భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక
ఆసియాలో దక్షిణ భాగాన భారత ఉపఖండం ఉంది. దీనికి ఉత్తరాన హిమాలయాలు, ఆగ్నేయంలో బంగాళాఖాతం, నైరుతిలో అరేబియా సముద్రం ఉన్నాయి. భౌగోళికంగా 8ని.4’. 37ని.6’ ఉత్తర అక్షాంశాలు, 68ని.7’ 97ని25’ తూర్పు రేఖాంశాల మధ్య ఉత్తరార్ధ, పూర్వార్ధ గోళంలో పాక్షికంగా విస్తరించి ఉంది. ఇది అక్షాంశాల పరంగా ఉత్తర దక్షిణాలుగా 30నిల పొడవు, రేఖాంశాల పరంగా కూడా తూర్పు, పడమరలుగా 30నిల డిగ్రీల వెడల్పులో వ్యాపించి ఉంది. 3.28మిలియన్ చ.కి.మీ విస్తీర్ణంతో ఉన్న భారతదేశం ప్రపంచంలోని పెద్ద దేశాల్లో ఏడోది.
ఉత్తర దక్షిణాలుగా సుమారు 3214 కి.మీ పొడవు, తూర్పు పడమరలుగా 2933 కి.మీ వెడల్పుతో భారతదేశం విస్తరించి ఉంది. దేశం ఉత్తర చివరన మంచుతో కప్పిన హిమాలయ పర్వతాలు, దక్షిణాన కన్యాకుమారి, పశ్చిమాన ఉప్పు నీటితో కూడిన చిత్తడి నేలలున్న రాణా ఆఫ్ కచ్, తూర్పున దట్టమైన అడవులు, అభేద్యమైన కొండలతో మయన్మార్, చైనా భారత దేశాల సరిహద్దు భాగాలుగా ఉన్నాయి. రేఖాంశాల పరంగా తూర్పు పడమరలుగా భారత దేశం 30నిల మేర విస్తరించి ఉన్నందున పశ్చిమాన గుజరాత్‌లోని ద్వారకా వద్ద కంటే, తూర్పు అంచున ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో మొదట సూర్యోదయం అవుతుంది.
దేశంలో వివిధ ప్రదేశాల స్థానిక కాలాల్లోని భేదాన్ని తొలగించడానికి 821/2ని తూర్పు రేఖాంశాన్ని కాల నిర్ణయానికి ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించారు. దీన్నే భారతదేశ ప్రామాణిక కాలంగా వ్యవహరిస్తున్నారు. గ్రీనిచ్ కాలానికి, భారత ప్రామాణిక కాలానికి 51/2ని గంటల వ్యత్యాసం ఉంది. భారతదేశానికి మొత్తం 15,200 కి.మీ. పొడవైన భూభాగపు సరిహద్దు, 6,100 కి.మీ. పొడవైన తీరరేఖ ఉన్నాయి.
భారతదేశం- సరిహద్దు దేశాలు, రాష్ట్రాలు
పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ భారత్‌కు సరిహద్దులో ఉన్న (పొరుగు) దేశాలు.
సముద్ర జలాల్లో అతి సమీపంలో ఉన్న పొరుగు దేశం శ్రీలంక. శ్రీలంక, భారతదేశాన్ని మన్నార్ సింధు శాఖ, పాక్ జలసంధి వేరుచేస్తున్నాయి.
రాజకీయ విభాగాలు
భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్... ఐదు పెద్ద రాష్ట్రాలు. గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం... ఐదు చిన్న రాష్ట్రాలు.
దీవులు: అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు కాగా, అతి చిన్న ప్రాంతం లక్షదీవులు. భారతదేశంలో మొత్తం 247 దీవులున్నాయి. వీటిలో 223 బంగాళాఖాతంలో, మిగిలినవి అరేబియా సముద్రం, మన్నార్ సింధు శాఖల్లో ఉన్నాయి.
అండమాన్ నికోబార్ దీవులు: ఇవి బంగాళాఖాతంలో 10ని-14ని ఉత్తర అక్షాంశాల మధ్య రెండు ప్రధాన సముదాయాలుగా ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల విస్తీర్ణం 8249చ.కి.మీ. అండమాన్ 6,408చ.కి.మీ, నికోబార్ దీవులు 1,841చ.కి.మీ. మేర వ్యాపించి ఉన్నాయి. అండమాన్, నికోబార్ సముదాయంలో కేవలం 36 దీవుల్లో మాత్రమే జనజీవనం ఉంది. 862 చ.కి.మీ. వైశాల్యంతో గ్రేట్ నికోబార్ అతి పెద్ద దీవి. ఇది భూమధ్యరేఖకు అతి దగ్గరగా ఉంది.
అరేబియా సముద్రంలోని దీవులన్నీ పగడపు ఉద్భవంతో కూడినవి. 32 చ.కి.మీ.ల విస్తీర్ణంతో లక్షదీవులు 8ని11ని ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నాయి. వీటికి దక్షిణంగా ఎనిమిది డిగ్రీ ఛానల్‌లో 4-5చ.కి.మీ. వైశాల్యంతో మినికాయ్ దీవి ఉంది. శిలా ఉపరితలమున్న పాంబన్ దీవి భారతదేశం, శ్రీలంక మధ్య ఉంది.
భారతదేశం నైసర్గిక స్వరూపాలు
భారతదేశాన్ని ప్రధానంగా 4 ప్రధాన భూ స్వరూపాలుగా విభజించారు.
హిమాలయాలు
గంగా సింధు మైదానం
ద్వీపకల్ప పీఠభూమి
తీర మైదానాలు
హిమాలయాలు: ఎల్లప్పుడూ మంచుతో కప్పి ఉండటం వల్ల వీటికి హిమాలయాలు అని పేరు వచ్చింది. వీటిని అతి తరుణ ముడుత లేదా నవీన ముడుత పర్వతాలు అంటారు. సంపీడన బలాల వల్ల టెథిస్ సముద్రం పైకి వచ్చి, ప్రస్తు తం ఉన్న హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.
రాష్ట్రాల ప్రకారం చూస్తే హిమాలయాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. నదుల ప్రకారం గమనిస్తే సింధు, బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరిం చాయి. హిమాలయాల పొడవు సుమారుగా 2,400 కి.మీ. వెడల్పు జమ్మూ కాశ్మీర్‌లో 500 కి.మీ., అరుణాచల్ ప్రదేశ్ 200 కి.మీ. హిమాలయాలు మొత్తం 5 లక్షల చ.కి.మీ. విస్తీర్ణాన్ని ఆక్రమించాయి. ఇవి వాయువ్యం నుంచి ఆగ్నేయ దిశగా వాలి ఉన్నాయి. వీటిని మూడు సమాంతర శ్రేణులుగా విభజించారు.
1. హిమాద్రి లేదా అత్యున్నత హిమాలయాలు
2. హిమాచల్ లేదా మధ్య లేదా నిమ్న హిమాలయాలు
3. శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు
i) హిమాద్రి: హిమాలయ పర్వత శ్రేణులన్నింటికంటే ఇది అత్యున్నతమైంది. దీని సరాసరి ఎత్తు 6,100మీ. ఈ పర్వత శ్రేణిలో ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరాలు ఉన్నాయి. ఎవరెస్ట్ ప్రపంచంలో కెల్లా పెద్ద శిఖరం. ఇది నేపాల్‌లో ఉంది. సిక్కింలో ఉన్న కాంచనగంగ భారత దేశంలో ఎత్తయిన శిఖరం.
మకాలు, ధవళగిరి, మనస్లూ, చోడీయు, నంగప్రభాత్, అన్నపూర్ణ, నందాదేవి, నామ్చ బర్వా మొదలైనవి హిమాద్రి శ్రేణిలోని కొన్ని ముఖ్య పర్వతాలు. ఇది గ్రానైట్, నీస్, షిఫ్ట్ వంటి రూపాంతర శిలలతో ఏర్పడింది.
ii) హిమాచల్: హిమాద్రికి దక్షిణంగా హిమాచల్ పర్వత శ్రేణి ఉంది. ఈ శ్రేణి ఎత్తు 1000 నుంచి 4,500 మీ. వెడల్పు 60 నుంచి 80 కి.మీ. కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ పర్వతశ్రేణి అతి పొడవైంది. హిమాద్రి, పీర్ పంజాల్ శ్రేణి మధ్య కాశ్మీరులోయ ఉంది. ఈ లోయలో ఉన్న సరస్సులు ఊలర్, ధాల్.
పీర్ పంజాల్ పర్వతశ్రేణి నైరుతి భాగాన్ని దౌల్ ధార్ శ్రేణి అంటారు. దీనిలో ప్రసిద్ధ వేసవి విడిది సిమ్లా. దీనిలోనే కులు, కాంగ్రా లోయ లున్నాయి. హిమాచల్ పర్వత శ్రేణిలో సిమ్లా ముస్సోరి, నైనిటాల్, ఛక్రాటా, రాణిఖేత్ వంటి వేసవి విశ్రాంతి స్థావరాలున్నాయి. ఈ పర్వత శ్రేణి సతతహరిత ఓక్, శృంగాకార అడవులతో నిండి ఉంది.
iii) శివాలిక్: ఇది హిమాచల్ శ్రేణికి దక్షిణంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించింది. వీటి ఎత్తు 600మీ. నుంచి 1500మీ. వరకు ఉంది. వెడల్పు హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధింగా 50 కి.మీ. అరుణాచల్‌ప్రదేశ్‌లో అతి తక్కువగా 15 కి.మీ. ఉంది. ఈ శ్రేణులను జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జమ్మూ కొండలు అని, అరుణాచల్ ప్రదేశ్‌లో మిష్మి కొండలు అని అంటారు. శివాలిక్ కొండల్లో ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులు పెరుగుతాయి.
2012 డీఎస్సీలో అడిగిన ప్రశ్నలు
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
నేను డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్‌కు ప్రిపేరవుతున్నాను. భూగోళ శాస్త్రంలోని ‘భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక’ అధ్యాయాన్ని ఎలా చదవాలి?
-పి.ఓబుల్ రెడ్డి, వైఎస్‌ఆర్ కడప జిల్లా
గత డీఎస్సీ పరీక్షలో ఈ అధ్యాయం నుంచి రెండు ప్రశ్నలు అడిగారు. ఈ సారి కూడా 2 నుంచి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాలు, వివిధ దేశాల సరిహద్దులను మ్యాప్ పాయింటింగ్ ద్వారా సాధన చేస్తే ఈ పాఠ్యాంశంలోని అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉత్తర ప్రాంత హిమాలయాలను అధ్యయనం చేసేటప్పుడు, వాటి దిక్కులను ఆధారంగా చేసుకుని చదవాలి. భారతదేశ భూ స్వరూపాలు, నదీ ప్రాంతాలు, ఏర్పాటైన రాష్ట్రాలు, ప్రాంతాలను కలిపి చదవాలి. అట్లాస్‌ను దగ్గర పెట్టుకొని భారతదేశ భౌతిక అమరిక, పర్వతాల క్రమం, రాష్ట్రాల ఉనికిపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలను సులువుగా గుర్తించవచ్చు.
1. చిలుకా, కొల్లేరు సరస్సుల ద్వారా ప్రవహించే నది?
1) కృష్ణా 2) గోదావరి
3) బ్రాహ్మణి 4) మహానది
2. డెహ్రాడూన్ ఏ శ్రేణుల మధ్య ఉంది?
1) హిమాచల్, హిమాద్రి
2) శివాలిక్, హిమాచల్
3) {sాన్‌స హిమాలయ మండలం, హిమాచల్ వరుసల్లో
4) హిమాద్రి, ట్రాన్‌స హిమాలయ మండలం
3. ఏ నగరాల మధ్య ప్రయాణించే విమానం ఆంధ్రప్రదేశ్ గగనతలంపై ఎగురుతుంది?
1) భువనేశ్వర్, ఢిల్లీ
2) ముంబై, వారణాసి
3) చెన్నై, పుణే 4) కోజికోడ్, చెన్నై
4. రేఖాంశాల మధ్య భారతదేశ విస్తృతిని ఏ ప్రాంతాల మధ్య కొలిచారు?
1) గుజరాత్ నుంచి మిజోరాం వరకు
2) రాజస్థాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు
3) రాణా ఆఫ్ కచ్ నుంచి మిజోరాం వరకుట
4) రాణా ఆఫ్ కచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు
సమాధానాలు: 1) 2; 2) 2; 3) 4; 4) 4.
హిమాలయాల్లో కైబర్.. బొలాన్ అనేవి?
Published Thu, Sep 11 2014 10:53 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement