jagannatha rao
-
‘బ్రాహ్మణ సంస్థ’ అధ్యక్షుడిగా జగన్నాథరావు
హైదరాబాద్: తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా పి.జగన్నాథరావు ఎన్నికయ్యారు. మంగళవారం విద్యానగర్‌లోని సంస్థ కార్యాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించినట్లు సంస్థ ఎన్నికల అధికారి వెల్దండ బల్వంతరావు వెల్లడించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్.రఘునాథరావు, ప్రధాన కార్యదర్శిగా కె.రామారావు, సంయుక్త కార్యదర్శిగా సి.రుక్మిణి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె.శ్యామ్, కోశాధికారిగా ఆర్.వెంకటేశ్వర్రావు, సంస్థ గౌరవాధ్యక్షుడిగా కె.సురేశ్ చందర్రావు ఎన్నికైనట్లు తెలిపారు. అలాగే నలుగురు కార్యవర్గ సభ్యులను, ఐదుగురు సలహాదారులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన కార్యవర్గం 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఆయన వెల్లడించారు. -
వర్ధన్నపేట మాజీ సమితి అధ్యక్షుడు జగన్నాథరావు మృతి
న్యూశాయంపేట/ వర్ధన్నపేట : వర్ధన్నపేట మాజీ సమితి అధ్యక్షుడు ఎల్లంకి జగన్నాథరావు (91) బుధవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు. వర్థన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో జన్మించిన ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసుకొని వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేశారు. కొంతకాలం తర్వాత రాజీనామా చేసి కాంట్రాక్టర్‌గా పనిచేశారు. అనంతరం ల్యాబర్తి గ్రామ స ర్పంచ్‌గా సుదీర్ఘకాలం పనిచేసి గ్రామాభివృద్ధికి కృషిచేశా రు. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పాల కమండలి సభ్యుడిగా కొనసాగారు. కాగా, జగన్నాధరావు 1981–86 వరకు వర్ధన్నపేట పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేసి ఉత్తమ సమితి అధ్యక్షుడిగా అవార్డు అందుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరారు. కొన్నాళ్లకు తల్లితెలంగాణ పార్టీలోనూ పనిచేశా రు. బియ్యాల జనార్దన్‌రావు మోమోరియల్ ట్రస్ట్ చైర్మన్‌గా, జనార్దన్‌రావు స్మారకంగా అనేక కార్యక్రమాలు ని ర్వహించారు. హన్మకొండలోని భారతి విద్యాభవన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన మృతిపై భారతి విద్యాభవన్ కరస్పాండెంట్ టి.బుచ్చిబాబు, సెక్రటరీ శ్రీదేవి సంతాపం తెలిపారు. జగన్నాథరావు సేవలు శ్లాఘనీయం : ఎర్రబెల్లి వరంగల్ : వర్ధన్నపేట మాజీ సమితి అధ్యక్షుడు ఎల్లంకి జగన్నాథరావు సేవలు శ్లాఘనీయమని పాలకుర్తి శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపా రు. బుధవారం ఎల్లంకి జగన్నాథరావు అకాల మరణంపై ఆయన కుటుంబ సభ్యులకు దయాకర్‌రావు ప్రగాఢ సం తాపాన్ని వ్యక్తం చేశారు. సమితి అధ్యక్షుడిగా జగన్నాథరావు వర్ధన్నపేటకు చేసిన సేవలు మరవలేమన్నారు. -
వీఐపీ రిపోర్టర్ : అన్నవరం ఈఓ జగన్నాథరావు
-
బీటీ కాలేజ్ ట్రస్టు సభ్యుల సమావేశానికి బ్రేక్
మదనపల్లెక్రైం: బీటీ కాలేజ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ట్రస్టు సభ్యుల సమావేశాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అధ్యాపకుల బోధనా విధానాన్ని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సభ్యులు సుధాకర్, జగన్నాథరావు, హరివెంకట్రమణ, సత్యనారాయణ, వైద్యనాథన్‌కు వివరిస్తుండగా విద్యార్థుల సమస్యలు చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. సభ్యులు పట్టించుకోకపోవడంతో ఆర్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహించారు. విద్యార్థుల సమక్షంలో జరగాల్సిన సమావేశాన్ని సీక్రెట్‌గా నిర్వహిస్తారా అంటూ నిరసన నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలు విన్న తర్వాతే సమావేశం నిర్వహించాలంటూ సభ్యులను ఘెరావ్ చేశారు. ఈ సమయంలో ప్రిన్సిపాల్ కిజర్‌మహ్మద్, అధ్యాపకులు, విద్యార్థులకు మద్య వాగ్వాదం నెలకొంది. ఆర్ఎస్ఎఫ్ నాయకుడు ఉత్తన్న మాట్లాడుతూ 2000వ సంవత్సరం నుంచి యూజీసీ నిధుల వినియోగంపై బహిరంగ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు రెడ్డిశేఖర్ మాట్లాడుతూ బీటీ కళాశాలలో నిర్వహణా లోపాలు పోవాలంటే ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు. కళాశాల ఆస్తులను అమ్మగా వచ్చిన నిధులు దేనికి ఖర్చు పెట్టారో చెప్పాలని కోరారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపి సమావేశం నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టడంతో అర్ధాంతరంగా ఆపేశారు.