గార్లదిన్నె : మండల పరిధిలోని పి. కొత్తపల్లిలో గురువారం ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు... సుధాకర్ (30) అనే వ్యక్తి పురుగుమందు తాగి అపస్మారకస్థితిలో పడిఉండగా స్థానికులు గమనించి బంధువులకు సమాచారం అందించారన్నారు. వెంటనే వారు చికిత్స నిమిత్తం 108కు సమాచారం అందించడంతో అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.