దరఖాస్తుల ఆహ్వానం | applications inviting for disabled posts | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, Jul 26 2016 10:59 PM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

applications inviting for disabled posts

సంగారెడ్డి జోన్: వికలాంగుల సంక్షేమం కోసం పని చేస్తున్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సుధాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తమ ఉద్యోగి, సెల్ఫ్‌ ఎంప్లాయ్‌ విత్‌ డిసేబుల్, బెస్ట్‌ ఎంప్లాయర్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఆర్‌ ఏజెన్సీ, బెస్ట్‌ ఇండివిడ్యువల్‌ అండ్‌ ఇనిస్టిట్యూషన్స వర్కింగ్‌ ఫర్‌ కేస్‌ ఆఫ్‌ పర్సన్స విత్‌ డిసెబులిటీ , రోల్‌ మోడల్‌ తదితర అంశాల్లో అర్హులైన వారి నుంచి భారత ప్రభుత్వం దరఖాస్తులను కోరుతోందన్నారు.

ఇతర వివరాలు www. disabilityaffairs.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చేనెల 5లోగా కలెక్టరేట్‌లోని జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, వికలాంగులు వినియోగించుకోవాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement