‘దాని రహస్యం కవికే తెలుసు’ | Modern literary movements | Sakshi
Sakshi News home page

‘దాని రహస్యం కవికే తెలుసు’

Published Wed, Oct 1 2014 12:54 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Modern literary movements

 ఆధునిక సాహిత్య ఉద్యమాలు
 
  2012 డీఎస్సీ (ఎస్.ఎ., ఎస్‌జీటీ), ఎల్‌పీసెట్‌లో అడిగిన ప్రశ్నలు
 1.    గుర్రం జాషువా ఏ కవితో కలిసి జంట కవి అవుదామనుకున్నాడు?
     1) దీపాల పిచ్చయ్యశాస్త్రి
     2) ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
     3) పిలకాగణపతిశాస్త్రి
     4) దివాకర్ల తిరుపతి శాస్త్రి
 2.    విజయశ్రీ కావ్యంలో ఇతివృత్తం?
     1) రామాయణ సంబంధమైంది
     2) భారత సంబంధమైంది
     3) భాగవత సంబంధమైంది
     4) ఉపనిషత్ సంబంధమైంది
 3.    హెర్మిట్‌కు అనువాదమైన రాయప్రోలు వా రి రచన?
     1) తృణకంకణం     2) స్నేహలత
     3) లలిత     4) అనుమతి
 4.    ‘‘ధారుణీపతిపాలన దండమెపుడ
     నీ హలంబు కన్నను ప్రార్థనీయమగునె’’
     అని కర్షకుని కీర్తించిన కవి?
     1) తుమ్మల సీతారామమూర్తి
     2) దువ్వూరి రామిరెడ్డి
     3) జంధ్యాల పాపయ్యశాస్త్రి
     4) కట్టమంచి రామలింగారెడ్డి
 5.    ‘‘తెలుగునాట భక్తిరసం తెప్పలుగా
     పారుతోంది
     {Oyెనేజీ స్కీములేక డేంజరుగా
     మారుతోంది’’ అన్న కవి?
     1) చెరబండరాజు    
     2) సి. విజయలక్ష్మి
     3) ముకురాల రామారెడ్డి
     4) గజ్జెల మల్లారెడ్డి
 6.    కందుకూరి వీరేశలింగం ‘సత్యరాజా పూర్వ దేశయాత్రలు’కు ఆధారమైన ఆంగ్ల రచన?
     1) డాన్ క్విక్జోట్
     2) గలివర్‌‌స ట్రావెల్స్
     3) పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్
     4) కాంటర్బరీ టేల్స్
 7.    ఆధునిక కవిత్వంలో రాయప్రోలు సుబ్బా రావు లేవనెత్తిన ప్రణయ సిద్ధాంతం?
     1) కుల పాలికా ప్రణయం
     2) కరుణవిప్రలంభం
     3) అమలిన శృంగారం
     4) విప్రలంభ శృంగారం
 8.    ‘5, 3, 2 ఆముక్త మాల్యద
     ఆటవెలది ద్విపదకత్తగారు’ లోని ధోరణి?
     1) వాస్తవిక ధోరణం
     2) అధివాస్తవిక ధోరణి
     3) క్యూబిజమ్
     4) గతితార్కికవాద ధోరణి
 9.    ‘ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్త రక్తాన్ని ఇంజెక్టు చేయడానికొస్తున్న వీరి గుండెల్లోంచి ధైర్యంగా స్థయిర్యంగా దూసు కొచ్చిన కేకలు’ ఇది ఏ రకమైంది?
     1) పైగంబర కవిత    
     2) అభ్యుదయ కవిత
     3) దిగంబర కవిత
     4) అకవిత
 10.    జానపద సాహిత్య ప్రధాన లక్షణాల్లో ఒకటి?
     1) అనామక లేదా సామూహిక కర్తృత్వం    2) నిర్ణీత రచనా కాలం
     3) కృతక శైలి    4) లిఖిత రచన
 11.    ‘అప్పగింతలు పాటలు’, ‘అలక పాటలు’ ఏ శాఖకు చెందిన గేయాలు?
     1) శ్రామిక గేయాలు        2) పారమార్థిక గేయాలు
     3) బాల గేయాలు        
     4) స్త్రీల పాటలు
 12.    కవి ఒక అవిస్పష్ట వాంఛాంకురం ఒక అంత ర్నిగూఢ తాపం, ఒక చిన్న కావ్యంలో ఊదబడినచో అది?
     1) విప్లవ కవిత్వం    
     2) అభ్యుదయ కవిత్వం
     3) ఆధ్యాత్మిక కవిత్వం         
     4) భావ కవిత్వం
 13.    ‘కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు. కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు’ అన్న కవి?
     1) బాలగంగాధర తిలక్
     2) దాశరథి
     3) అనిసెట్టి సుబ్బారావు    
     4) బెల్లంకొండ రాందాసు
 14.    ‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, చివరకు వంటింటి గిన్నెల న్నిటి పైనా మానాన్నపేరే’ అనే కవిత -
     1) మైనారిటీ వాత కవిత        2) స్త్రీవాద కవిత
     3) దళితవాద కవిత       4) భావ కవిత
 15.    దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ‘ఊహా ప్రేయసి’?
     1) శశికళ     2) వత్సల
     3) మధరప్రమీల    4) ఊర్వశి
 16.    ‘ఎలాంటి సందర్భంలోనూ మీరు నిషిద్ధాక్షరి చెయ్యడం పెట్టుకోవద్దు’ అని శ్రీపాదవారికి సలహా ఇచ్చినవారు?
     1) పురాణపండ సుబ్బయ్యశాస్త్రి        2) వెంకటరాయశాస్త్రి
     3) పేర పేరయ్య శాస్త్త్రి        
     4) రామకృష్ణశాస్త్త్రి
 17.    అనుభూతివాదంలోని ముఖ్య లక్షణం?
     1) కళ కళ కోసం    
     2) కళ సామాజిక ప్రయోజనం కోసం
     3) నైతిక విలువలను ప్రచారం చేయడం
     4) ఆధ్యాత్మిక సందేశం ఇవ్వడం
 18.    ‘వేదాంతులు జీవితాన్నీ, ప్రకృతినీ అవగా హన చేసుకున్నారు. మేం లోకాన్ని, జీవి తాన్ని ప్రకృతిని కూడా మారుస్తాం’ అన్న శ్రీరంగం నారాయణ బాబు మాటలు దేనికి ప్రాతినిధ్యం వహిస్తాయి?
     1) దిగంబర కవిత    2) అభ్యుదయ కవిత
     3) భావ కవిత     4) విప్లవ కవిత
 19.    జానపదోచ్ఛారణలో కిందివిధంగా  ఉంటుంది?
     1) ఒత్తులు నిలుస్తాయి        2) పదాదివకారం నిలుస్తుంది
     3) మూర్దన్య దంత మాలీయభేద
         నిలుస్తుంది        
     4) చకారం సకారం అవుతుంది
 20.    ‘కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు
     కృతిని జెందువాడు మృతుడుగాడు’ అన్న కవి?
     1) దాశరథి     2) కృష్ణశాస్త్రి
     3) జాషువా    4) కరుణశ్రీ
 21.    ‘నా అక్షరాలు కన్నీటి జడుల్లో
     తడిసిన దయాపారావతాలు’ అన్న కవి?
     1) దాశరథి కృష్ణమాచార్యులు        2) జంధ్యాల పాపయ్యశాస్త్రి
     3) దేవరకొండ బాలగంగాధర తిలక్
     4) దేవులపల్లి కృష్ణశాస్త్రి
 22.    ‘సిప్రాలి’ అంటే
     1)    సింహాద్రి శతకం - ప్రామాణిక శతకం - లింగాష్టకం    
     2)    సింహగిరి వచనాలు, ప్రాసాక్షరాలు, అవనిజాలు
     3)    సిరిసిరిమువ్వశతకం-ప్రాసకీడలు, లిమరిక్కులు
     4)    సిరిసిరిమువ్వ శతకం- ప్రాలేయ శతకం- లింగశతకం
 23.    ‘నువ్వు చెప్పేదేదైనా నీ అనుభవంలో నుంచి పలకాలని చెప్పే ప్రాథమిక సూత్రం’ ఉన్న కవితా ధోరణి ఏది?
     1) వ్యక్తిత్వవాద కవిత్వం        2) అస్తిత్వవాద కవిత్వం
     3) అనుభూతివాద కవిత్వం        
     4) ప్రతీకవాద కవిత్వం
 24.    కన్యక ద్వారా గురజాడ చెప్పదలచింది?
     1) ఆత్మగౌరవాన్ని     
     2) పదం పద్యం గొప్పదనాన్ని
     3) కన్యక గొప్పదనాన్ని
     4) రాజు సాహసాన్ని
 25.    బధిర చతుష్టయం ప్రహసన కర్త?
     1) పానుగంటి    2) గురజాడ
     3) చిలకమర్తి    4) కందుకూరి
 26.    దిగంబర కవుల్లో ఒకరు?
     1) కుందుర్తి ఆంజనేయులు        2) కె.వి. రమణారెడ్డి
     3) నగ్నముని     4) వరవరరావు
 27.    జానపద గేయంలో రామాయణం పాటలు ఏ శాఖకు చెందినవి?
     1) శృంగార గేయాలు        2) శ్రామిక గేయాలు
     3) పౌరాణిక గేయాలు
     4) చారిత్రక గేయాలు
 28.    వేదుల సత్యనారాయణ ఏ శాఖకు చెందు తారు?
     1) అభ్యుదయ కవిత  2) భక్తి కవిత
     3) భావ కవిత    4) సంప్రదాయ కవిత
 29.    పానుగంటి ‘జంఘాలశాస్త్రి’ని గుర్తుకు తెచ్చే సురవరం పాత్ర ఏది?
     1) విశ్వామిత్ర    2) యుగవతి
     3) రామ్మూర్తి     4) చిత్రగుప్తుడు
 30.    తామసి పాఠ్యభాగం ఏ కవితా శాఖకు చెందుతుంది?
     1) ప్రణయ కవిత్వం
     2) అభ్యుదయ కవిత్వం
     3) భావ కవిత్వం    
     4) విప్లవ కవిత్వం
 31.    బిరుదు రాజు రామరాజు దేనికి ప్రసిద్ధులు?
     1) కావ్య పరిష్కరణ శాస్త్రం రాసినందుకు
     2) విశ్వవిద్యాలయ ఆచార్యులైనందుకు
     3)    జానపద సాహిత్యంపై మొదట పరి శోధన చేసినందుకు
     4) జానపద సాహిత్యాన్ని సేకరించినందుకు
 32.    అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి రచన ఏది?
     1) తొలకరి    2) ఆంధ్రపురాణం
     3) రాష్ట్ట్రగానం    4) జన్మభూమి
 33.    భావకవితా లక్షణాల్లో ప్రధానమైంది?
     1) ఇంద్రియ సుఖం       2) కొత్తదనం
     3) అంతర్ముఖత్వం       4) బహిర్ముఖత్వం
 34.    అమలిన శృంగారానికి  ఉదాహరణగా నిల్చిన కావ్యం?
     1) రమ్యాలోకనం     2) మాధురీదర్శనం
     3) తృణకంకణం     4) కష్టకమల
 35.    ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ ఏవిధంగా ప్రసిద్ధి చెందింది?
     1)    రామాయణాన్ని తెలుగులో కావ్యంగా  రాసినందుకు        
     2)    ద్విపద రామాయణాన్ని అనువాదం చేయనందుకు
     3)    మొదటి జ్ఞానపీఠ్ అవార్డు తెలుగులో పొందినందుకు    
     4)    కేంద్ర సాహిత్య అకాడమీ ఆవార్డు పొందినందుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement