలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం ఆరు కుటుంబాలకు ఎలుగు రూపంలో తీరని కష్టం మిగిల్చింది. జీడితోటలు, సముద్ర తీరంతో ఆనందంగా గడిపే ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం నుంచి విషాదఛాయలు అలుముకున్నాయి. ఎవరి నోట విన్నా అదే కథ. నలుగురు ఒకచోటకు చేరితే ఈ విషాద ఘటనను తలచుకుని బాధ పడుతున్నారు. గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా గ్రామ పరిధిలో ఒక ఎలుగు సంచరించడం, మనుషులు మాటలు విని వెళ్లిపోతుండంతో, సహజంగా గ్రామస్తులు ఎలుగు అంటే అంత భయపడే వారు కాదు. కాని ఆదివారం నాడు ఎలుగు సృష్టించిన విధ్వంసంతో గ్రామంలో ఎలుగు పేరు చెపితే బయపడే పరిస్థితి వచ్చింది. మందస మండల పరిధిలో రెండు ఎలుగులు సంచరిస్తున్నాయని మంగళవారం వార్త వ్యాపించడంతో ఈ గ్రామంలోని యువత గ్రామం చుట్టూ కర్రలు పట్టుకుని కాపలా కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. శ్యాం జీవితం అంధకారం బైపల్లి శ్యాంది ఆదివారం ఉదయం వరకు అమ్మ, నాన్నలతో కలిసి ఆనందమయం జీవితం. ఆదివారం ఉదయం ఎలుగు దాడిలో శ్యాం అమ్మ, నాన్న ఊర్మిళ, తిరుపతి మృతి చెందడంతో ఇతడి జీవితం అగమ్యగోచరానికి చేరుకుంది. శ్యాం అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, తాతయ్య ఇదివరలో మృతి చెందడంతో శ్యాం ఒంటరి వాడయ్యాడు. ఇంట్లో కూర్చుని అమ్మ, నాన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోదిస్తున్నాడు. ఆయన రోదనను ఆపేవారు కూడా లేని పరిస్థితి. ఆయన జీవితానికి దేవుడే దారి చూపాలని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇలాంటి విషాదం ఏ కుటుంబంలోను చోటు చేసుకోకూడదని గ్రామస్తులు కోరుకుంటున్నారు. విశాఖలో కాపలా అలాగే బైపల్లి అప్పలస్వామి, దుర్యోధన ఎలుగు దాడిలో తీవ్ర గాయాలపాలవ్వడంతో విశాఖపట్నం తరలించారు. బైపల్లి అప్పలస్వామి తలకు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్యోధనకు కాలికి తీవ్ర గాయం కావడంతో, కాలు తీయక తప్పలేదని వైద్యాధికారులు తెలిపారు. దుర్యోధన ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. దుర్యోధన, అప్పలస్వామి తీవ్రగాయాలతో ఇబ్బందులు పడుతుండడంతో, వారి కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసి విశాఖపట్నంలో బాధితులు వద్ద ఉంటున్నారు. అలాగే గ్రామానికి చెందిన యువకుడు బైపల్లి రాజేష్ తీవ్రగాయాలతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మరో ఇద్దరు రట్టి అప్పన్న, బైపల్లి పాపారావు ప్రస్తుతం గాయాలతో ఇంటి వద్ద కదలలేని పరిస్థితిలో ఉన్నారు. వారి నిత్యవసరాలకు కూడా వేరేవారి సహాయం కోరవలసిన పరిస్థితి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వైద్యం ఖర్చులు పూర్తిగా పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉద్దానాన్ని వీడని ఎలుగుల భయం, తీర ప్రాంతంలో హల్చల్ చేసిన రెండు ఎలుగులు మందస: మందస, సోంపేట మండలాలకు ఎలుగుబంట్ల భయం వీడడంలేదు. మూడు రోజుల కిందట సోంపేట, మందస మండలాల్లో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి హతమైనప్పటికీ పదుల సంఖ్యలో ఉన్న ఎలుగుబంట్లు ఉద్దానం వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. మంగళవారం రెండు ఎలుగుబంట్లు సముద్ర తీర ప్రాంతాల్లో హల్చల్ చేశాయి. దీంతో తీర ప్రాంతానికి చెందిన ఉద్దానం వాసులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడ్డారు. ఉద్దానం కొండలు, జీడితోటల్లో సంచరిస్తున్న రెండు ఎలుగులు దారి తప్పి భేతాళపురం, దున్నవూరు, రట్టి, గంగువాడ తదితర గ్రామాల పరిసరాల్లో తిరిగాయి. సముద్ర తీరం నుంచి వెళ్తూ, కనిపించిన మత్స్యకారులను భయపెట్టాయి. దీంతో వారు అమ్మో.. ఎలుగులు అంటూ పరుగులు తీశారు. కాగా, ఉద్దానంలో ఎలుగులు మనుషులు హటాత్తుగా కనిపిస్తే తప్ప కావాలని వచ్చి మీద పడి దాడి చేయవు. అయితే ఎన్నడూలేని విధంగా మూడు రోజుల కిందట కనిపించిన మనుషులు, పశువులు, పెంపుడు జంతువులపై దాడి చేసి మరీ చంపేయ్యడంతో స్థానికులు హతాశులవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్దానంలో జీవించడం కూడా కష్టమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రముక్కాం, పాతపితాళి, దున్నవూరు సంఘటన మరువక ముందే మరో రెంటు ఎలుగుబంట్లు కలకలం సృష్టించడంతో తీరప్రాంతవాసులు, ఉద్దానం ప్రజలకు కంటిమీద కునుకు కరవవుతుందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వధువు సహా 22మందికి గాయాలు
అశ్వారావుపేటరూరల్ : పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన సోమవారం రాత్రి అశ్వారావుపేట మండలంలోని సున్నంబట్టి–పాకలగూడెం వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తెతో సహా 22 మందికి గాయాలు కాగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం చుక్కలొద్ది గ్రామానికి చెందిన మడకం లక్మా(పెళ్లి కుమార్తె)కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం రాచన్నగూడేనికి చెందిన వరుడితో పెళ్లి నిశ్చయం కాగా, సోమవారం రాత్రి వరుడి ఇంట్లో జరిగే వివాహం కోసం పెళ్లి కుమార్తెను తీసుకొని రెండు ట్రాక్టర్లలో బయల్దేరారు. అశ్వారావుపేట మండలంలోని సున్నంబట్టి–పాకలగూడెం రోడ్డులోగల ఓ మూలమలుపు వద్ద ఒక ట్రాక్టర్ ట్రక్కు చింతకాయ జారిపోయి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఈ ట్రాక్టర్లో ఉన్న పెళ్లి కుమార్తెతోపాటు కోవ్వాసి బీబమ్మ, వెట్టి మంగమ్మ, సోడెం భద్రం, మడకం ముత్తమ్మ, మడకం లక్ష్మీలకు తీవ్ర గాయాలు కాగా వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ట్రాక్టర్ ట్రక్కులో ఉన్న మడివి పండు, మడకం మాడ, ఎం.ఊంగీ, ఎం.లక్ష్మి, ముచ్చిక దేవ, మడకం లక్ష్మీతోపాటు మరో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న 108 వాహనం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి విషమంగా ఉన్న వారిని స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన వారిని మరో ట్రాక్టర్ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణంతా క్షతగాత్రుల రోదనలతో హోరెత్తింది. దీనిపై స్థానిక పోలీసులు వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా..ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
చిన్నారిని తప్పించబోయి ఆటో బోల్తా
కాశీబుగ్గ : రోడ్డు దాటుతున్న చిన్నారిని తప్పించబోయిన ఆటో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం జరిగింది. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నరాజాం నుంచి పలాస వస్తున్న అటోలో మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురంలో రాజమ్మకోలనీకి చెందిన ఆటోడైవర్ రాజాబాబుతో పాటు వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు భవానీప్రసాద్, వరలక్ష్మి, దున్న పార్వతీ ప్రయాణిస్తున్నారు. ఇందులో రాజాం కాలనీ సమీపంలో చిన్నారి రోడ్డు దాటుతుండగా.. చిన్నారిని తప్పించబోయి ఆటో బోల్తా కొట్టి చెట్టుపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజాబాబు రెండు చేతులు విరిగిపోయాయి. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని 108కి సమాచారం అందించారు. వాహనం అందుబాటులో లేకపోవడంతో ఆటో యూనియన్ సభ్యులు లగేజీ ఆటోను తీసుకువచ్చి క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమించడంతో పలాస వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. భవానీ, పార్వతీకి బలమైన గాయాలయ్యాయి. భవానీ ప్రసాద్ కుడిచేయి విరిగిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎముకల వైద్యులు లేకపోవడంతో ప్రైవేట్ అస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. కాశీబుగ్గ ఎస్ఐ సుదర్శణ వెంకటప్రసాద్ కేసు నమోదుచేశారు. -
దూసుకొచ్చిన మృత్యుశకటం
భూత్పూర్ (దేవరకద్ర) : అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓల్వో బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందగా.. 13 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గురువారం మండలంలోని అన్నాసాగర్ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జానంపేటకు చెందిన ఆటో ప్రతిని త్యం భూత్పూర్ నుంచి జానంపేటకు ప్రయాణికులను తరలిస్తుంటారు. గురువారం సాయంత్రం భూత్పూర్ నుంచి జానంపేట వైపు వెళ్తున్న ఆటోలో డ్రైవర్‌తోపాటు 13 మంది భూత్పూర్ నుంచి జాంపేటకు వెళ్తుండగా అన్నాసాగర్ సమీపంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్తున్న ఓల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న జహంగీరమ్మ(48) (జానంపేట), చంద్రమ్మ (అన్నాసాగర్), బాలరాజు (ఆటో డ్రైవర్), రాకేశ్ (జానంపేట), శ్రీనివాసులు (పోల్కంపల్లి), సత్తమ్మ (అన్నాసాగర్), దేవమ్మ (కనకాపూర్ తండా), సుంకరి జయమ్మ (రావులపల్లి), కావలి హన్మంతు (రావులపల్లి), తుప్పలన్న (రావులపల్లి), కావలి వెంకటమ్మ (రావులపల్లి), శంకర్‌నాయక్ (కనకాపూర్ తండా), నాగమ్మ (అన్నాసాగర్), నాగమ్మ (అన్నాసాగర్)లకు తీవ్ర గాయాలు కాగా ఎల్అండ్ టీ అంబులెన్స్, 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. జానంపేటకు చెందిన జహంగీరమ్మ చేయి విరిగి 5 మీ టర్ల దూరంలో పడిపోయింది. జహంగీరమ్మ జి ల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, చంద్రమ్మ, ఆటోడ్రైవర్ బాలరాజుల పరిస్థితి విషమంగా మారిందని ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఓల్వో బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇందులో ఆటోడ్రైవర్ బాలరాజు, శ్రీనివాసులు, చంద్రమ్మల పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. రెండు గ్రామాల్లో విషాదం.. మూసాపేట (దేవరకద్ర) : భూత్పూరు మండలం అన్నాసాగర్ వద్ద గురువారం సాయంత్రం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మూసాపేట మండలంలోని జానంపేట, కనకాపూర్‌తండాకు చెందిన పలువురు గాయపడటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జానంపేటకు చెందిన బాలరాజు(30), జహంగీరమ్మ (48), కనకాపూర్‌తండాకు చెందిన శంకర్‌నాయక్(45), దేవమ్మ(45) అందరూ కూలీపని చేసు కుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శంకర్‌నాయ క్, దేవమ్మలకు స్వల్ప గాయాలు కాగా, జహంగీరమ్మ మృతిచెందింది. బాలరాజు తలకు తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని సాయికృష్ణ ఆస్పత్రికి తరలించారు. నలుగురు కూడా పొట్టకూ టి కోసం వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శంకర్‌నాయక్, దేవమ్మలు వ్యవసాయానికి అవసరమైన తాళ్లు అల్లుకుని వాటిని అమ్మి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. జానంపేట గ్రామానికి చెందిన బాలరాజు ఆటోతో జీవనం కొనసాగిస్తుండగా, జాహంగీరమ్మ భూత్పూరులో పల్లీలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తుంది. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే భూత్పూర్: మండలంలోని అన్నాసాగర్ సమీపంలో గురువారం సాయంత్రం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రాత్రి పరామర్శించారు. అన్నాసాగర్‌కు చెందిన చంద్రమ్మకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాద సంఘటనలో అన్నాసాగర్, రావుపల్లి, పోల్కంపల్లి, జానంపేట, కనకాపూర్‌తండా వాసులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల కు చికిత్స అందించాలని ఎమ్మెల్యే ఆల వైద్యులకు సూచించారు . బీసీ రాష్ట్ర నాయకులు, అన్నాసాగర్ సర్పంచ్ మంజుల పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ల సం ఘం మండలాధ్యక్షుడు ఆంజనేయులు, శశివర్ధన్‌రెడ్డి, రాజారెడ్డి, శ్రీనివాసులు తదితరులున్నారు. -
కులదైవం వద్దకు వెళుతుండగా ప్రమాదం
అన్నానగర్: వ్యాన్‌ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న ఘటనలో బాలుడు, బాలిక మృతి చెందగా, 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మవాడిపట్టి సమీపంలో ఆదివారం జరిగింది. వ్యాన్‌ను కోవై రత్తినపురి కన్నప్పనగర్ పుదుకోటకు చెందిన శరవణన్ (48) సొంతంగా వ్యాన్ నడుపుతున్నాడు. ఇతని భార్య శరణ్య (28). వీరికి హరీష్ (15) కుమారుడు, హరిణి (10), సూర్యశ్రీ (6) ఇద్దరు కుమార్తెలున్నారు. వీరి బంధువులు వసంత (30), గంగాదేవి (68), భూపతి (30), దయానంద్ (13), సానియా (8)తో సహా 14 మంది శనివారం రాత్రి కోవై నుంచి తూత్తుక్కుడి జిల్లా కోవిల్పట్టిలో ఉన్న తమ కులదైవం ఆలయానికి వ్యాన్‌లో బయలుదేరి వెళ్లారు. వ్యాన్‌ను శరవణన్ నడిపాడు. అదే సమయంలో గోపిచెట్టి పాళయం నుంచి మదురైకి ఓ ప్రభుత్వ బస్సు బయలుదేరింది. బస్సును మదురైకు చెందిన భూపతి నడిపాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు వాడిపట్టి సమీపం దాదమ్‌పట్టి కాలువ ప్రాంతంలో దిండుక్కల్ – మదురై హైవే రోడ్డులో వస్తుండగా హఠాత్తుగా వ్యాన్ వెనుక భాగంలో ప్రభుత్వ బస్సు ఢీకొంది. ప్రమాదంలో వ్యాన్ బోల్తాపడి నుజ్జునుజ్జయింది. వ్యాన్‌లో చిక్కుకుని దయానంద్, సానియా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు శరవణన్, శరణ్యా, హరిష్, హరిణి, సూర్యాశ్రీ, వసంతా, గంగాదేవి, భూపతి ఈ ఎనిమిది మంది తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వాడిపట్టి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని చికిత్స కోసం మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.∙ -
పల్టీ కొట్టిన బస్సు
బరంపురం/భువనేశ్వర్ : నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో గల దిగపండి 56వ జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సు పల్టీ కొట్టడంతో ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యారు. వారిలో ఆరుగురు ప్రయాణికుల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. దిగపండి ఐఐసీ అధికారి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్‌లోని సాలియా సాహి బస్తీ వాసులు 25 మంది గంజాం జిల్లాలోని బంకేశ్వరి పీఠం సందర్శనకు బస్సులో బయల్దేరారు. వారంతా బస్సులో సోమవారం ఉదయం సురడా నుంచి బరంపురం వస్తుండగా సరిగ్గా దిగపండి పోలీసు స్టేషన్ పరిధి 56వ జాతీయ రహదారి గోకర్ణపూర్ గ్రామం దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు పల్టీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తొలుత దిగపండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. జరిగిన ధుర్ఘటనపై దిగపండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ - వ్యాన్ ఢీ: 25 మందికి గాయాలు
-
లారీ - మినీ వ్యాన్ ఢీ: 25 మందికి గాయాలు
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున లారీ - మినీ వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమల వద్ద లోయలో పడిన జీపు: 8 మందికి గాయాలు
తిరుపతి : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 18వ మలుపు వద్ద గురువారం భక్తులతో వెళ్తున్న జీపు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను లోయలో నుంచి వెలికి తీసి... తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిచ్చికుక్క దాడి : ఐదుగురికి తీవ్రగాయాలు
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఖానాపూర్లోని పలు కాలనీల్లో ఆదివారం ఉదయం ఓ పిచ్చికుక్క స్థానికులను కరించింది. దీంతో ఐదుగురి బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక అసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పిచ్చికుక్కను పట్టుకోవడంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.