నళిది, సుధాకర్‌లది ప్రేమ వివాహం | Dwell maintained by the petition! | Sakshi
Sakshi News home page

నళిది, సుధాకర్‌లది ప్రేమ వివాహం

Published Mon, Jan 25 2016 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

నళిది, సుధాకర్‌లది ప్రేమ వివాహం

నళిది, సుధాకర్‌లది ప్రేమ వివాహం

ఆ పిటిషన్ ద్వారా కాపురాన్ని నిలబెట్టుకుంది! కేస్ స్టడీ  నళిది, సుధాకర్‌లది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్నారు. ఇరువైపులవారూ ఆగ్రహించి, వీరి పెళ్లికి హాజరు కాలేదు. ఇద్దరూ ఆర్థికంగా స్థిరపడిన వారైనందున మంచి ఇల్లు తీసుకొని కాపురం పెట్టారు. ఒక సంవత్సరం బాగా గడిచింది. తర్వాత సుధాకర్ పేరెంట్స్ అతడితో మాటలు సాగించారు. తమ ఇంటికి వస్తూ పోతుండేలాగా రిలేషన్ మొదలుపెట్టారు. ఈ విషయాలు నళినికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సుధాకర్‌ను కూడా నళినికి చెప్పనీయకుండా కట్టడి చేసి బ్రెయిన్ వాష్ చేశారు. ఫలితంగా సుధాకర్ నళినిని సం॥నుండి వదిలివేసి వేరే ఉంటున్నాడు. నళిని ఎంతగానో ప్రయత్నించింది సుధాకర్‌లోని మార్పు తెలుసుకోవడానికి. కానీ కుంటిసాకులు తప్ప, అసలు విషయం చెప్పలేదు.

చేసేది లేక నళిని ‘రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్’ పిటిషన్ వేసుకుంది (కాపురాన్ని నిలుపుకోవాలని). సుధాకర్ కోర్టుకు హాజరై తనకు అప్పటికే ‘ఎక్స్‌పార్టీ’ డైవర్స్ వచ్చిందని చెప్పాడు. షాక్ తిన్న నళిని తనకు నోటీసు రాలేదని చెప్పుకొని, అతను పంపిన కోర్టు నోటీస్‌లు సెక్షన్‌లో విచారిస్తే ఆమె సంతకం చేసినట్లుగా ఉన్నది. కానీ ఆ సంతకం ఆమెది కాదు. సుధాకర్ ఫోర్జరీ చేసి, మేనేజ్ చేశాడు. అతనిపై ఫోర్జరీ, ఛీటింగ్ కేసు పెట్టి విడాకుల ఆర్డర్‌ను ‘సెట్‌ఎసైడ్’ చేయమని పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత తెలిసింది కోట్ల కట్నంతో సుధాకర్ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడని.
 
ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్
ఫ్యామిలీ కౌన్సెలర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement