సుధాకర్‌తో ఆమ్ ఆద్మీ సినిమా
సుధాకర్‌తో ఆమ్ ఆద్మీ సినిమా
Published Thu, Sep 26 2013 1:19 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో ఒక హీరోగా నటించిన సుధాకర్ కొమకుల కథానాయకునిగా త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. రవిబాబు దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన అరుణ్ దాస్యం ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో కార్తీక్ స్పెషల్ రోల్ చేయనున్నారు.
సీనియర్ తారలు రాధిక, నరేష్, పూర్ణిమ ఇందులో కీలక పాత్రలు పోషిం చనున్నారు. దర్శకుడు అరుణ్ దాస్యం మాట్లాడుతూ -‘‘లవ్, ఫ్యామిలీ డ్రామా కథాంశమిది. రియల్‌లైఫ్‌కి, క్లోజ్‌గా ఉండే కేరెక్టర్స్‌కి మధ్య జరిగే జర్నీ ఇది. లవ్, ఫ్యామిలీ డ్రామా, స్పోర్ట్స్, మ్యూజిక్... ఈ నాలుగు అంశాలు కలబోతగా తీర్చిదిద్దనున్నాం.
అక్టోబర్ మూడోవారంలో చిత్రీకరణ మొదలుపెడతాం. షూటింగ్ మొత్తం వైజాగ్‌లో చేయబో తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్‌నారాయణ్, నిర్మాణం: ఆమ్ టీమ్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అరుణ్ దాస్యం.
Advertisement
Advertisement