శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పడిపడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21 విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సినిమా చేశాం. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం ఇది. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. క్రిటిక్స్ రివ్యూస్ చదివాను. వారు ఫీల్ అయ్యింది రాశారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. కొందరు ఆడియన్స్ కూడా ఫోన్ చేశారు. సినిమాలో ఫస్ట్‌హాఫ్ భాగుందని, సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయని చెప్పారు. మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాను’’ అని అన్నారు.
‘‘ఈ సినిమా జర్నీలో పాలుపంచుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు నిర్మాత సుధాకర్. ‘‘ఈ సినిమాలో కొత్త శర్వాను చూశాం. ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సీన్స్‌లో శర్వా నటన అద్భుతం. హనుగారు బాగా తీశారు. ఇందులో నాకు డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు నటుడు శత్రు. ‘‘ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. సెన్సిబుల్ అండ్ మ్యూజికల్ హిట్ మూవీ. ఇందులో సూర్య పాత్రలో శర్వా, వైశాలి పాత్రలో సాయిపల్లవి బాగా నటించారు. హీరోయిన్ స్నేహితురాలు శాలిని పాత్రలో నటించే అవకాశం నాకు ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. సుధాకర్‌గారు మరిన్ని విజయాలు అందుకోవాలి’’ అన్నారు కల్పిక.
Comments
Please login to add a commentAdd a comment