
12 గంటల వ్యవధిలో...
గురువారం మార్చి 1న పన్నెండు గంటల వ్యవధిలో నలుగురు యువకుల జీవితాల్లో జరిగిన ఆసక్తికరమైన సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న చిత్రం ‘గురువారం మార్చి 1’. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీవీ యాంకర్లు ప్రదీప్, రవితో పాటు సప్తగిరి, ‘వైవా’ హర్ష ముఖ్యతారలు.
సుధాకర్ బత్తుల దర్శకత్వంలో యనమల భాస్కర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి మంచు లక్ష్మీప్రసన్న కెమెరా స్విచాన్ చేయగా, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి క్లాప్ ఇచ్చారు. కోన వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘పూర్తి స్థాయి వినోదంతో తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. మే నెల రెండో వారంలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని చెప్పారు.