
డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్ విడుదల
విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు.
డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. 28న నియామకపత్రాల జారీ, 29న వెబ్ కౌన్సిలింగ్, జూన్ 1న పోస్టింగ్లు ఇవ్వనున్నారు. మొత్తం 10,313 పోస్టులకు ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు గంటా తెలిపారు.