మదనపల్లెక్రైం: బీటీ కాలేజ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ట్రస్టు సభ్యుల సమావేశాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అధ్యాపకుల బోధనా విధానాన్ని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సభ్యులు సుధాకర్, జగన్నాథరావు, హరివెంకట్రమణ, సత్యనారాయణ, వైద్యనాథన్‌కు వివరిస్తుండగా విద్యార్థుల సమస్యలు చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. సభ్యులు పట్టించుకోకపోవడంతో ఆర్‌ఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహించారు. విద్యార్థుల సమక్షంలో జరగాల్సిన సమావేశాన్ని సీక్రెట్‌గా నిర్వహిస్తారా అంటూ నిరసన నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలు విన్న తర్వాతే సమావేశం నిర్వహించాలంటూ సభ్యులను ఘెరావ్ చేశారు.
ఈ సమయంలో ప్రిన్సిపాల్ కిజర్‌మహ్మద్, అధ్యాపకులు, విద్యార్థులకు మద్య వాగ్వాదం నెలకొంది. ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకుడు ఉత్తన్న మాట్లాడుతూ 2000వ సంవత్సరం నుంచి యూజీసీ నిధుల వినియోగంపై బహిరంగ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రెడ్డిశేఖర్ మాట్లాడుతూ బీటీ కళాశాలలో నిర్వహణా లోపాలు పోవాలంటే ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు. కళాశాల ఆస్తులను అమ్మగా వచ్చిన నిధులు దేనికి ఖర్చు పెట్టారో చెప్పాలని కోరారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపి సమావేశం నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టడంతో అర్ధాంతరంగా ఆపేశారు.
బీటీ కాలేజ్ ట్రస్టు సభ్యుల సమావేశానికి బ్రేక్
Published Tue, Sep 16 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement