బయాలజీ - మెథడాలజీ (ఎస్.ఎ.)
జీవశాస్త్రం
బయాలజీ పదం ‘బయోస్ - లాగస్’ అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. బయోస్ అంటే జీవం అని, లాగస్ అంటే అధ్యయనం అని అర్థం. బయాలజీ పదాన్ని కనుగొన్నవారు - జీన్ బాప్టిస్ట్ లా మార్‌క.
జీవశాస్త్రంలోని శాఖలు:
ప్రాథమిక శాఖలు (ప్యూర్ సెన్సైస్)
అనువర్తిత శాఖలు (అప్లయిడ్ సెన్సైస్)
సంబంధిత శాఖలు (రిలేటెడ్ సెన్సైస్)
ప్రాథమిక శాఖలు: జీవశాస్త్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు.
1) వృక్షశాస్త్రం (బోటనీ). బొటానీ అంటే మొక్క అని అర్థం.
2) జంతుశాస్త్రం (జువాలజీ). జోవన్ అంటే జంతువు, లాగస్ అంటే అధ్యయనం అని అర్థం.
బాహ్య స్వరూపశాస్త్రం: జీవుల బాహ్య లక్షణాల గురించి తెలియజేస్తుంది.
అంతర్నిర్మాణ శాస్త్రం: జీవుల అంతర భాగాలను గురించిన అధ్యయనం
శరీర ధర్మ శాస్త్రం: జీవుల అవయవ వ్యవస్థలను గురించి తెలియజేస్తుంది.
జన్యుశాస్త్రం: జీవుల్లో అనువంశిక లక్షణాల గురించిన అధ్యయనం.
వర్గీకరణ శాస్త్రం: లక్షణాల ఆధారంగా జీవులను సమూహాలుగా విభజించే పద్ధతి గురించి తెలియజేస్తుంది.
ఆవరణ శాస్త్రం: జీవుల ఆవాసాలను గురించి తెలిపే శాస్త్రం.
పిండోత్పత్తి శాస్త్రం: జీవుల పుట్టుక ప్రాథమిక దశలను గురించి వివరిస్తుంది.
జీవ పరిణామ శాస్త్రం: సరళ జీవుల నుంచి సంక్లిష్ట జీవులు ఏర్పడిన విధానం గురించి తెలియజేస్తుంది.
జీవశాస్త్ర అనువర్తిత శాఖలు
రెండు శాస్త్ర శాఖలు కలువగా ఏర్పడిన నూతన శాఖను అనువర్తిత శాఖ అంటారు.
ఉదాహరణ: జీవరసాయన శాస్త్రం (బయో కెమిస్ట్రీ) - జీవ భౌతిక శాస్త్రం (బయో ఫిజిక్స్) - జీవ సాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ)
సూక్ష్మ జీవశాస్త్రం (మైక్రో బయాలజీ)
వైరాలజీ: వైరస్‌ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
వ్యాధి నిరోధక శాస్త్రం (ఇమ్యునాలజీ)
ఏరో బయాలజీ: పుప్పొడి రేణువులు, సిద్ధ బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెందే విధానం గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ): అణు స్థాయిలో జీవుల అధ్యయనం.
ఫైలోజైని: ఒక తెగ లేదా సమూహ జీవుల పుట్టుక గురించి తెలిపే శాస్త్రం.
జీవ ఖగోళ శాస్త్రం (ఆస్ట్రో బయాలజీ/ గ్జెనో బయాలజీ/ ఎక్సో బయాలజీ): భూగోళానికి వెలుపల జీవం ఉండటానికి గల అవకాశం గురించి తెలిపే శాస్త్రం.
రేడియో ధార్మిక శాస్త్రం: రేడియో ధార్మిక పదార్థాల లక్షణాలకు సంబంధించింది.
మెరైన్ బయాలజీ: సముద్ర జీవుల గురించిన శాస్త్రం.
జీవశాస్త్ర సంబంధిత శాఖలు
వైద్యశాస్త్రం (మెడిసిన్), వ్యవసాయ శాస్త్రం (అగ్రికల్చర్), ఉద్యాన వన శాస్త్రం (హార్టీకల్చర్)
గతంలో అడిగిన ప్రశ్నలు
1. ప్రకృతిలో సమన్వయంగా జీవించడాన్ని సంస్కృతి నేర్పితే, ఆ ప్రకృతి గురించి స్పష్టమైన అవగాహన కలిగించేది?
(డీఎస్సీ - 2004)
1) జీవరాశి 2) జీవన విధానం
3) జీవశాస్త్రం 4) జీవితం
2. స్తబ్ధ దృష్టిలో విజ్ఞానశాస్త్రం అంటే?
(డీఎస్సీ - 2006)
1) యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణ
2) నిరంతర పరిశీలన ద్వారా మనం మన గురించి, విశ్వం గురించి తెలుసుకోవడం
3) ఒక క్రియాత్మకత
4) తమ మధ్య సంబంధాలున్న సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు క్రమబద్ధమైన సమాచారం ఉన్న విభాగం
3. జీవశాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందనిది? (డీఎస్సీ - 2006)
1) పద్ధతులు 2) వైఖరులు
3) భావనలు 4) ప్రక్రియలు
4. భారతదేశంలో అధిక ఆహారోత్పత్తికి (పెరుగుతున్న జనాభా దృష్ట్యా) దోహద పడినవి? (డీఎస్సీ - 2006)
1) హరిత, శ్వేత, నీలి విప్లవాలు
2) పసుపు, హరిత, శ్వేత విప్లవాలు
3) శ్వేత, నీలి, ఎరుపు విప్లవాలు
4) పసుపు, ఎరుపు, హరిత విప్లవాలు
5. విజ్ఞాన శాస్త్ర భావనలు, నియమాలు రూపొందించడానికి ఆధారాలు?
(డీఎస్సీ - 2008)
1) స్ఫురణ అనుభవాలు
2) ఆత్మశ్రమ అనుభవాలు
3) అనుభావాత్మక పరిశీలనలు
4) అనుకరణ అనుభవాలు
6. విజ్ఞాన శాస్త్రంలోని అన్ని ఇతర సబ్జెక్ట్‌ల కంటే జీవశాస్త్రం ప్రాథమికమైంది, ముఖ్యమైంది. ఎందుకంటే?
(డీఎస్సీ - 2012)
1) జీవరాశుల ప్రాథమిక అవసరాలు తీర్చడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది
2) సృజనాత్మకతను పోషిస్తుంది
3) జ్ఞాన విస్ఫోటనానికి మార్గం సుగ మం చేస్తుంది
4) భూమాతను అవగాహన చేసుకోవడానికి సహాయపడుతుంది
సమాధానాలు
1) 3; 2) 4; 3) 3;
4) 1; 5) 3; 6) 1.
మాదిరి ప్రశ్నలు
1. విజ్ఞానశాస్త్రమంటే ఒక మాపనం అని, దీని అన్వేషణకు విశ్వం ముడి పదార్థం అని ఒక విద్యార్థి నిర్వచనాలను నేర్చుకుంటున్నాడు. ఇవి కిందివారిలో ఎవరికి సంబంధించినవి?
1) అఅఅట క్లీడీ బెర్నార్‌డ
2) క్లీడీ బెర్నార్‌డ - ఆక్స్‌ఫర్‌డ డిక్షనరీ
3) కార్‌ల పియర్‌సన్- కొలంబియా విజ్ఞాన సర్వస్వం
4) అర్హీనియస్ - కార్‌ల పియర్‌సన్
2. గతిశీల దృష్టితో చూసినప్పుడు విజ్ఞాన శాస్త్రమంటే క్రియాత్మకత. దీనికి సరైన ఉదాహరణ?
1) పద్ధతులు 2) భావన
3) సిద్ధాంతం 4) నియమం
3. ‘కళల అధ్యయనం వల్ల వ్యక్తిగత అభివృద్ధి - శాస్త్ర అధ్యయనం వల్ల వ్యక్తిగత, సమాజ ప్రయోజనం కలుగుతాయి.’ ఈ ప్రవచనాన్ని బలపరిచే విజ్ఞానశాస్త్ర నిర్వచనాన్ని ఇచ్చినవారు?
1) ఐన్‌స్టీన్ 2) కార్‌ల పియర్‌సన్
3) క్లేడీ బెర్నార్‌డ 4) అర్హీనియస్
4. జీవశాస్త్ర సంబంధిత శాఖకు ఉదాహరణ ఇవ్వమని ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు ఎ వైరాలజీ అని, బి వ్యవసాయ శాస్త్రం అని సి వైద్యశాస్త్రం అని తెలిపారు. వీరిలో సరైన ఉదాహరణలు ఇచ్చినవారు?
1) ఎ, బి లు తప్పు సి ఒప్పు
2) ఎ, సి లు తప్పు, బి ఒప్పు
3) ఎ ఒప్పు, బి, సి లు తప్పు
4) ఎ తప్పు, బి, సి లు ఒప్పు
5. ‘శాస్త్రీయ సత్యాలు సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉన్న అంచనాలు మాత్రమే’ అని పేర్కొన్నవారు?
1) కార్‌ల పియర్‌సన్ 2) స్వామి వివేకానంద
3) అర్హీనియస్ 4) ఐన్‌స్టీన్
6. అంతరిక్షయానంలో రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే?
1) ప్రయాణించే దిశకు వ్యతిరేక దిశలో తల ఉండేటట్లు చూసుకోవాలి
2) ఎగిరే దిశకు సమాంతరంగా పడు కోవాలి
3) క్లోరెల్లా అనే శైవలం దగ్గరుండాలి
4) నిద్రపోకుండా మేల్కొని ఉండాలి
7. దత్తాంశాల ఆధారంగా పరిష్కారాన్ని ఊహించడం అనేది, కిందివాటిలో దేనికి సంబంధించింది?
1) నియమం 2) ప్రాకల్పన
3) సిద్ధాంతం 4) భావన
8. శాస్త్ర నియమం అంటే నిరూపితమైన సాధారణీకరణ అని తెలియజేసింది?
1) అఅఅట
2) శాస్త్రీయ మానవశక్తి పథకం
3) కొలంబియా ఎన్‌సైక్లోపీడియా
4) ఆక్స్‌ఫర్‌డ డిక్షనరీ
9. ‘రక్తంలోని ీహిమోగ్లోబిన్‌కు రక్తం ఆక్సిజన్ రవాణా చేయడానికి సంబంధం ఉండ వచ్చు’ అనే ఊహను ఏర్పరచుకొని ఒక శాస్త్రవేత్త పరిశోధన కొనసాగిస్తే, ఆయన ఏ రకమైన ప్రాకల్పన ఏర్పరచుకున్నట్లు?
1) ప్రాగుక్తీ ప్రాకల్పన
2) శూన్య ప్రాకల్పన
3) ప్రకటనాత్మక ప్రాకల్పన
4) ప్రశ్నా ప్రాకల్పన
10. కిందివాటిలో ఏ అంశం ఆధారాలు చూపినప్పటికీ నిరూపితం కాలేదు?
1) సూత్రం 2) నియమం
3) సత్యం 4) సిద్ధాంతం
11. జన్యుశాస్త్రం కిందివాటిలో ఏ రకమైన శాఖకు ఉదాహరణ?
1) ప్రాథమిక 2) అనువర్తిత
3) సంబంధిత శాఖ 4) సాంకేతిక
12. విజ్ఞానశాస్త్ర భావనలు, నియమాలు రూపొందించడానికి ఆధారాలు?
1) స్ఫురణ అనుభవాలు
2) ఆత్మాశ్రయ అనుభవాలు
3) అనుభవాత్మక పరిశీలనలు
4) అనుకరణ అనుభవాలు
13. ఇక్రిశాట్ సంస్థ ప్రధాన లక్ష్యం?
1) హెచ్‌ఐవీపై పరిశోధన
2) ప్రపంచ జనాభాకు సరిపడే ఆహార ధాన్యాల ఉత్పత్తి
3) ప్రజలను పీడిస్తున్న వ్యాధులపై పరి శోధన
4) భారతదేశంలో కాలుష్య నివారణ
సమాధానాలు:
1) 4; 2) 1; 3) 3; 4) 4; 5) 2;
6) 2; 7) 2; 8) 3; 9) 1; 10) 4;
11) 1; 12) 3; 13) 2.
అంతరిక్షయానంలో రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే?
Published Mon, Sep 15 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement
Advertisement