త్రుటిలో తప్పిన ముప్పు | 21 People Injured In Bus Accident | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ముప్పు

Published Fri, Aug 31 2018 3:13 PM | Last Updated on Fri, Aug 31 2018 3:13 PM

21  People Injured In Bus Accident  - Sakshi

ప్రమాదంలో దెబ్బతిన్న బస్సు ముందు భాగం 

 చౌటుప్పల్‌(మునుగోడు) : చౌటుప్పల్‌ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ వద్ద 65వ నంబరు జా తీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాల వేగం తక్కువ ఉండడంతో త్రుటిలో పెద్ద ముప్పు తప్పినట్టయింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి ఆర్టీసీ బస్‌ డిపోకు చెందిన టీఎస్‌05 యూఏ 2192 నంబరు గల బస్సు ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లింది. తిరిగి 10:30 గంటల ప్రాం తంలో దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి నార్కట్‌పల్లికి బయలుదేరింది. డ్రైవర్‌గా కె.శ్రీనివాస్‌రెడ్డి, కండక్టర్‌గా కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డిలు డ్యూటీలో ఉన్నారు. అందులో భాగంగా ఎల్‌బీనగర్‌లో మరికొంత మంది ప్రయాణికులు ఎక్కారు. అక్కడి నుంచి బయలుదేరే సమయంలో  బస్సులో 60 ప్రయాణికులు ఉన్నారు. వివిధ గ్రామాల స్టేజీల వద్ద ప్రయాణికులు ఎక్కగా మొత్తం 89 మంది  బస్సులో ప్రయాణిస్తున్నారు.

లారీ యూటర్న్‌ తీసుకోవడంతో..

బస్సు నిండా ప్రయాణికులు ఉండడంతో డ్రైవర్‌ బస్సును నెమ్మదిగా నడుపుతున్నాడు. ఇంతలో దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద చౌటుప్పల్‌ వైపునకు వెళ్లేందుకుగాను ఓ టిప్పర్‌ లారీ వ స్తుంది. హైదరాబాద్‌ వైపు నుంచి బస్సు వస్తుండడాన్ని గుర్తించిన టిప్పర్‌ డ్రైవర్‌ లారీని రోడ్డు నడుమనే ఆపాడు. లారీ ఆగిన విషయాన్ని కనిపెట్టిన బస్సు డ్రైవర్‌ తన దారిలో వెళ్తున్నాడు. ఈ సమయంలో చౌటుప్పల్‌ వైపు నుంచి వచ్చిన మరో లారీ మళ్లీ చౌటుప్పల్‌ వైపుకే వెళ్లేందుకు యూ టర్న్‌ తీసుకోగా ఒక్కసారిగా లారీ బస్సు ముం దుకు వచ్చింది. తన దారిలో తాను వెళ్తుండడం, ప్రమాదకరంగా ఎలాంటి వాహనాలు లేకపోవడంతో బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి బ్రేక్‌ వేయలేదు.

దీంతో లారీని బస్సు వెనుక నుంచి ఢీకొ ట్టింది. ఆ కుదుపునకు బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. సీట్లు విరిగి పడడం, గాజు ముక్కలు తగలడంతో ప్రయాణికులకు గా యాలయ్యాయి. బస్సు ముందు భాగం దెబ్బ తింది. చాలామంది ప్రయాణికులకు శరీర లోపలి భాగాలు ఎక్కువయ్యాయి. గాయపడ్డ వ్యక్తులను హుటాహుటిన అంబులెన్స్‌ల్లో చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందులో ఆరుగురికి బలమైన గాయాలుకావడంతో మెరుగైన చికి త్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. లారీ, బస్సు  వేగంగా లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.  ప్రమాద సమయంలో బస్సు  నూటల్‌లో ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. 

ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, అధికారులు

ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ సూరజ్‌కుమార్, ఏసీపీ రమేష్, ఆర్టీసీ డీఎం చం ద్రకాంత్, సీఐ వెంకటయ్య, ట్రాఫిక్‌ సీఐ గోపాల్,  ఆర్టీసీ ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌ భిక్షమమ్మలు సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. 

గాయపడిన ప్రయాణికులు వీరే...

పుట్టోజు శిరీష–హయత్‌నగర్, లోడె యాదమ్మ–చౌటుప్పల్, జొన్నకంటి ముత్తమ్మ–చౌటుప్పల్‌ మండలం మల్కాపురం, ఆవుల ఐలమ్మ–చి ట్యాల మండలం సుంకెనపల్లి,  రాచమల్ల పద్మ– హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, నందగిరి భిక్షపతి–హయత్‌నగర్‌ మండలం కొయ్హెడ, ముప్పిడి నర్సింహ్మ–చౌటుప్పల్‌ మండలం తంగడపల్లి, మ ద్ది ప్రేమ్‌చంద్‌రెడ్డి– మునుగోడు మండలం వెల్మ కన్నె, కొత్త శ్రీనివాస్‌రెడ్డి    (బస్సు డ్రైవర్‌)– నల్లగొండ జిల్లా నకిరేకల్, నారి లక్ష్మమ్మ–పోచంపల్లి మండలం , వెల్వర్తి దేవమ్మ– చౌటుప్పల్‌ మండలం మల్కాపురం, మిట్టపల్లి సుజాత–సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, జ్యోతి, దొడ్డి చంద్రమ్మ– చిట్యాల మండలం ఆరెగూడెం, ముర్సు లక్ష్మ మ్మ– దేవరకొండ మండలం గుమ్మడవెల్లి, నూనె లింగమ్మ, నల్లగొండ మండలం ధర్మాపురం, పానుగోతు రంగమ్మ–రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, ఎడ్ల ముత్తమ్మ–చౌటుప్పల్‌ మండలం మ ల్కాపురం, కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి(బస్సు కండక్టర్‌) – చౌటుప్పల్‌ మండలం పంతంగి, జొన్నకం టి యాదయ్యలు గాయపడ్డారు. వీరిలో ఆరుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బస్సులో మూడొంతులకుపైగా ప్రయాణికులు మహిళలే ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చిల్లా సాయిలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీ సడన్‌గా వచ్చింది 

దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద యూ టర్న్‌ కోసం ఓ టిప్పర్‌ లారీ ఆగి ఉంది. దాన్ని గమనించాను.  కానీ ఆ టిప్పర్‌ పక్క నుంచి మరో లారీ ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకునేందుకు బస్సు ముందుకు వచ్చింది. దీంతో అప్పటికప్పుడు కంట్రోల్‌ చేసినా ఆగకుండా బస్సు లారీకి తగిలింది. 

– శ్రీనివాస్‌రెడ్డి, బస్సు డ్రైవర్‌డ్రైవర్‌ బ్రేకు వేయలేదు 

నేను కుటుంబ సభ్యులతో కలిసి ఎల్‌బీనగర్‌లో బస్సు ఎక్కాను. బ స్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. చౌరస్తా వద్దకు రాగానే పక్క నుంచి లారీ వచ్చింది. ఆ సమయంలో డ్రైవర్‌ బస్సు బ్రేకులు వేయలేదు. దీంతో ప్రమాదం జరిగింది. వైద్యఖర్చులను ప్రభుత్వం, ఆర్టీసీ భరించాలి.

– మాధవి, ప్రయాణికురాలు, మిర్యాలగూడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement