Actor Sudhakar Reaction On His Entry In Bigg Boss Telugu OTT - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT: బిగ్‌బాస్‌-6లో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ ఫేం సుధాకర్‌? 

Published Sun, Dec 26 2021 12:35 PM | Last Updated on Sun, Dec 26 2021 12:53 PM

Actor Sudhakar Reaction On His Entry In Bigg Boss Telugu OTT - Sakshi

Actor Sudhakar Reaction On His Entry In Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్‌ సీజన్‌-6 మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటీటీలో ప్రసారం కానుంది. 24 గంటల పాటు లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో ఈ షోపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? షో కాన్సెప్ట్‌ ఎలా ఉండనుంది అనేదానిపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది.

ప్రస్తుతం కంటెస్టెంట్ల సెలక్షన్‌ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా ముందుగానే లీకువీరులు ఈ లిస్ట్‌ను రివీల్‌ చేసే పనిలో పడ్డారు.ఇప్పటికే కొందరుపేర్లను బయటపెట్టేశారు. తాజాగా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ ఫేమ్‌ నటుడు(నాగరాజు) సుధాకర్‌ సైతం బిగ్‌బాస్‌ సీజన్‌-6లో పాల్గొంటారనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

తాజాగా దీనిపై తాజాగా సుధాకర్‌ స్పందించాడు. ఇది ఫేక్‌న్యూస్‌. ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. దీంతో సీజన్‌-6లో సుధాకర్‌ ఎంట్రీ లేనట్టే. కాగా సీజన్‌-4లో అభిజిత్‌కు సుధాకర్‌ సపోర్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement