
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు
కోదాడరూరల్ నల్గొండ : చనిపోయిన వ్యక్తి అస్థికలను కృ ష్ణానదిలో కలిపేందుకు ఆటోలో వెళ్తుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో తొమ్మిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన కోదాడ మండలం నల్లబంగూడెం శివారులో ఆదివారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరా ల ప్రకారం.. అనంతగిరి మండలం గోల్‌తండాకు చెందిన నాగేశ్వర్‌రావు అనేవ్యక్తి ఇటీవల మృతి చెందాడు.
అతని అస్థికలను కలిపేందుకు తమ్ముడు, అల్లుడు, బాబాయి కుమారుడి కుటుంబ సభ్యులందురూ కలిసి జగ్గయ్యపేట మండలంలలో గల ముక్యాల వద్ద కృష్ణానదిలో కలిపేందుకు ఆటోలో బయలు దేరారు. మార్గమధ్యలోని నల్ల్లబండగూడెం శివారులోకి వెళ్లగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న గుర్తుతెలియని కారు వీరి ఆటోను వేగంగా ఢీకొట్టి పరారైంది.
ఈ ప్ర మాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మృతుని అన్న బాణోతు బాలాజీ, అతని తల్లి కంసాలి, భార్య జమ్మవాజనికి, ఆటో నడుపుతున్న అల్లుడు ధరవత్ హుస్సేన్ అతని ఇద్దరి పిల్లలు మాధురిదీక్షిత్, యశ్వంత్‌కి మృతుని బాబాయి కుమారుడు ధస్ర అతని భార్య సుజాత, తల్లి సువాలికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని చికిత్స నిమిత్తం స్థానికులు కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి నుంచి ప్రైవేట్ వైద్యాశాలకు అక్కడ నుంచి బంధువులు మెరుగైన ఖమ్మంకు తరలించారు. వీరిలో కౌసల్యకు రెండు చేతులు విరగగా, హుస్సేన్‌కు 3 చేతివేళ్లు తెగిపోయాయి. క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వైద్యాశాలలు బంధువుల రోదనలతో నిండిపోయాయి. కారు జాడ సాయంత్రం వరకు తెలియరాలేదు. రాత్రివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment