సాక్షి, నల్లగొండ: నవంబర్ 2011లో జరిగిన రచ్చబండ-2, ఈ ఏడాది అక్టోబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో 53,292మందికి వివిధ రకాల పింఛ న్లు మంజూర య్యాయని డీఆర్‌డీఏ పీడీ సీహెచ్ సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. లబ్ధిదారులు మంజూరు పత్రాలను ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓల నుంచి తీసుకోవాలని చెప్పారు. వీరంతా వెంటనే బయోమెట్రిక్ విధానం ద్వారా వేలి ముద్రలు నమోదు చేసుకొని పింఛన్లు పొందాలని పేర్కొన్నారు.
వికలత్వ నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలు పొందాల్సిన వారు సంబంధిత మున్సిపల్, మండల అధికారులకు దర ఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వచ్చే నెల ఏడో తేదీ నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డులో తప్పులు దొర్లితే సవరణ కోసం తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రమాదవశాత్తు కుటుంబ యజమాని మరణిస్తే నిర్ణీత ధ్రువపత్రాలు తహసీల్దార్లకు అందజేయాలని సూచించారు.
53,292మందికి పింఛన్లు మంజూరు
Published Thu, Nov 21 2013 3:06 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement