డీఎస్సీ అభ్యర్థులపై తెలుగు తమ్ముళ్ల దాడి | TDP workers to attack on DSC candidates in Guntur | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థులపై తెలుగు తమ్ముళ్ల దాడి

Published Fri, Dec 11 2015 6:14 PM | Last Updated on Fri, Aug 10 2018 6:50 PM

డీఎస్సీ అభ్యర్థులపై తెలుగు తమ్ముళ్ల దాడి - Sakshi

డీఎస్సీ అభ్యర్థులపై తెలుగు తమ్ముళ్ల దాడి

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ దౌర్జన్యాలు ఆగడం లేదు. అధికార పార్టీ అండ చూసుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. డీఎస్సీకి సంబంధించి లిస్టును విడుదల చేయాలని అడిగినందుకు.. డీఎస్సీ అభ్యర్థులపై తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో వంద వసంతాలు పూర్తి చేసుకున్న నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం నరసరావుపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సభలో డీఎస్సీ-2014 లిస్ట్‌ను విడుదల చేయాలని డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో గందరగోళం చోటుచేసుకుంది. దాంతో వారిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో డీఎస్సీ అభ్యర్థి తలకు గాయమైంది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement