
సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం భవానిపేట్ గ్రామ శివారులో కరీంనగర్ డిపో బస్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కండక్టర్ సహా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ నుంచి కామారెడ్డి వైపు వస్తుండగా భవానిపేట సమీపంలో ఓ బైక్ బస్‌కు అడ్డుగా వచ్చింది. దీంతో ఆ బైకును తప్పించబోయిన బస్ డ్రైవర్ పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని క్షతగాత్రులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో అంకుర్ సింగ్(మధ్యప్రదేశ్), చాంద్‌బీ, రామారెడ్డి, స్రవంతి(సిరిసిల్ల), జ్యోత్స్న(వీర్నపల్లి), బాలయ్య( ఎన్జీవోస్ కాలనీ కామారెడ్డి), పవన్ (కన్కల్), రజిత(కన్కల్), భారతి(బండ లింగంపల్లి), లక్ష్మీ నర్సింలు (కండక్టర్) గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.