
ఘటనా స్థలం వద్ద అపస్మారక స్థితిలో రాజాబాబు
కాశీబుగ్గ : రోడ్డు దాటుతున్న చిన్నారిని తప్పించబోయిన ఆటో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం జరిగింది. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చిన్నరాజాం నుంచి పలాస వస్తున్న అటోలో మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురంలో రాజమ్మకోలనీకి చెందిన ఆటోడైవర్ రాజాబాబుతో పాటు వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు భవానీప్రసాద్, వరలక్ష్మి, దున్న పార్వతీ ప్రయాణిస్తున్నారు.
ఇందులో రాజాం కాలనీ సమీపంలో చిన్నారి రోడ్డు దాటుతుండగా.. చిన్నారిని తప్పించబోయి ఆటో బోల్తా కొట్టి చెట్టుపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజాబాబు రెండు చేతులు విరిగిపోయాయి.
మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని 108కి సమాచారం అందించారు. వాహనం అందుబాటులో లేకపోవడంతో ఆటో యూనియన్ సభ్యులు లగేజీ ఆటోను తీసుకువచ్చి క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమించడంతో పలాస వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
భవానీ, పార్వతీకి బలమైన గాయాలయ్యాయి. భవానీ ప్రసాద్ కుడిచేయి విరిగిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎముకల వైద్యులు లేకపోవడంతో ప్రైవేట్ అస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. కాశీబుగ్గ ఎస్‌ఐ సుదర్శణ వెంకటప్రసాద్ కేసు నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment