భార్యపై కత్తితో దాడి
భార్యపై కత్తితో దాడి
Published Sun, Jul 17 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
విజయవాడ(గాంధీనగర్) :
భార్యను భర్తే నడిరోడ్డుపై కత్తితో దాడి చేసిన ఘటన పూర్ణనందంపేట బాప్టిస్ట్ నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. దీనిపై సత్యానారాయణపురం పోలీస్‌స్టేçÙన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు పెజ్జోనిపేటకు చెందిన కాలే తేజస్విని(22)కి కానూరుకు చెందిన కురెళ్ల మహేష్‌తో ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. మహేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయిన నాలుగైదు నెలలకే కాపురంలో గొడవలు వచ్చాయి. భర్తపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. గొడవల నేపథ్యంలో కొంతకాలంగా తేజస్విని పుట్టింటి వద్ద ఉంటోంది. ఆదివారం ఉదయం చర్చికి వెళ్లి తేజస్వి ఇంటికి తిరిగివస్తోంది. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన మహేష్ నిన్ను చంపేస్తానంటూ ఆమెపై కొబ్బరి బోండాల కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తేజస్వి తల్లి, సోదరి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయినప్పటికీ ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. మహేష్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తేజస్విని తల్లి విజయకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో గొడ్డలితో దాడి
విజయవాడ(చిట్టినగర్) : భార్యతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో గొడ్డలితో చంపేందుకు ప్రయత్నించిన ఘటన కొత్తూరు తాడేపల్లిలో చోటుచేసుకుంది. దీనిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తూరు తాడేపల్లిలో తిరుపతిరావు, పద్మ దంపతులు 2011లో ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటిని నిర్మించుకునే సమయంలో సమీపంలో ఉండే జడ రామారావు ఇంట్లో అద్దెకు చేరాడు. ఈ క్రమంలో రామారావు తన భార్య పద్మతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం తిరుపతిరావుకు కలిగింది. తన సొంత ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత తిరుపతిరావు కుటుంబం ఇల్లు ఖాళీ చేసింది. అయినా సరే రామారావుపై అనుమానంతో నిన్ను చంపుతానని తిరుపతిరావు బెదిరించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి రామారావు తన ఇంటిలో భోజనం చేసి చేతులు కడుకునేందుకు బయటకు రాగా అప్పటికే అక్కడ గొడ్డలితో వేచి ఉన్న తిరుపతిరావు దాడి చేశాడు. ఈక్రమంలో రామారావు ఎడమ చేతిని అడ్డు పెట్టడంంతో గాయమైంది. దీంతో బాధితుడు కేకలు వేయగా తిరుపతిరావు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement