dsc-2014
-
డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్ విడుదల
విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. 28న నియామకపత్రాల జారీ, 29న వెబ్ కౌన్సిలింగ్, జూన్ 1న పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. మొత్తం 10,313 పోస్టులకు ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు గంటా తెలిపారు. -
డీఎస్సీ అభ్యర్థులపై తెలుగు తమ్ముళ్ల దాడి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ దౌర్జన్యాలు ఆగడం లేదు. అధికార పార్టీ అండ చూసుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. డీఎస్సీకి సంబంధించి లిస్టును విడుదల చేయాలని అడిగినందుకు.. డీఎస్సీ అభ్యర్థులపై తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో వంద వసంతాలు పూర్తి చేసుకున్న నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం నరసరావుపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో డీఎస్సీ-2014 లిస్ట్‌ను విడుదల చేయాలని డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో గందరగోళం చోటుచేసుకుంది. దాంతో వారిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో డీఎస్సీ అభ్యర్థి తలకు గాయమైంది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
ఏపీలో డీఎస్సీ, తొలిరోజు ఎస్జీటీ పరీక్ష
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి డీఎస్సీ-2014 పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష (డీఎస్సీ)కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు జరిగే సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పరీక్షకు 57,722 మంది హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,560 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 9వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్జీటీ ఖాళీల భర్తీకి రాత పరీక్ష జరగనుంది. ఇందుకోసం 364 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి పరీక్ష జరగనుంది. 10వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాంగ్వేజ్ పండిట్స్ పరీక్ష, ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాయామ ఉపాధ్యాయుల పరీక్ష జరుగుతుంది. . 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1-15 గంటల వరకు స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్) పరీక్ష నిర్వహించనున్నారు. -
పూర్తిగా సౌరశక్తితో విద్యుదీకరించిన గ్రామం?
సోషల్ - కంటెంట్ (ఎస్ఏ) నీటి సమస్యను తగ్గించి, నీటిపారుదల వ్యవస్థను పటిష్ట పరచడాన్ని ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ముఖ్య ఉద్దేశాల్లో ఒకటిగా చేర్చారు. ఈ ప్రణాళిక ప్రారంభం నాటికే దేశంలో ఉన్న 158 భారీ; 226 మధ్య తరహా; 95 పొడిగించే, పునరుద్ధరించే, ఆధునికీకరించే పథకాలను ఈ ప్రణాళికా కాలంలో కొనసాగించారు. ఉత్తర భారత దేశంలో అత్యంత వాలు ఉన్న పర్వతీయ స్థలాకృతి కృత్రిమ నీటిపారుదలకు అనుకూలంగా లేదు. నీటిపారుదల, విద్యుచ్ఛక్తి భారతదేశంలో ప్రణాళికా కాలానికి ముందు 22.6 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణానికి నీటిపారుదల సామర్థ్యం ఉంది. ఇది 1993-94 సంవత్సరాంతానికి 85 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. దీంట్లో 31.8 మిలియన్ హెక్టార్లు భారీ, మధ్యతరహా; 53.2 మిలియన్ హెక్టార్లు చిన్నతరహా పథకాల కింద ఉంది. దీంట్లో 76.3 మిలియన్ హెక్టార్ల భూమి మాత్రమే నీటిపారుదలను వినియోగించుకుంటోంది. 1974-75 నుంచి ఆయకట్టు ప్రాంత అభివృద్ధిని చేపట్టారు. నీటిపారుదల ఉత్పత్తి, వినియోగాల మధ్య అంతరాన్ని పూరించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒక మాదిరి నుంచి ఎక్కువ నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రాలు బీహార్, తమిళనాడు, జమ్మూ-కాశ్మీర్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక మాదిరి నుంచి ఎక్కువ నీటిపారుదల సాంద్రత ఉంది. ఈ రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయం నీటిపారుదల కింద సాగయ్యేవిధంగా మార్పు దశలో ఉంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో అతి స్వల్ప (్ఱ20%) నీటి పారుదల సాంద్రత ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా చెరువులు, జలాశయాల నుంచి నీటిని మళ్లించే పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల లాంటి ఉపరితల జల పథకాలున్నాయి. నీటిపారుదల వసతుల ప్రగతి భారతదేశం వ్యవసాయిక దేశమైనందువల్ల సమర్థమైన నీటిపారుదలతో కూడిన పంటల వ్యవస్థ ఉన్నప్పుడే దేశంలోని అధిక జనాభా, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చగలుగుతాం. పంచవర్ష ప్రణాళికల ప్రధాన ఉద్దేశం ఇదే. దేశంలోని నీటిపారుదల అభివృద్ధికి అనేక భారీ, మధ్యతరహా, చిన్ననీటి పారుదల పథకాలను చేపట్టారు. 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్నవి భారీ నీటి పారుదల పథకాలు. వీటిని నదులపై నిర్మిస్తారు. 2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టు ఉండేవి మధ్యతరహా నీటి పారుదల పథకాలు. వీటిని నదులు, ఉపనదులపై నిర్మిస్తారు. 2,000 హెక్టార్లలోపు ఆయకట్టు ఉండేవి చిన్న తరహా పథకాలు. భూగర్భజల పథకాలు, ఉపరితల జల పథకాలు ఈ కోవలోకి వస్తాయి. సాధారణ బావులు, ఎక్కువ లోతులేని గొట్టపు బావులు, పంపుసెట్ల సాయంతో నీటిని పైకి తోడే లోతైన గొట్టపుబావులు భూగర్భ జల పథకాల్లోకి వస్తాయి. జల విద్యుచ్ఛక్తి పథకాలు జలవిద్యుత్ శక్తి ఆధునిక కాలంలో ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. స్వాతంత్య్రానంతరం దీని అభివృద్ధికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. దీన్నే తెల్లబొగ్గు అని కూడా అంటారు. ఇది ఎంతగా ఉపయో గించినా తరగని శక్తి. ఆనకట్టలపై నుంచి వేగంగా జాలువారే నీటి శక్తిని టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ శక్తిగా మారుస్తారు. దీన్ని ఒకసారి అభివృద్ధి పరిస్తే శతాబ్దాలపాటు జలవిద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయవచ్చు. జలవిద్యుచ్ఛక్తిని కొన్ని అనుకూల పరి స్థితుల్లోనే ఉత్పత్తి చేయగలుగుతాం. అవి: వేసవిలో కూడా నిరాటంకంగా నీటిని సరఫరా చేయగలిగే నది లేదా పెద్ద జలాశయం ఉండాలి. ఎత్తు నుంచి నీరు జాలువారడానికి వీలైన నిమ్నోన్నతం ఉండాలి. నదీజలం ఘనీభవించడానికి వీలులేని కనిష్ఠ శీతోష్ణస్థితి అవసరం. జీవనదులు లేని చోట జలాశయాల్లో ఎక్కువ నీటిని నిల్వ చేయడానికి వీలుగా అధిక వర్షపాతం ఉండాలి. భారతదేశంలోని ముఖ్య బహుళార్థ సాధక పథకాలు భాక్రానంగల్ పథకం: హిమాచల్ ప్రదేశ్‌లో సట్లేజ్ నదిపై భాక్రా, నంగల్ అనే ప్రదేశాల్లో రెండు ఆనకట్టలు నిర్మించారు. ఇది 1204 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దేశంలోనే అతి పెద్ద పథకం. ఈ పథకం ద్వారా 11,000 కి.మీ పొడవైన ప్రధాన కాలువలు, 3,400 కి.మీ ఉపకాలువలతో 14.6 లక్షల హెక్టార్ల భూమికి నీటి వసతిని కల్పిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటి పారు దల, జలవిద్యుచ్ఛక్తి. దీని ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. బియాస్ పథకం: ఇది బియాస్ జలాలను సట్లేజ్ జలాలతో కలుపుతుంది. ఇది రెండు భాగాలుగా ఉంది. ఎ) బియాస్- సట్లేజ్ల కలయిక బి) బియాస్ నదిపై పాంగ్ వద్ద నిర్మించిన ఆనకట్ట. ఇది 1020 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పథకం ద్వారా 17 లక్షల హెక్టార్ల భూమికి నీటి వసతి కల్పిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం నీటి పారుదల, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తి. ఈ పథకం ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. దామోదర లోయ పథకం: జార్ఖండ్‌లోని దామోదర్ నది ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు. వీటి ద్వారా 1181 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 4.5 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, వరదల నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి, నౌకాయానం. దీని ద్వారా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లబ్ధి పొందుతున్నాయి. హీరాకుడ్ పథకం: ఒడిశాలో సంబల్పూర్ సమీపంలో మహానదిపై నిర్మించారు. ప్రపంచంలో పొడవైన ఆనకట్టల్లో ఇది ఒకటి. దీని ద్వారా 280 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 2.5 లక్షల హెక్టార్లు భూమికి నీటిపారుదల సౌకర్యం అందిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తి, వరదల నియంత్రణ. ఒడిశా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతోంది.నాగార్జున సాగర్ పథకం: దీన్ని కృష్ణానదిపై నిర్మించారు. భారీ నీటిపారుదల పథకాల్లో ఇది ఒకటి. దీని ద్వారా 110 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. 8.3 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుదుత్పాదన. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తుంగభద్రా పథకం: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మల్లాపూర్ వద్ద తుంగభద్రా నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 126 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 3.5 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, విద్యుత్ ఉత్పాదన. దీని ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. కోసీ పథకం: బీహార్- నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో కోసీ నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 386 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 5.66 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి అందిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటిపారుదల, విద్యుత్ ఉత్పాదన. ఈ పథకం ద్వారా బీహార్, నేపాల్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి. చంబల్ పథకం: ఇది చంబల్ నదిపై నిర్మించిన ఆనకట్ట. దీంట్లో మూడు ఆనకట్టలున్నాయి. దీనివల్ల 386 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ పథకం వల్ల 5.66 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కలుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుదుత్పాదన. ఈ పథకం ద్వారా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి. గండక్ పథకం: బీహార్‌లోని వాల్మీకి నగర్ వద్ద గండక్ నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 14.88 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ ప్రయోజనం పొందుతున్నాయి. రామ్ గంగా పథకం: ఉత్తరప్రదేశ్‌లో రామ్ గంగా నదిపై నిర్మించారు. దీని ద్వారా 198 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ పథకం వల్ల 5.75 లక్షల హెక్టార్ల భూమికి నీటిపారుదల వసతి కల్పిస్తున్నారు. దీని ద్వారా ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుత్ ఉత్పాదన, వరదల నియంత్రణ. ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. -
‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’
జానపదం అంటే గ్రామీణ ప్రాంతం అని అర్థం. అమరకోశం, వ్యాసభారతంలో దీని ప్రస్తావన ఉంది. ఎర్రన అరణ్యశేషంలో గ్రామీణులు అనే అర్థంతో ‘జానపదులు’ పదాన్ని ప్రయోగించాడు. జానపద విజ్ఞానం అనేది ఫోక్లోర్ అనే ఆంగ్ల పదానికి అనువాదం. 1846లో డబ్ల్యు.జె. థామస్ అనే ఆంగ్ల జానపద విజ్ఞాన శాస్త్రవేత్త ఫోక్లోర్ పదాన్ని రూపొందించాడు. జానపద సాహిత్యం జానపద కళలు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి, జానపద సాహిత్యం మొదలైన వాటన్నింటిని కలిపి జానపద విజ్ఞానం అంటారు. జానపద సాహి త్యం దీనిలో ఒక భాగం. జానపదులంటే అనాగరికులు, మొరటు వారు, కర్షకులు అనే అభిప్రాయం ఉండేది. జానపదులు నిరక్షరాస్యులైనప్పటికీ ప్రస్తుతం వారి జీవిత అనుభవసారాన్ని జానపద విజ్ఞానంగా, పరిశోధనాత్మకంగా అధ్యయనం చేస్తున్నారు. జానపదుల ప్రదర్శన కళల్ని పోషించి పరిరక్షిస్తున్నారు. జానపదుల భాష, సంప్రదాయం, సంస్కృతీవిశేషాలను నిశితంగా పరిశోధిస్తున్నారు. ఎం. డార్సన్ అనే జానపద విజ్ఞాన పరిశోధకుడు ‘జానపద విజ్ఞానం- జానపద జీవితం’ అనే గ్రంథంలో ‘ ఇది గత కాలానికి సంబంధించింది కాదని, వర్తమాన కాలానికి కూడా ప్రతిధ్వని’ అని అన్నారు. నిత్యం చైతన్య స్ఫూర్తి ఉన్న జానపద విజ్ఞానం ఆధునిక జీవితానికి ప్రేరణ కలిగిస్తుంది. బ్రిటిషర్ల పాలనలో మద్రాసులో సర్వే యర్ జనరల్‌గా ఉన్న కల్నల్ మెకంజీ (1754- 1821), కావలి బొర్రయ్య, వెంకటరామస్వామి, లక్ష్మయ్య సహకారంతో కైఫీయత్తులను రాయిం చి సంకలనం చేయించారు. ఆంధ్రదేశంలో స్థానిక చరిత్రలు, స్థలపురాణ చరిత్రలు, గ్రామ చరిత్రలకు సంబంధించిన కైఫీయత్తులు తెలు గువారి జానపద సంస్కృతికి దర్పణాలు. భారతదేశానికి 1874లో ఉద్యోగరీత్యా వచ్చిన జె.ఎ.బోయల్ జానపద సాహిత్యం పట్ల అభిమానంతో దక్షిణ భారతదేశానికి సంబం ధించిన ఆరు జానపద గేయ గాథలను సేకరించి ‘ఇండియన్ ఆంటిక్విటీ’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. దీనిలో సర్వాయి పాపని కథ ప్రసిద్ధి. జానపద గేయగాథలను సేకరించిన తొలి పాశ్చాత్యుడు బోయల్. సి.పి.బ్రౌన్ జానపద భాషలో గణనీయ కృషి చేశారు. బొబ్బిలి కథ, కుమార రాముని కథ, పల్నాటివీరచరిత్ర, కాటమరాజు కథ, కామమ్మ కథ వంటి ప్రసిద్ధ గాథలు సేకరించి ప్రచురించారు. ఆర్.ఎస్.బాగ్స ‘ఫోక్లోర్ మైథాలజీ అండ్ లెజెండ్’ అనే ప్రామాణిక నిఘంటువులో జానపద విజ్ఞానాన్ని సూక్ష్మదృష్టితో వర్గీకరించారు. ఛార్లెస్ ఇ.గోవర్ ఫోక్సాంగ్స ఆఫ్ సదరన్ ఇండియా (1871) అనే గ్రంథాన్ని ప్రచురించా రు. అందులో వేమన పద్యాలను జానపద గే యాల కింద ఉదహరించారు. ఈ విషయాన్ని తర్వాత జె.ఎ. బోయల్ (1874) ఖండించారు. స్టీ థాంప్సన్ అనే పాశ్చాత్యుడు ‘‘ది టైమ్స్ ఆఫ్ ది ఫోక్టేల్’’ అనే గ్రంథం ద్వారా జానపద కథా మూలాలను కథానిర్మాణ పద్ధతులను వివరించారు. జానపద సాహితీ వికాసం పాశ్చాత్య భాషావేత్తల గణనీయమైన కృషి తెలుగువారికి మార్గదర్శకమైంది. 20వ శతాబ్ది పూర్వార్ధంలో నందిరాజు చలపతిరావు స్త్రీల పాటలు సేకరించి 1903లో ప్రచురించారు. 1910-20 మధ్యకాలంలో అప్పగింతల పాటలు, అడవి గోవింద నామకీర్తనలు, శ్రావణమంగళవారం పాటలు వంటి స్త్రీల ఆధ్యాత్మిక, వైవాహిక సందర్భాలకు చెందిన పాటలతో పాటు ‘చల్ మోహన రంగ’, సిరిసిరిమువ్వ, వంటి ఉత్తేజపూరితమైన పాటలను కూడా ప్రచురించారు. 20వ శతాబ్ది ఉత్తరార్ధంలో వేటూరి ప్రభా కరశాస్త్రి, చిలుకూరి నారాయణరావు వంటి పండితులు జానపద సాహిత్యానికి విశేష కృషి చేశారు. చిలుకూరి నారాయణరావు లక్షకుపైగా సామెతలు సేకరించి ప్రచురించారు. నేదునూరి గంగాధరం, మిన్నేరు, మున్నేరు, పన్నీరు, సెల యేరు, పసిడి పలుకులు, వ్యవసాయ సామె తలు, ఆటపాటలతో ‘జానపద వాఙ్మయ వ్యాసావళి’ని ప్రచురించారు. కృష్ణశ్రీ ‘స్త్రీల రామాయణపు పాటలు’,‘స్త్రీల పౌరాణిక పాట లు’, ‘పల్లె పదాలు’ వంటి గ్రంథాలు రచించా రు. హరి ఆదిశేషుడు ‘జానపదగేయ వాఙ్మ యం’ అనే ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. దీనికిగానూ ఆయనకు మద్రాసు తెలుగు భాషాసమితి బహుమతి లభించింది. జానపద సాహిత్యం వర్గీకరణ జానపద విజ్ఞానంలో ప్రధానాంశమైన సాహిత్యంలో వస్తు సంస్కృతి, సాంఘిక ఆచారాలు, ప్రదర్శన కళలు, భాషావిశేషాలు ప్రతిబింబిస్తాయి. సాహిత్యంలో ప్రధానంగా గేయశాఖ, వచనశాఖ, దృశ్యశాఖ ముఖ్యమైనవి. జానపద గేయాలను 1. కథాసహితాలు 2. కథా రహితాలు అని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. కథాసహిత గేయాల్లో ప్రధానంగా శ్రామిక, స్త్రీల, వృత్తి సంబంధ గేయాలు ఉంటా యి. శ్రామికుల అలసటను, శారీరక శ్రమను పోగొట్టి ఉత్సాహాన్ని పెంపొందించేవి శ్రామిక గేయాలు. స్త్రీల పాటల్లో వ్రత, పౌరాణిక కథలు ఉంటాయి. వృత్తిసంబంధ గేయాల్లో వీరగాథలు, అద్భుత గాథలు, చారిత్రక గాథలు, మతసంబంధ గాథలు ఉంటాయి. జన జీవనంలో జానపద గేయం అన్ని కోణాలను సృశిస్తుంది.కథా రహిత గేయాల్లో శ్రామిక, పారమార్థిక కౌటుంబిక గేయాలు ప్రధానమైనవి. జానపద కళా రూపాలు జానపద కళా రూపాలు దృశ్యశాఖకు సంబంధించినవి. వీటిలో యక్షగానం, తోలుబొమ్మలాట, బుర్రకథ, పులి వేషాలు, గొరవ నృత్యం, ఒగ్గుకథ, కోలాటం వంటివి ప్రసిద్దమైనవి. మౌఖికం, అనామక కర్తృత్వం, జానపద సాహిత్య లక్షణం వచన జానపద సాహిత్యంలో సామెతలు, పొడుపు కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆధునిక సమాజం - జానపద సాహిత్య ప్రయోజనం ఎంతో వైజ్ఞానిక ప్రగతిని సాధించిన ఆధునిక సమాజంలో జానపద సాహిత్యం కొన్ని సామాజిక సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తోంది. ప్రత్యేకించి.. 1. కుటుంబ నియంత్రణ 2. అక్షరాస్యత 3. పొదుపు ఉద్యమం 4. స్త్రీ విద్య 5. పిల్లల పెంపకం 6. అవినీతి నిర్మూలన 7. ఆరోగ్య కార్యక్రమాలు 8. ఆర్థిక అసమానతలు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించి చైతన్యవంతుల్ని చేయడానికి జానపద సాహిత్యం తోడ్పడుతుంది. ప్రసిద్ధ జానపద గ్రంథాలు- రచయితలు ఎంకిపాటలు - నండూరి సుబ్బారావు బంగారుమామ పాటలు - కొనకళ్ల వెంకటరత్నం తెలుగు జానపద గేయ సాహిత్యం(తొలి సిద్ధాంత గ్రంథం) - ఆచార్య బి.రామరాజు యక్షగాన వాఙ్మయ చరిత్రం - ఆచార్య ఎస్.వి. జోగారావు తెలుగు హరికథా సర్వస్వం , జానపద కళాసంపద, తెలుగులో కొత్త వెలుగులు - ఆచార్య తూమాటి దొణప్ప తెలుగు జానపద గేయ గాథలు - ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగు వీర గాథా కవిత్వం, రేనాటి సూర్య చంద్రులు - ఆచార్య తంగిరాల సుబ్బారావు తెలుగు-కన్నడ జానపద గేయాల తుల నాత్మక పరిశీలన, జానపద సాహిత్య స్వరూపం,ఆంధ్రుల జానపద విజ్ఞానం - డాక్టర్ ఆర్.వి.ఎస్. సుందరం అనంతపురం జిల్లా స్త్రీల పాటలు, జానపద విజ్ఞాన వ్యాసావళి, జానపదుల తిట్లు -డాక్టర్ జి.ఎస్.మోహన్ {స్తీల రామాయణ పాటలు, పల్లెపదాలు ఊర్మిళాదేవి నిద్ర, - కృష్ణశ్రీ పల్లెపదాల్లో ప్రజా జీవనం - డాక్టర్ యెల్దండ రఘుమారెడ్డి జానపద పురాగాథలు - డాక్టర్ రావి ప్రేమలత ముద్రిత జానపద గేయాల్లో నిఘంటువు కెక్కని పదాలు- డాక్టర్ నాయని కోటేశ్వరి తెలంగాణ శ్రామిక గేయాలు -డాక్టర్ జి. లింగారెడ్డి స్తీల గేయాలు - సంప్రదాయాలు - డాక్టర్ సి.హెచ్. వసుంధరా రెడ్డి తెలుగు పొడుపు కథలు - డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి జానపద కళారూపాలు - డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గిరిజన గీతాలు - డాక్టర్ ఫిరాట్ల శివరామకృష్ణమూర్తి తోలుబొమ్మలాట - మొదలి నాగభూషణ శర్మ ప్రసిద్ధ జానపద గేయాలు శృంగారరస ప్రధానాలు: చెల్లి చంద్రమ్మా, ఊర్మిళాదేవి నిద్ర, చల్‌మోహనరంగ కరుణరస ప్రధానాలు: సారంగధర కథ, కామమ్మ కథ అద్భుత రస ప్రధానాలు బాలనాగమ్మ కథ, కాంభోజరాజు కథ, బాలవర్థిరాజు కథ, మదన కామరాజు కథ. హాస్య ప్రధానాలు: గంగా-గౌరీ సంవాదం, గౌరీ-లక్ష్మీసంవాదం. చారిత్రక ప్రాధాన్యమున్న కథలు దేశింగు రాజు కథ, సర్దార్ పాపన్న కథ, చిన్నపరెడ్డి కథ. మాదిరి ప్రశ్నలు 1. జానపద విజ్ఞానం అంటే? 1) జానపద సంస్కృతి 2) జానపద ప్రదర్శన కళలు 3) జానపద విశ్వాసం 4) పైవన్నీ 2. పొడుపు కథలు జానపద సాహిత్యంలో ఏ విభాగానికి సంబంధించినవి? 1) గేయ 2) దృశ్య 3) వచన 4) ప్రదర్శన 3. ‘రేనాటి సూర్యచంద్రులు’ ఏ శాఖకు చెందింది? 1) పౌరాణిక 2) సాంఘిక 3) ఇతిహాస 4) చారిత్రక 4. శారదకాండ్రు ఏ ప్రాంతంలో ఉన్నారు? 1) రాయలసీమ 2) తెలంగాణ 3) కోస్తాంధ్ర 4) ఉత్తరాంథ్ర 5. తోలుబొమ్మలాట జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందింది? 1) మౌఖిక జానపద విజ్ఞానం 2) వస్తు సంస్కృతి 3) జానపద కళలు 4) జానపద ఆచారాలు 6. జానపద గేయాల ప్రచురణకు తెలుగులో ఎవరు ఆద్యుడు? 1) మెకంజీ 2) థామ్స్ 3) సి.పి.బ్రౌన్ 4) జె.ఎ.బోయల్ 7. వీరగాథలపై పరిశోధన చేసినవారు? 1) డాక్టర్ యెల్దండ రఘుమారెడ్డి 2) డాక్టర్ జి. లింగారెడ్డి 3) డాక్టర్ తంగిరాల సుబ్బారావు 4) డాక్టర్ జి.ఎస్. మోహన్ 8. తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన మహిళా పరిశోధకురాలు? 1) డాక్టర్ రావి ప్రేమలత 2) డాక్టర్ నాయని కృష్ణకుమారి 3) డాక్టర్ పి. కుసుమ కుమారి 4) డాక్టర్ డి.లలిత కుమారి 9. పొడుపు కథలకు పర్యాయపదం? 1) విడుపు కథ 2) ప్రహేళిక 3) మారు కత 4) పైవన్నీ 10. ‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’ అనే సామెతలో ఆమెత పదానికి అర్థం? 1) మేత 2) నగ 3) విందు 4) స్త్రీ డీఎస్సీ(ఎస్ఏ, ఎల్పీ) 2012లో అడిగిన ప్రశ్నలు 1. జానపద సాహిత్యానికి ప్రధాన లక్షణాల్లో ఒకటి? 1) అనామిక లేదా సామూహిక కర్తృత్వం 2) నిర్ణీత రచనా కాలం 3) కృతకశైలి 4) లిఖిత రచన 2. అప్పగింతలు, అలక పాటలు ఈ శాఖకు చెందినవి? 1) శ్రామిక గేయాలు 2) పారమార్థిక గేయాలు 3) బాల గేయాలు 4) స్త్రీల పాటలు 3. జానపదోచ్ఛారణలో ఎలా జరుగుతుంది? 1) ఒత్తులు నిలుస్తాయి 2) పదాదివకారం నిలుస్తుంది 3) మార్ధన్య దంతమాలీయభేదం నిలుస్తుంది 4) చకారం సకారం అవుతుంది 4. డాక్టర్ బిరుదురాజు రామరాజు దేనికి ప్రసిద్ధులు? 1) కార్యపరిష్కారణ శాస్త్రం రాసినందుకు 2) విశ్వవిద్యాలయ ఆచార్యులైనందుకు 3) జానపద సాహిత్యంపై మొదట పరిశోధన చేసినందుకు 4) జానపద సాహిత్యాన్ని సేకరించినందుకు 5. జానపద గేయాల్లో రామాయణ పాటలు ఏ శాఖకు చెందినవి? 1) శృంగార గేయాలు 2) శ్రామిక గేయాలు 3) పౌరాణిక గేయాలు 4) చారిత్రక గేయాలు సమాధానాలు 1) 1; 2) 4; 3) 4; 4) 3; 5) 3. -
‘దాని రహస్యం కవికే తెలుసు’
ఆధునిక సాహిత్య ఉద్యమాలు 2012 డీఎస్సీ (ఎస్.ఎ., ఎస్జీటీ), ఎల్పీసెట్లో అడిగిన ప్రశ్నలు 1. గుర్రం జాషువా ఏ కవితో కలిసి జంట కవి అవుదామనుకున్నాడు? 1) దీపాల పిచ్చయ్యశాస్త్రి 2) ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 3) పిలకాగణపతిశాస్త్రి 4) దివాకర్ల తిరుపతి శాస్త్రి 2. విజయశ్రీ కావ్యంలో ఇతివృత్తం? 1) రామాయణ సంబంధమైంది 2) భారత సంబంధమైంది 3) భాగవత సంబంధమైంది 4) ఉపనిషత్ సంబంధమైంది 3. హెర్మిట్కు అనువాదమైన రాయప్రోలు వా రి రచన? 1) తృణకంకణం 2) స్నేహలత 3) లలిత 4) అనుమతి 4. ‘‘ధారుణీపతిపాలన దండమెపుడ నీ హలంబు కన్నను ప్రార్థనీయమగునె’’ అని కర్షకుని కీర్తించిన కవి? 1) తుమ్మల సీతారామమూర్తి 2) దువ్వూరి రామిరెడ్డి 3) జంధ్యాల పాపయ్యశాస్త్రి 4) కట్టమంచి రామలింగారెడ్డి 5. ‘‘తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది {Oyెనేజీ స్కీములేక డేంజరుగా మారుతోంది’’ అన్న కవి? 1) చెరబండరాజు 2) సి. విజయలక్ష్మి 3) ముకురాల రామారెడ్డి 4) గజ్జెల మల్లారెడ్డి 6. కందుకూరి వీరేశలింగం ‘సత్యరాజా పూర్వ దేశయాత్రలు’కు ఆధారమైన ఆంగ్ల రచన? 1) డాన్ క్విక్జోట్ 2) గలివర్స ట్రావెల్స్ 3) పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ 4) కాంటర్బరీ టేల్స్ 7. ఆధునిక కవిత్వంలో రాయప్రోలు సుబ్బా రావు లేవనెత్తిన ప్రణయ సిద్ధాంతం? 1) కుల పాలికా ప్రణయం 2) కరుణవిప్రలంభం 3) అమలిన శృంగారం 4) విప్రలంభ శృంగారం 8. ‘5, 3, 2 ఆముక్త మాల్యద ఆటవెలది ద్విపదకత్తగారు’ లోని ధోరణి? 1) వాస్తవిక ధోరణం 2) అధివాస్తవిక ధోరణి 3) క్యూబిజమ్ 4) గతితార్కికవాద ధోరణి 9. ‘ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్త రక్తాన్ని ఇంజెక్టు చేయడానికొస్తున్న వీరి గుండెల్లోంచి ధైర్యంగా స్థయిర్యంగా దూసు కొచ్చిన కేకలు’ ఇది ఏ రకమైంది? 1) పైగంబర కవిత 2) అభ్యుదయ కవిత 3) దిగంబర కవిత 4) అకవిత 10. జానపద సాహిత్య ప్రధాన లక్షణాల్లో ఒకటి? 1) అనామక లేదా సామూహిక కర్తృత్వం 2) నిర్ణీత రచనా కాలం 3) కృతక శైలి 4) లిఖిత రచన 11. ‘అప్పగింతలు పాటలు’, ‘అలక పాటలు’ ఏ శాఖకు చెందిన గేయాలు? 1) శ్రామిక గేయాలు 2) పారమార్థిక గేయాలు 3) బాల గేయాలు 4) స్త్రీల పాటలు 12. కవి ఒక అవిస్పష్ట వాంఛాంకురం ఒక అంత ర్నిగూఢ తాపం, ఒక చిన్న కావ్యంలో ఊదబడినచో అది? 1) విప్లవ కవిత్వం 2) అభ్యుదయ కవిత్వం 3) ఆధ్యాత్మిక కవిత్వం 4) భావ కవిత్వం 13. ‘కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు. కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు’ అన్న కవి? 1) బాలగంగాధర తిలక్ 2) దాశరథి 3) అనిసెట్టి సుబ్బారావు 4) బెల్లంకొండ రాందాసు 14. ‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, చివరకు వంటింటి గిన్నెల న్నిటి పైనా మానాన్నపేరే’ అనే కవిత - 1) మైనారిటీ వాత కవిత 2) స్త్రీవాద కవిత 3) దళితవాద కవిత 4) భావ కవిత 15. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ‘ఊహా ప్రేయసి’? 1) శశికళ 2) వత్సల 3) మధరప్రమీల 4) ఊర్వశి 16. ‘ఎలాంటి సందర్భంలోనూ మీరు నిషిద్ధాక్షరి చెయ్యడం పెట్టుకోవద్దు’ అని శ్రీపాదవారికి సలహా ఇచ్చినవారు? 1) పురాణపండ సుబ్బయ్యశాస్త్రి 2) వెంకటరాయశాస్త్రి 3) పేర పేరయ్య శాస్త్త్రి 4) రామకృష్ణశాస్త్త్రి 17. అనుభూతివాదంలోని ముఖ్య లక్షణం? 1) కళ కళ కోసం 2) కళ సామాజిక ప్రయోజనం కోసం 3) నైతిక విలువలను ప్రచారం చేయడం 4) ఆధ్యాత్మిక సందేశం ఇవ్వడం 18. ‘వేదాంతులు జీవితాన్నీ, ప్రకృతినీ అవగా హన చేసుకున్నారు. మేం లోకాన్ని, జీవి తాన్ని ప్రకృతిని కూడా మారుస్తాం’ అన్న శ్రీరంగం నారాయణ బాబు మాటలు దేనికి ప్రాతినిధ్యం వహిస్తాయి? 1) దిగంబర కవిత 2) అభ్యుదయ కవిత 3) భావ కవిత 4) విప్లవ కవిత 19. జానపదోచ్ఛారణలో కిందివిధంగా ఉంటుంది? 1) ఒత్తులు నిలుస్తాయి 2) పదాదివకారం నిలుస్తుంది 3) మూర్దన్య దంత మాలీయభేద నిలుస్తుంది 4) చకారం సకారం అవుతుంది 20. ‘కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు కృతిని జెందువాడు మృతుడుగాడు’ అన్న కవి? 1) దాశరథి 2) కృష్ణశాస్త్రి 3) జాషువా 4) కరుణశ్రీ 21. ‘నా అక్షరాలు కన్నీటి జడుల్లో తడిసిన దయాపారావతాలు’ అన్న కవి? 1) దాశరథి కృష్ణమాచార్యులు 2) జంధ్యాల పాపయ్యశాస్త్రి 3) దేవరకొండ బాలగంగాధర తిలక్ 4) దేవులపల్లి కృష్ణశాస్త్రి 22. ‘సిప్రాలి’ అంటే 1) సింహాద్రి శతకం - ప్రామాణిక శతకం - లింగాష్టకం 2) సింహగిరి వచనాలు, ప్రాసాక్షరాలు, అవనిజాలు 3) సిరిసిరిమువ్వశతకం-ప్రాసకీడలు, లిమరిక్కులు 4) సిరిసిరిమువ్వ శతకం- ప్రాలేయ శతకం- లింగశతకం 23. ‘నువ్వు చెప్పేదేదైనా నీ అనుభవంలో నుంచి పలకాలని చెప్పే ప్రాథమిక సూత్రం’ ఉన్న కవితా ధోరణి ఏది? 1) వ్యక్తిత్వవాద కవిత్వం 2) అస్తిత్వవాద కవిత్వం 3) అనుభూతివాద కవిత్వం 4) ప్రతీకవాద కవిత్వం 24. కన్యక ద్వారా గురజాడ చెప్పదలచింది? 1) ఆత్మగౌరవాన్ని 2) పదం పద్యం గొప్పదనాన్ని 3) కన్యక గొప్పదనాన్ని 4) రాజు సాహసాన్ని 25. బధిర చతుష్టయం ప్రహసన కర్త? 1) పానుగంటి 2) గురజాడ 3) చిలకమర్తి 4) కందుకూరి 26. దిగంబర కవుల్లో ఒకరు? 1) కుందుర్తి ఆంజనేయులు 2) కె.వి. రమణారెడ్డి 3) నగ్నముని 4) వరవరరావు 27. జానపద గేయంలో రామాయణం పాటలు ఏ శాఖకు చెందినవి? 1) శృంగార గేయాలు 2) శ్రామిక గేయాలు 3) పౌరాణిక గేయాలు 4) చారిత్రక గేయాలు 28. వేదుల సత్యనారాయణ ఏ శాఖకు చెందు తారు? 1) అభ్యుదయ కవిత 2) భక్తి కవిత 3) భావ కవిత 4) సంప్రదాయ కవిత 29. పానుగంటి ‘జంఘాలశాస్త్రి’ని గుర్తుకు తెచ్చే సురవరం పాత్ర ఏది? 1) విశ్వామిత్ర 2) యుగవతి 3) రామ్మూర్తి 4) చిత్రగుప్తుడు 30. తామసి పాఠ్యభాగం ఏ కవితా శాఖకు చెందుతుంది? 1) ప్రణయ కవిత్వం 2) అభ్యుదయ కవిత్వం 3) భావ కవిత్వం 4) విప్లవ కవిత్వం 31. బిరుదు రాజు రామరాజు దేనికి ప్రసిద్ధులు? 1) కావ్య పరిష్కరణ శాస్త్రం రాసినందుకు 2) విశ్వవిద్యాలయ ఆచార్యులైనందుకు 3) జానపద సాహిత్యంపై మొదట పరి శోధన చేసినందుకు 4) జానపద సాహిత్యాన్ని సేకరించినందుకు 32. అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి రచన ఏది? 1) తొలకరి 2) ఆంధ్రపురాణం 3) రాష్ట్ట్రగానం 4) జన్మభూమి 33. భావకవితా లక్షణాల్లో ప్రధానమైంది? 1) ఇంద్రియ సుఖం 2) కొత్తదనం 3) అంతర్ముఖత్వం 4) బహిర్ముఖత్వం 34. అమలిన శృంగారానికి ఉదాహరణగా నిల్చిన కావ్యం? 1) రమ్యాలోకనం 2) మాధురీదర్శనం 3) తృణకంకణం 4) కష్టకమల 35. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ ఏవిధంగా ప్రసిద్ధి చెందింది? 1) రామాయణాన్ని తెలుగులో కావ్యంగా రాసినందుకు 2) ద్విపద రామాయణాన్ని అనువాదం చేయనందుకు 3) మొదటి జ్ఞానపీఠ్ అవార్డు తెలుగులో పొందినందుకు 4) కేంద్ర సాహిత్య అకాడమీ ఆవార్డు పొందినందుకు -
గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టిందెవరు?
గణితశాస్త్ర చరిత్ర గణిత స్వభావం - ప్రసిద్ధ వాదాలు గణిత స్వభావాన్ని వివరించడానికి వివిధ వాదాలున్నాయి. తార్కిక వాదం: బెర్ట్రాండ్ రస్సెల్, ఎం.ఎన్. వైట్ హెడ్ రాసిన ‘ప్రిన్సపియా మేథమెటికా’ తార్కిక వాదాన్ని వివరిస్తుంది. గణితానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుంచి పొందాలనేది దీని సారాంశం. సంప్రదాయ వాదం: డేవిడ్ హిల్బర్ట తన గ్రంథం ‘గండ్లా గెన్డెర్ మేథమెటికా’లో ఈ వాదాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం స్వీకృతాలు ప్రధానమైనవి. వీటి నుంచి అతి జాగ్రత్తగా సూత్రీకరించిన పరిమితీయ పద్ధతులను ఉపయోగించి వైరుధ్యాలు లేకుండా గణితాన్ని అంతటినీ సాధించవచ్చు. కర్ట గోడెల్ అసంపూర్ణతా సిద్ధాంత ప్రవచనం స్వీకృతాలు పరిపూర్ణ ప్రయోజనాన్ని ప్రశ్నించింది. ‘గణిత పునాదుల’ను కదిలించింది. అంతర్భుద్ధి వాదం (సహజ జ్ఞాన వాదం): లియోపాడ్ క్రొనేకర్, హెన్రీ పాయింకర్ ఈ వాదాన్ని ప్రచారం చేశారు. దీని ప్రకారం గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వం. ఇది సహజ సంఖ్యల నిర్మాణంపై ఆధారపడి ఉంది. గణిత భావనలు మానవుని ఆలోచనల్లో లీనమై ఉంటాయి. బయటి ప్రపంచంలో వాటి ఉనికి లేదు. భారతీయేతర గణిత శాస్త్రజ్ఞులు పైథాగరస్: గ్రీకు గణిత శాస్త్రవేత్త అయిన పైథాగరస్, ‘థేల్స్’ వద్ద గణితాన్ని అభ్యసించి ఆయన ప్రేరణతో మరింత అధ్యయనానికి ఈజిప్ట్, ఆసియా మైనర్, ఇండియా మొదలైన దేశాలు పర్యటించాడు. దక్షిణ ఇటలీలోని క్రాటన్‌లో పైథాగరియన్ పాఠశాలను స్థాపించాడు. ‘అయిదు శీర్షాల నక్షత్రం’ ఈ అకాడమీ చిహ్నం. పాఠశాల సభ్యుల్లో ఎవరు ఏ విషయాన్ని కనుగొన్నా వాటన్నింటినీ పైథాగరస్ పేరుతోనే ప్రకటించేవారు. పైథాగరస్, పాఠశాల సభ్యుల వింత ప్రవర్తనపై ప్రజలకు అనుమానం ఏర్పడటం వల్ల డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు పాఠశాలను ధ్వంసం చేశారు. పైథాగరస్ మెటాఫాంటమ్కు పారిపోయి అక్కడ హత్యకు గురయ్యాడు. ఫిలోడస్, ఆర్కిమెడిస్ మొదలైన వారు ఈ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు. పైథాగరస్ సిద్ధాంతాలపై ఫిలోడస్ రాసిన పుస్తకం వల్ల పైథాగరస్, అతని అనుచరులు కనుగొన్న విషయాలు ప్రపంచానికి తెలిశాయి. మరణించిన 200 సంవత్సరాల తర్వాత పైథాగరస్ స్వదేశం అతడి గొప్పతనాన్ని గుర్తించింది. రోమ్‌లో పైథాగరస్ విగ్రహాన్ని నిర్మించారు. గణితానికి పైథాగరస్ చేసిన సేవలు: పైథాగరస్ ‘వైశాల్యం’ అనే అంశంపై ఎక్కువ కృషి చేశారు. ‘ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం, మిగిలిన రెండు భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానం’ అనేది పైథాగరస్ సిద్ధాంతంగా ప్రసిద్ధి చెందింది. జ్యామితీయ పటాల గురించి వివరించడానికి మొదటగా కొన్ని అక్షరాలను తెలిపాడు. సంఖ్యావాదం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలను పరిచయం చేశాడు. సంఖ్యలను సరి, బేసి సంఖ్యలుగా వర్గీకరించాడు. అనుపాత సంబంధ ధర్మాలను తెలిపాడు. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాల్లో వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని నిరూపించాడు. గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టాడు. సంఖ్యలకు.. 1 - హేతువాదం, 2 - అభిప్రాయం, 3 - న్యాయం, 4 - వివాహం, బేసి సంఖ్యలు - పురుష సంఖ్యలు, సరి సంఖ్యలు - స్త్రీ సంఖ్యలు అనే అర్థాలు ఇచ్చాడు. ‘సంఖ్య విశ్వ శాసన కర్త’ అని భావించాడు. ఉపపత్తికి ప్రాముఖ్యం ఇచ్చాడు. భూమి సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల రాత్రి, పగలు ఏర్పడుతున్నాయని ఊహించాడు. పదార్థాల అనేక లక్షణాలకు పూర్ణాంకాలు కారణం అనే ప్రాతిపదికన సంఖ్యా లక్షణాలు, అంకగణితం, రేఖాగణితం, సంగీ తం, ఖగోళ శాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఇవే అంశాలను బోధించాడు. యూక్లిడ్: ఇతడు గ్రీకు దేశానికి చెందిన వాడు. అలెగ్జాండ్రియా నివాసి. ఖగోళ శాస్త్రజ్ఞుడైన ‘టాలమీ’ ప్రారంభించిన అలెగ్జాండ్రియా రాజ విశ్వవిద్యాలయంలో యూక్లిడ్ గణితాన్ని బోధించేవాడు. ‘ఎలిమెంట్స్’,‘డాటా’ గ్రంథాలను రచించాడు. ‘ఫాదర్ ఆఫ్ జ్యామెట్రీ’గా గౌరవం పొందాడు. యూక్లిడ్ గణితానికి చేసిన సేవలు: యూక్లిడ్ తనకు ముందుతరంవారైన థేల్స్, పైథాగరస్, ప్లాటో మొదలైన ఈజిప్ట్, గ్రీకు గణిత మేధావులు కనుగొన్న విషయాలను క్రమబద్ధీకరించి ‘ఎలిమెంట్స్’ అనే గ్రంథాన్ని రాశాడు. జ్యామితీయ నిర్మాణానికి అతి ముఖ్యమైన స్వయం సిద్ధాంతాలు, స్వీకృతాలు, ప్రవచనాలను ప్రతిపాదించాడు. యూక్లిడ్ రచించిన మరో గ్రంథం ‘డాటా’. దీంట్లో విశ్లేషణకు సంబంధించిన పద్ధతుల గురించి వివరించాడు. యూక్లిడ్ రాసిన ‘ఎలిమెంట్స్’ గ్రంథంలో 13 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో నిర్వచనాలు, స్వీకృతాలు మొదలైన జ్యామితికి సంబంధించిన ప్రాథమిక విషయాలు, త్రిభుజాలు, వాటి సర్వ సమానత్వాలు (1-26 ప్రతిపాదనలు) సమాంతర రేఖలు, సమాంతర చతుర్భుజాలు (27-32), పైథాగరస్ సిద్ధాంతం (47), దాని విపర్యయం (48) ఉన్నాయి. రెండో భాగంలో వైశాల్యాలు, బీజ గణిత సంబంధమైన విషయాలు ఉన్నాయి. మూడో భాగంలో వృత్తాలు, చాపాలు, జ్యాలు, అంతర్లిఖిత కోణాలకు సంబంధించిన విషయాలున్నాయి. నాలుగో భాగంలో పైథాగరీయన్ నిర్మాణాలు, అంతర్లిఖిత, పరిలిఖిత క్రమ బహుభుజుల నిర్మాణాలు ఉన్నాయి. ఐదో భాగంలో అనుపాతానికి సంబంధించి ‘యూడోక్సెస్’ వాదం గురించి తెలిపాడు. ఆరో భాగంలో యూడోక్సెస్ వాదాన్ని రేఖా గణితానికి అనువర్తనం చేశాడు. సరూప త్రిభుజాల సిద్ధాంతాలు, తృతీయ, చతుర్థ, మధ్యమ అనుపాతాల నిర్మాణం, వర్గ సమీకరణాల జ్యామితీయ సాధన, శీర్షకోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతాలు తెలిపాడు. ఏడు, ఎనిమిది, తొమ్మిది భాగాల్లో ప్రాచీ న సంఖ్యా సిద్ధాంతాలు, జ్యామితీయ భావనలతో కూడిన అంకగణిత వివరాలున్నాయి. పదో భాగంలో కరణీయ సంఖ్యలు, రేఖా ఖండాల కొలతల నిర్ధారణ, పైథాగరీయన్ త్రికాల గురించి ఉంది. చివరి మూడు భాగాల్లో త్రిపరిమాణ జ్యామితికి చెందిన విషయాలున్నాయి. ‘ఎలిమెంట్స్’ గ్రంథం దాదాపుగా ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదితమైంది. బైబిల్ తర్వాత ఎక్కువ ప్రతులు అమ్ముడైన గ్రంథమిదే. అబ్రహం లింకన్ తన 40వ ఏట గణితం కోసం కాకుండా, తర్కవివేచన కోసం ‘ఎలిమెంట్స్’ గ్రంథం చదివారు. నేటికీ పాఠశాల గణితంగా బోధిస్తున్న సిలబస్‌లో అధిక భాగం ‘ఎలిమెంట్స్’ను అనుసరించే ఉంది. జార్జి కాంటర్: ఇతడు రష్యాలోని సె యింట్ పీటర్స బర్గలో జన్మించాడు. సమితి వాదాన్ని ప్రతిపాదించాడు. ‘థియరీ ఆఫ్ ఇన్‌ఫైనట్ సెట్’ అనే వ్యాసాన్ని రాశాడు. ఇది సంచలనాత్మకమైంది. జార్జి కాంటర్ గణితానికి చేసిన సేవలు: సంఖ్యల అనంతశ్రేణి స్వభావం, సమితి వాదం గురించి తెలిపాడు. సహజ సంఖ్యా సమితిలోని సంఖ్యలతో అన్వేక సాదృశ్యత ఏర్పరచి అకరణీయ సంఖ్యల లెక్కింపు సాధ్యమని తెలియజేశాడు. వీటికి సంబంధించిన అంకగణితాన్ని అభివృద్ధి పరిచాడు. ఆధునిక గణిత భాషకు ఆద్యుడు ఇతడే. అవిచ్ఛిన్నతకు సంతృప్తికరమైన నిర్వచనం ఇచ్చాడు. వాస్తవ సంఖ్యల సగటును లెక్కించడం సాధ్యంకాదని తెలిపాడు. కాంటర్‌తో మొదటి నుంచి ఏకీభవించిన వ్యక్తి డెడికెండ్. -
విమర్శ ప్రధానాంశంగా ఉండే ప్రక్రియ?
కావ్య ప్రక్రియలు - లక్షణాలు నవల క్రీ.శ. 19వ శతాబ్దిలో ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో ఎన్నో సృజనాత్మక వచన సాహితీ ప్రక్రియలు వచ్చాయి. ఆంగ్లం నుంచి పుట్టిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘నవల’. ఆధునిక సాహిత్య ప్రక్రియలో ఎక్కువ జనాదరణ పొందిన ప్రక్రియ కూడా ఇదే. ఈ ప్రక్రియ మొదటిసారిగా ఇటలీలో ప్రారంభమైంది. నవల అనే పదం ూౌఠ్ఛి (నోవెల్) అనే ఆంగ్లపదం నుంచి వచ్చింది. తెలుగులో మొదట నవలను వచన ప్రబంధం అని, నవీన ప్రబంధం అని, గద్య ప్రబంధం అని వ్యవహరించేవారు. నరహరి గోపాల కృష్ణమచెట్టి నవలను మొదట నవీన ప్రబంధం అన్నారు. కందుకూరి వీరేశలింగం దీన్ని వచన ప్రబంధంగా పేర్కొన్నారు. తెలుగులో నవలా ప్రక్రియకు నామకరణం చేసినవారు - కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి. నవల - నిర్వచనాలు: * యథార్థ జీవితాన్ని యథార్థ దృష్టితో అధ్యయనం చేసి గద్యరూపంలో వ్యక్తం చేసేదే నవల. - రిచర్డ క్రాస్ * నవాన్ విశేషాన్ లాతి గృహ్ణాతీతి నవల. - కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి * సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ, ప్రజల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల. -శ్రీ మొదలి నాగభూషణ శర్మ ముఖ్యమైన నవలలు: * తొలి తెలుగు నవల - రంగరాజ చరిత్ర * నరహరి గోపాలకృష్ణమచెట్టి రాసిన రంగ రాజ చరిత్ర అనే నవలకు సోనాబాయి పరిణయం అనే నామాంతరం ఉంది. * సమగ్ర నవలా లక్షణాలతో వెలసిన మొదటి నవలగా కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్ర ప్రసిద్ధికెక్కింది. దీనికి ‘వివేక చంద్రిక’ అనే పేరు కూడా ఉంది. నవల పేరు- కర్తలు రాజశేఖర చరిత్ర (1878), సత్యరాజా పూర్వదేశ యాత్రలు - కందుకూరి వీరేశలింగం గణపతి (తొలి హాస్య నవల) - చిలకమర్తి లక్ష్మీనరసింహం హిమబిందు - అడవి బాపిరాజు మాతృమందిరం - వేంకట పార్వతీశ కవులు మాలపల్లి - ఉన్నవ లక్ష్మీనారాయణ మైదానం, దైవమిచ్చిన భార్య - గుడిపాటి వెంకటాచలం వేయిపడగలు, ఏకవీర - విశ్వనాథ సత్యనారాయణ బారిష్టరు పార్వతీశం - మొక్కపాటి నరసింహశాస్త్రి రక్షాబంధనం, శ్మశాన వాటిక - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి చదువు - కొడవటిగంటి కుటుంబరావు అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా- త్రిపురనేని గోపీచంద్ చివరకు మిగిలేది? - బుచ్చిబాబు అల్పజీవి - రాచకొండ విశ్వనాథశాస్త్రి కీలుబొమ్మలు - జి.వి. కృష్ణారావు అంపశయ్య - నవీన్ తులసిదళం - యండమూరి వీరేంద్రనాథ్ కాలాతీత వ్యక్తులు - శ్రీదేవి బలిపీఠం - ముప్పాళ్ల రంగనాయకమ్మ నాటకం సాహిత్య ప్రక్రియల్లో అత్యంత శక్తిమంతమైన, విశిష్టమైన ప్రక్రియ ‘నాటకం’. ఇది పాఠ కుల హృదయాలను రంజింపజేయడంలో ఉత్తమమైంది. తెలుగు నాటక రంగానికి మహోజ్వల చరిత్ర ఉంది. నాటకం దృశ్య ప్రక్రియకు చెందింది. ఇది లలిత కళలతో సమాహారకళగా ప్రసిద్ధికెక్కింది. క్రీ.శ. 19వ శతాబ్ది చివరి భాగంలో కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన మంజరీ మధుకరీయం (1860)తో ఆధునిక తెలుగు నాటకం ప్రారంభమైంది. నాటకం - నిర్వచనాలు: కావ్యేషు నాటకం రమ్యం - భరతుడు (నాట్యశాస్త్రం) నాటకాంతం హి సాహిత్యం - అభినవ గుప్తుడు (అభినవ భారతి) మంగళాది, మంగళమధ్య, మంగళాంతః నాటకం - భారతీయ లాక్షణికులు నాటకం- లక్షణాలు: 1. నాంది 2. ప్రస్తావన 3. విష్కంభం 4. అంకవిభజన 5. పంచసంధులు 6. భరతవాక్యం కథ- కథానిక ప్రాచీన సంప్రదాయ ప్రక్రియ ‘కథ’ అయితే, ఆధునిక సంప్రదాయ ప్రక్రియ ‘కథానిక’. క్రీ.శ. 19వ శతాబ్దిలో ఆంగ్లం నుంచి దిగుమతి అయిన వచన సాహితీ ప్రక్రియలో కథానిక ఒకటి. కథ, కథానిక పదాలను ప్రస్తుతం పర్యాయపదాలుగా వాడుతున్నారు. కథానిక ప్రస్తావన మొదట అగ్ని పురాణంలో కనిపిస్తుంది. ‘షార్ట స్టోరీ’ అనే పదానికి సమానార్థకంగా కథానిక, చిన్న కథ అనే పదాలు ప్రయోగంలో ఉన్నాయి. 1936లో ప్రతిభ అనే పత్రికలో వ్యాసం రాస్తూ ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి తొలిసారిగా ‘షార్ట స్టోరీ’ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా ‘కథానిక’ పదాన్ని సూచించారు. ఆధునిక తెలుగు కథ 1910లో గురజాడ ‘దిద్దుబాటు’తో ప్రారంభమైంది. మొదట దిద్దుబాటు కథను ఆంధ్రభారతి పత్రికలో ప్రచురించారు. ఆధునిక తెలుగు కథా రచయితలకు గురజాడ మార్గదర్శకుడు. కథానిక ప్రధాన లక్షణాలు సంక్షిప్తత, ఏకాగ్రత, సమగ్రత, నిర్భరత. శీలా వీర్రాజు అభిప్రాయం ప్రకారం ‘కథానికకు శిల్పమే ప్రాణం’. గల్పిక ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన వచన సాహితీ ప్రక్రియల్లో ‘గల్పిక’ ఒకటి. ఇది పరిమాణంలో కథానిక కంటే చిన్నది. దీంట్లో విమర్శ ప్రధానాంశంగా ఉంటుంది. సంఘటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. * మానవ జీవితంలోని ఒడుదుడుకుల్ని చిత్రించేది కథానిక అయితే ఒక వ్యక్తిని గానీ, ఒక వ్యవస్థను గానీ అవహేళన చేసేదే గల్పిక. * గల్పికలో అనుభూతి చిత్రణ కంటే అనుభవ ప్రకటనకు, భావ దృష్టికి రచయితలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. * ఒక వ్యక్తి అనుభవంలోని ఒక దశగానీ, ఒక సంస్థ పరిణామక్రమంలోని ఒక విశేషంగానీ గల్పికలో ప్రధాన వస్తువు. * వ్యక్తిని గానీ, వ్యవస్థనుగానీ విమర్శించడం గల్పికలో సర్వసాధారణం. * 1940 ప్రాంతంలో త్రిపురనేని గోపీచంద్, కొడవటిగంటి కుటుంబరావు గల్పికలు రాసి ప్రసిద్ధి చెందారు. * తెలుగులో గల్పిక ప్రక్రియకు ఆద్యుడు కొడవటిగంటి కుటుంబరావు. ఆయన రాసిన గల్పికలు యువ పత్రికలో ప్రచురితమయ్యాయి. -
అంతరిక్షయానంలో రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే?
బయాలజీ - మెథడాలజీ (ఎస్.ఎ.) జీవశాస్త్రం బయాలజీ పదం ‘బయోస్ - లాగస్’ అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. బయోస్ అంటే జీవం అని, లాగస్ అంటే అధ్యయనం అని అర్థం. బయాలజీ పదాన్ని కనుగొన్నవారు - జీన్ బాప్టిస్ట్ లా మార్క. జీవశాస్త్రంలోని శాఖలు: ప్రాథమిక శాఖలు (ప్యూర్ సెన్సైస్) అనువర్తిత శాఖలు (అప్లయిడ్ సెన్సైస్) సంబంధిత శాఖలు (రిలేటెడ్ సెన్సైస్) ప్రాథమిక శాఖలు: జీవశాస్త్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. 1) వృక్షశాస్త్రం (బోటనీ). బొటానీ అంటే మొక్క అని అర్థం. 2) జంతుశాస్త్రం (జువాలజీ). జోవన్ అంటే జంతువు, లాగస్ అంటే అధ్యయనం అని అర్థం. బాహ్య స్వరూపశాస్త్రం: జీవుల బాహ్య లక్షణాల గురించి తెలియజేస్తుంది. అంతర్నిర్మాణ శాస్త్రం: జీవుల అంతర భాగాలను గురించిన అధ్యయనం శరీర ధర్మ శాస్త్రం: జీవుల అవయవ వ్యవస్థలను గురించి తెలియజేస్తుంది. జన్యుశాస్త్రం: జీవుల్లో అనువంశిక లక్షణాల గురించిన అధ్యయనం. వర్గీకరణ శాస్త్రం: లక్షణాల ఆధారంగా జీవులను సమూహాలుగా విభజించే పద్ధతి గురించి తెలియజేస్తుంది. ఆవరణ శాస్త్రం: జీవుల ఆవాసాలను గురించి తెలిపే శాస్త్రం. పిండోత్పత్తి శాస్త్రం: జీవుల పుట్టుక ప్రాథమిక దశలను గురించి వివరిస్తుంది. జీవ పరిణామ శాస్త్రం: సరళ జీవుల నుంచి సంక్లిష్ట జీవులు ఏర్పడిన విధానం గురించి తెలియజేస్తుంది. జీవశాస్త్ర అనువర్తిత శాఖలు రెండు శాస్త్ర శాఖలు కలువగా ఏర్పడిన నూతన శాఖను అనువర్తిత శాఖ అంటారు. ఉదాహరణ: జీవరసాయన శాస్త్రం (బయో కెమిస్ట్రీ) - జీవ భౌతిక శాస్త్రం (బయో ఫిజిక్స్) - జీవ సాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) సూక్ష్మ జీవశాస్త్రం (మైక్రో బయాలజీ) వైరాలజీ: వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. వ్యాధి నిరోధక శాస్త్రం (ఇమ్యునాలజీ) ఏరో బయాలజీ: పుప్పొడి రేణువులు, సిద్ధ బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెందే విధానం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ): అణు స్థాయిలో జీవుల అధ్యయనం. ఫైలోజైని: ఒక తెగ లేదా సమూహ జీవుల పుట్టుక గురించి తెలిపే శాస్త్రం. జీవ ఖగోళ శాస్త్రం (ఆస్ట్రో బయాలజీ/ గ్జెనో బయాలజీ/ ఎక్సో బయాలజీ): భూగోళానికి వెలుపల జీవం ఉండటానికి గల అవకాశం గురించి తెలిపే శాస్త్రం. రేడియో ధార్మిక శాస్త్రం: రేడియో ధార్మిక పదార్థాల లక్షణాలకు సంబంధించింది. మెరైన్ బయాలజీ: సముద్ర జీవుల గురించిన శాస్త్రం. జీవశాస్త్ర సంబంధిత శాఖలు వైద్యశాస్త్రం (మెడిసిన్), వ్యవసాయ శాస్త్రం (అగ్రికల్చర్), ఉద్యాన వన శాస్త్రం (హార్టీకల్చర్) గతంలో అడిగిన ప్రశ్నలు 1. ప్రకృతిలో సమన్వయంగా జీవించడాన్ని సంస్కృతి నేర్పితే, ఆ ప్రకృతి గురించి స్పష్టమైన అవగాహన కలిగించేది? (డీఎస్సీ - 2004) 1) జీవరాశి 2) జీవన విధానం 3) జీవశాస్త్రం 4) జీవితం 2. స్తబ్ధ దృష్టిలో విజ్ఞానశాస్త్రం అంటే? (డీఎస్సీ - 2006) 1) యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణ 2) నిరంతర పరిశీలన ద్వారా మనం మన గురించి, విశ్వం గురించి తెలుసుకోవడం 3) ఒక క్రియాత్మకత 4) తమ మధ్య సంబంధాలున్న సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు క్రమబద్ధమైన సమాచారం ఉన్న విభాగం 3. జీవశాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందనిది? (డీఎస్సీ - 2006) 1) పద్ధతులు 2) వైఖరులు 3) భావనలు 4) ప్రక్రియలు 4. భారతదేశంలో అధిక ఆహారోత్పత్తికి (పెరుగుతున్న జనాభా దృష్ట్యా) దోహద పడినవి? (డీఎస్సీ - 2006) 1) హరిత, శ్వేత, నీలి విప్లవాలు 2) పసుపు, హరిత, శ్వేత విప్లవాలు 3) శ్వేత, నీలి, ఎరుపు విప్లవాలు 4) పసుపు, ఎరుపు, హరిత విప్లవాలు 5. విజ్ఞాన శాస్త్ర భావనలు, నియమాలు రూపొందించడానికి ఆధారాలు? (డీఎస్సీ - 2008) 1) స్ఫురణ అనుభవాలు 2) ఆత్మశ్రమ అనుభవాలు 3) అనుభావాత్మక పరిశీలనలు 4) అనుకరణ అనుభవాలు 6. విజ్ఞాన శాస్త్రంలోని అన్ని ఇతర సబ్జెక్ట్‌ల కంటే జీవశాస్త్రం ప్రాథమికమైంది, ముఖ్యమైంది. ఎందుకంటే? (డీఎస్సీ - 2012) 1) జీవరాశుల ప్రాథమిక అవసరాలు తీర్చడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది 2) సృజనాత్మకతను పోషిస్తుంది 3) జ్ఞాన విస్ఫోటనానికి మార్గం సుగ మం చేస్తుంది 4) భూమాతను అవగాహన చేసుకోవడానికి సహాయపడుతుంది సమాధానాలు 1) 3; 2) 4; 3) 3; 4) 1; 5) 3; 6) 1. మాదిరి ప్రశ్నలు 1. విజ్ఞానశాస్త్రమంటే ఒక మాపనం అని, దీని అన్వేషణకు విశ్వం ముడి పదార్థం అని ఒక విద్యార్థి నిర్వచనాలను నేర్చుకుంటున్నాడు. ఇవి కిందివారిలో ఎవరికి సంబంధించినవి? 1) అఅఅట క్లీడీ బెర్నార్డ 2) క్లీడీ బెర్నార్డ - ఆక్స్ఫర్డ డిక్షనరీ 3) కార్ల పియర్సన్- కొలంబియా విజ్ఞాన సర్వస్వం 4) అర్హీనియస్ - కార్ల పియర్సన్ 2. గతిశీల దృష్టితో చూసినప్పుడు విజ్ఞాన శాస్త్రమంటే క్రియాత్మకత. దీనికి సరైన ఉదాహరణ? 1) పద్ధతులు 2) భావన 3) సిద్ధాంతం 4) నియమం 3. ‘కళల అధ్యయనం వల్ల వ్యక్తిగత అభివృద్ధి - శాస్త్ర అధ్యయనం వల్ల వ్యక్తిగత, సమాజ ప్రయోజనం కలుగుతాయి.’ ఈ ప్రవచనాన్ని బలపరిచే విజ్ఞానశాస్త్ర నిర్వచనాన్ని ఇచ్చినవారు? 1) ఐన్‌స్టీన్ 2) కార్ల పియర్సన్ 3) క్లేడీ బెర్నార్డ 4) అర్హీనియస్ 4. జీవశాస్త్ర సంబంధిత శాఖకు ఉదాహరణ ఇవ్వమని ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు ఎ వైరాలజీ అని, బి వ్యవసాయ శాస్త్రం అని సి వైద్యశాస్త్రం అని తెలిపారు. వీరిలో సరైన ఉదాహరణలు ఇచ్చినవారు? 1) ఎ, బి లు తప్పు సి ఒప్పు 2) ఎ, సి లు తప్పు, బి ఒప్పు 3) ఎ ఒప్పు, బి, సి లు తప్పు 4) ఎ తప్పు, బి, సి లు ఒప్పు 5. ‘శాస్త్రీయ సత్యాలు సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉన్న అంచనాలు మాత్రమే’ అని పేర్కొన్నవారు? 1) కార్ల పియర్సన్ 2) స్వామి వివేకానంద 3) అర్హీనియస్ 4) ఐన్‌స్టీన్ 6. అంతరిక్షయానంలో రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే? 1) ప్రయాణించే దిశకు వ్యతిరేక దిశలో తల ఉండేటట్లు చూసుకోవాలి 2) ఎగిరే దిశకు సమాంతరంగా పడు కోవాలి 3) క్లోరెల్లా అనే శైవలం దగ్గరుండాలి 4) నిద్రపోకుండా మేల్కొని ఉండాలి 7. దత్తాంశాల ఆధారంగా పరిష్కారాన్ని ఊహించడం అనేది, కిందివాటిలో దేనికి సంబంధించింది? 1) నియమం 2) ప్రాకల్పన 3) సిద్ధాంతం 4) భావన 8. శాస్త్ర నియమం అంటే నిరూపితమైన సాధారణీకరణ అని తెలియజేసింది? 1) అఅఅట 2) శాస్త్రీయ మానవశక్తి పథకం 3) కొలంబియా ఎన్సైక్లోపీడియా 4) ఆక్స్ఫర్డ డిక్షనరీ 9. ‘రక్తంలోని ీహిమోగ్లోబిన్కు రక్తం ఆక్సిజన్ రవాణా చేయడానికి సంబంధం ఉండ వచ్చు’ అనే ఊహను ఏర్పరచుకొని ఒక శాస్త్రవేత్త పరిశోధన కొనసాగిస్తే, ఆయన ఏ రకమైన ప్రాకల్పన ఏర్పరచుకున్నట్లు? 1) ప్రాగుక్తీ ప్రాకల్పన 2) శూన్య ప్రాకల్పన 3) ప్రకటనాత్మక ప్రాకల్పన 4) ప్రశ్నా ప్రాకల్పన 10. కిందివాటిలో ఏ అంశం ఆధారాలు చూపినప్పటికీ నిరూపితం కాలేదు? 1) సూత్రం 2) నియమం 3) సత్యం 4) సిద్ధాంతం 11. జన్యుశాస్త్రం కిందివాటిలో ఏ రకమైన శాఖకు ఉదాహరణ? 1) ప్రాథమిక 2) అనువర్తిత 3) సంబంధిత శాఖ 4) సాంకేతిక 12. విజ్ఞానశాస్త్ర భావనలు, నియమాలు రూపొందించడానికి ఆధారాలు? 1) స్ఫురణ అనుభవాలు 2) ఆత్మాశ్రయ అనుభవాలు 3) అనుభవాత్మక పరిశీలనలు 4) అనుకరణ అనుభవాలు 13. ఇక్రిశాట్ సంస్థ ప్రధాన లక్ష్యం? 1) హెచ్ఐవీపై పరిశోధన 2) ప్రపంచ జనాభాకు సరిపడే ఆహార ధాన్యాల ఉత్పత్తి 3) ప్రజలను పీడిస్తున్న వ్యాధులపై పరి శోధన 4) భారతదేశంలో కాలుష్య నివారణ సమాధానాలు: 1) 4; 2) 1; 3) 3; 4) 4; 5) 2; 6) 2; 7) 2; 8) 3; 9) 1; 10) 4; 11) 1; 12) 3; 13) 2. -
హిమాలయాల్లో కైబర్.. బొలాన్ అనేవి?
భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక ఆసియాలో దక్షిణ భాగాన భారత ఉపఖండం ఉంది. దీనికి ఉత్తరాన హిమాలయాలు, ఆగ్నేయంలో బంగాళాఖాతం, నైరుతిలో అరేబియా సముద్రం ఉన్నాయి. భౌగోళికంగా 8ని.4’. 37ని.6’ ఉత్తర అక్షాంశాలు, 68ని.7’ 97ని25’ తూర్పు రేఖాంశాల మధ్య ఉత్తరార్ధ, పూర్వార్ధ గోళంలో పాక్షికంగా విస్తరించి ఉంది. ఇది అక్షాంశాల పరంగా ఉత్తర దక్షిణాలుగా 30నిల పొడవు, రేఖాంశాల పరంగా కూడా తూర్పు, పడమరలుగా 30నిల డిగ్రీల వెడల్పులో వ్యాపించి ఉంది. 3.28మిలియన్ చ.కి.మీ విస్తీర్ణంతో ఉన్న భారతదేశం ప్రపంచంలోని పెద్ద దేశాల్లో ఏడోది. ఉత్తర దక్షిణాలుగా సుమారు 3214 కి.మీ పొడవు, తూర్పు పడమరలుగా 2933 కి.మీ వెడల్పుతో భారతదేశం విస్తరించి ఉంది. దేశం ఉత్తర చివరన మంచుతో కప్పిన హిమాలయ పర్వతాలు, దక్షిణాన కన్యాకుమారి, పశ్చిమాన ఉప్పు నీటితో కూడిన చిత్తడి నేలలున్న రాణా ఆఫ్ కచ్, తూర్పున దట్టమైన అడవులు, అభేద్యమైన కొండలతో మయన్మార్, చైనా భారత దేశాల సరిహద్దు భాగాలుగా ఉన్నాయి. రేఖాంశాల పరంగా తూర్పు పడమరలుగా భారత దేశం 30నిల మేర విస్తరించి ఉన్నందున పశ్చిమాన గుజరాత్‌లోని ద్వారకా వద్ద కంటే, తూర్పు అంచున ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో మొదట సూర్యోదయం అవుతుంది. దేశంలో వివిధ ప్రదేశాల స్థానిక కాలాల్లోని భేదాన్ని తొలగించడానికి 821/2ని తూర్పు రేఖాంశాన్ని కాల నిర్ణయానికి ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించారు. దీన్నే భారతదేశ ప్రామాణిక కాలంగా వ్యవహరిస్తున్నారు. గ్రీనిచ్ కాలానికి, భారత ప్రామాణిక కాలానికి 51/2ని గంటల వ్యత్యాసం ఉంది. భారతదేశానికి మొత్తం 15,200 కి.మీ. పొడవైన భూభాగపు సరిహద్దు, 6,100 కి.మీ. పొడవైన తీరరేఖ ఉన్నాయి. భారతదేశం- సరిహద్దు దేశాలు, రాష్ట్రాలు పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ భారత్‌కు సరిహద్దులో ఉన్న (పొరుగు) దేశాలు. సముద్ర జలాల్లో అతి సమీపంలో ఉన్న పొరుగు దేశం శ్రీలంక. శ్రీలంక, భారతదేశాన్ని మన్నార్ సింధు శాఖ, పాక్ జలసంధి వేరుచేస్తున్నాయి. రాజకీయ విభాగాలు భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్... ఐదు పెద్ద రాష్ట్రాలు. గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం... ఐదు చిన్న రాష్ట్రాలు. దీవులు: అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు కాగా, అతి చిన్న ప్రాంతం లక్షదీవులు. భారతదేశంలో మొత్తం 247 దీవులున్నాయి. వీటిలో 223 బంగాళాఖాతంలో, మిగిలినవి అరేబియా సముద్రం, మన్నార్ సింధు శాఖల్లో ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు: ఇవి బంగాళాఖాతంలో 10ని-14ని ఉత్తర అక్షాంశాల మధ్య రెండు ప్రధాన సముదాయాలుగా ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల విస్తీర్ణం 8249చ.కి.మీ. అండమాన్ 6,408చ.కి.మీ, నికోబార్ దీవులు 1,841చ.కి.మీ. మేర వ్యాపించి ఉన్నాయి. అండమాన్, నికోబార్ సముదాయంలో కేవలం 36 దీవుల్లో మాత్రమే జనజీవనం ఉంది. 862 చ.కి.మీ. వైశాల్యంతో గ్రేట్ నికోబార్ అతి పెద్ద దీవి. ఇది భూమధ్యరేఖకు అతి దగ్గరగా ఉంది. అరేబియా సముద్రంలోని దీవులన్నీ పగడపు ఉద్భవంతో కూడినవి. 32 చ.కి.మీ.ల విస్తీర్ణంతో లక్షదీవులు 8ని11ని ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నాయి. వీటికి దక్షిణంగా ఎనిమిది డిగ్రీ ఛానల్లో 4-5చ.కి.మీ. వైశాల్యంతో మినికాయ్ దీవి ఉంది. శిలా ఉపరితలమున్న పాంబన్ దీవి భారతదేశం, శ్రీలంక మధ్య ఉంది. భారతదేశం నైసర్గిక స్వరూపాలు భారతదేశాన్ని ప్రధానంగా 4 ప్రధాన భూ స్వరూపాలుగా విభజించారు. హిమాలయాలు గంగా సింధు మైదానం ద్వీపకల్ప పీఠభూమి తీర మైదానాలు హిమాలయాలు: ఎల్లప్పుడూ మంచుతో కప్పి ఉండటం వల్ల వీటికి హిమాలయాలు అని పేరు వచ్చింది. వీటిని అతి తరుణ ముడుత లేదా నవీన ముడుత పర్వతాలు అంటారు. సంపీడన బలాల వల్ల టెథిస్ సముద్రం పైకి వచ్చి, ప్రస్తు తం ఉన్న హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాల ప్రకారం చూస్తే హిమాలయాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. నదుల ప్రకారం గమనిస్తే సింధు, బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరిం చాయి. హిమాలయాల పొడవు సుమారుగా 2,400 కి.మీ. వెడల్పు జమ్మూ కాశ్మీర్లో 500 కి.మీ., అరుణాచల్ ప్రదేశ్ 200 కి.మీ. హిమాలయాలు మొత్తం 5 లక్షల చ.కి.మీ. విస్తీర్ణాన్ని ఆక్రమించాయి. ఇవి వాయువ్యం నుంచి ఆగ్నేయ దిశగా వాలి ఉన్నాయి. వీటిని మూడు సమాంతర శ్రేణులుగా విభజించారు. 1. హిమాద్రి లేదా అత్యున్నత హిమాలయాలు 2. హిమాచల్ లేదా మధ్య లేదా నిమ్న హిమాలయాలు 3. శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు i) హిమాద్రి: హిమాలయ పర్వత శ్రేణులన్నింటికంటే ఇది అత్యున్నతమైంది. దీని సరాసరి ఎత్తు 6,100మీ. ఈ పర్వత శ్రేణిలో ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరాలు ఉన్నాయి. ఎవరెస్ట్ ప్రపంచంలో కెల్లా పెద్ద శిఖరం. ఇది నేపాల్‌లో ఉంది. సిక్కింలో ఉన్న కాంచనగంగ భారత దేశంలో ఎత్తయిన శిఖరం. మకాలు, ధవళగిరి, మనస్లూ, చోడీయు, నంగప్రభాత్, అన్నపూర్ణ, నందాదేవి, నామ్చ బర్వా మొదలైనవి హిమాద్రి శ్రేణిలోని కొన్ని ముఖ్య పర్వతాలు. ఇది గ్రానైట్, నీస్, షిఫ్ట్ వంటి రూపాంతర శిలలతో ఏర్పడింది. ii) హిమాచల్: హిమాద్రికి దక్షిణంగా హిమాచల్ పర్వత శ్రేణి ఉంది. ఈ శ్రేణి ఎత్తు 1000 నుంచి 4,500 మీ. వెడల్పు 60 నుంచి 80 కి.మీ. కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ పర్వతశ్రేణి అతి పొడవైంది. హిమాద్రి, పీర్ పంజాల్ శ్రేణి మధ్య కాశ్మీరులోయ ఉంది. ఈ లోయలో ఉన్న సరస్సులు ఊలర్, ధాల్. పీర్ పంజాల్ పర్వతశ్రేణి నైరుతి భాగాన్ని దౌల్ ధార్ శ్రేణి అంటారు. దీనిలో ప్రసిద్ధ వేసవి విడిది సిమ్లా. దీనిలోనే కులు, కాంగ్రా లోయ లున్నాయి. హిమాచల్ పర్వత శ్రేణిలో సిమ్లా ముస్సోరి, నైనిటాల్, ఛక్రాటా, రాణిఖేత్ వంటి వేసవి విశ్రాంతి స్థావరాలున్నాయి. ఈ పర్వత శ్రేణి సతతహరిత ఓక్, శృంగాకార అడవులతో నిండి ఉంది. iii) శివాలిక్: ఇది హిమాచల్ శ్రేణికి దక్షిణంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించింది. వీటి ఎత్తు 600మీ. నుంచి 1500మీ. వరకు ఉంది. వెడల్పు హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధింగా 50 కి.మీ. అరుణాచల్‌ప్రదేశ్‌లో అతి తక్కువగా 15 కి.మీ. ఉంది. ఈ శ్రేణులను జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జమ్మూ కొండలు అని, అరుణాచల్ ప్రదేశ్‌లో మిష్మి కొండలు అని అంటారు. శివాలిక్ కొండల్లో ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులు పెరుగుతాయి. 2012 డీఎస్సీలో అడిగిన ప్రశ్నలు కాంపిటీటివ్ కౌన్సెలింగ్ నేను డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్‌కు ప్రిపేరవుతున్నాను. భూగోళ శాస్త్రంలోని ‘భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక’ అధ్యాయాన్ని ఎలా చదవాలి? -పి.ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా గత డీఎస్సీ పరీక్షలో ఈ అధ్యాయం నుంచి రెండు ప్రశ్నలు అడిగారు. ఈ సారి కూడా 2 నుంచి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాలు, వివిధ దేశాల సరిహద్దులను మ్యాప్ పాయింటింగ్ ద్వారా సాధన చేస్తే ఈ పాఠ్యాంశంలోని అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉత్తర ప్రాంత హిమాలయాలను అధ్యయనం చేసేటప్పుడు, వాటి దిక్కులను ఆధారంగా చేసుకుని చదవాలి. భారతదేశ భూ స్వరూపాలు, నదీ ప్రాంతాలు, ఏర్పాటైన రాష్ట్రాలు, ప్రాంతాలను కలిపి చదవాలి. అట్లాస్‌ను దగ్గర పెట్టుకొని భారతదేశ భౌతిక అమరిక, పర్వతాల క్రమం, రాష్ట్రాల ఉనికిపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలను సులువుగా గుర్తించవచ్చు. 1. చిలుకా, కొల్లేరు సరస్సుల ద్వారా ప్రవహించే నది? 1) కృష్ణా 2) గోదావరి 3) బ్రాహ్మణి 4) మహానది 2. డెహ్రాడూన్ ఏ శ్రేణుల మధ్య ఉంది? 1) హిమాచల్, హిమాద్రి 2) శివాలిక్, హిమాచల్ 3) {sాన్స హిమాలయ మండలం, హిమాచల్ వరుసల్లో 4) హిమాద్రి, ట్రాన్స హిమాలయ మండలం 3. ఏ నగరాల మధ్య ప్రయాణించే విమానం ఆంధ్రప్రదేశ్ గగనతలంపై ఎగురుతుంది? 1) భువనేశ్వర్, ఢిల్లీ 2) ముంబై, వారణాసి 3) చెన్నై, పుణే 4) కోజికోడ్, చెన్నై 4. రేఖాంశాల మధ్య భారతదేశ విస్తృతిని ఏ ప్రాంతాల మధ్య కొలిచారు? 1) గుజరాత్ నుంచి మిజోరాం వరకు 2) రాజస్థాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 3) రాణా ఆఫ్ కచ్ నుంచి మిజోరాం వరకుట 4) రాణా ఆఫ్ కచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమాధానాలు: 1) 2; 2) 2; 3) 4; 4) 4.